వర్చువల్ విధానంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసెట్ కోచింగ్ అనేది తల్లిదండ్రులకు భారంగా మారింది. వేల రూపాయిల ఫీజుల కట్టలేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక భారంతో ప్రతిభ ఉండి కూడా పలువురు సాధారణ డిగ్రీలతో సరిపెట్టుకుంటున్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ధ్యేయంతో ప్రభుత్వం ముందుకొచ్చి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఉచిత ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
సత్తెనపల్లి: ఆటపాటలకు, నాణ్యమైన విద్యా బోధనకు నెలవైన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ సంస్థల్లో శిక్షణ పొందలేని గురుకుల విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో తరగతుల్ని నిర్వహిస్తోంది.
ప్రతిభ ఆధారంగా ఎంపిక
జిల్లాలోని పలు ప్రాంతాల్లోని గురుకుల కళాశాలలకు చెందిన 91 మంది విద్యార్థినుల్ని(ఎంపీసీ, బైపీసీ) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఐఐటీ అ«ధ్యాపకులు వీరికి వర్చువల్ తరగతులు (ఆన్‌లైన్, ప్రత్యక్ష ప్రసారాలు) ద్వారా నలభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గత నెల 20 నుంచి రామకృష్ణాపురంలో శిక్షణ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా ఇస్తున్నారు. మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందించారు. వారానికి గ్రాంట్ టెస్ట్ 160 మార్కులతో నిర్వహిస్తున్నారు. డైలీ పరీక్షలు నిర్వహిస్తూ సామర్థ్యాల్ని అంచనా వేస్తున్నారు. ప్రతి ఆదివారం గురుకులాల కార్యదర్శి కల్నల్ రాములు విద్యార్థినులతో ఆన్‌లైన్‌లో ఇంట్రాక్ట్ అవుతూ సలహాలు ఇస్తున్నారు. శిక్షణా కేంద్రాన్ని సాక్షి సందర్శించింది. విద్యార్థుల అభిప్రాయాలు..
Comments
Please login to add a commentAdd a comment