మాట్లాడుతున్న లక్ష్మీబాయి
మణికొండ: రాబోయే రోజుల్లో ఆంగ్లభాష ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం అవుతుందని, దాన్ని నేర్చుకునేందుకు ప్రతి గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి పేర్కొన్నారు. గండిపేట మండలం నార్సింగి గురుకుల బాలకల పాఠశాలలో ఆరు రోజులుగా తల్లిదండ్రులకు బోలో ఇంగ్లీష్ ధనాధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డెవలప్‌మెంట్ ఆఫ్ అలుమి రిలేషన్స్ ప్రత్యేక అధికారి కొరివి వినయకళ అధ్యక్షత వహించగా ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచభాషగా పిలుస్తున్న ఆంగ్లభాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
విద్యార్థులకు తాము పాఠశాలల్లో ఆంగ్లంలో బోధిస్తున్నా తల్లిదండ్రులు వారితో మాట్లాడలేక పోవటంతో పూర్తి స్థాయి ఫలితం రావడం లేదన్నారు. అందుకే తల్లిదండ్రులకు సైతం ఆగ్లభాష నేర్చించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు ఆంగ్లభాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని సమగ్రంగా వివరించారని, రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామన్నారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తల్లితండ్రులు ఆంగ్లం నేర్చుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించే దిశగా వారితోనే పోటీ పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీఓలు, ప్రిన్సిపాల్‌లు, కోఆర్డినేటర్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment