అనంతపురం ఎడ్యుకేషన్ : నగరంలోని నవోదయకాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 3వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రెండు ఫొటోలతో నేరుగా తనను కలవాలని సూచించారు.