త్రిపురాంతకం (ప్రకాశం) : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందింది. మండలంలోని సంగం తండాకు చెందిన శ్రావణి బాయి(12) స్థానిక గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.