free coaching centres
-
నియోజకవర్గానికో ఉచిత కోచింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గానికి ఒకటి చొప్పున శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్సన్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గో పాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, జేడీ అలోక్ కుమార్ డీడీఆశన్న, ఎస్ఈ కార్పో రేషన్ డీడీ రామారావు, మైనారిటీ వెల్ఫేర్ డీడీ ఖాసీం, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో జర భద్రం!) -
వర్సిటీల్లో గ్రూప్స్‌కు ఫ్రీ కోచింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కోచింగ్ కోసం విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ‘కొలువు కొట్టాల్సిందే’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించగా స్పందించిన ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. వర్సిటీల పరిధిలోని వేలాది మంది విద్యార్థులు కోచింగ్ కోసం అప్పులు చేయడం సరికాదని, వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి చెప్పారు. దీంతో రాష్ట్రంలోని 6 వర్సిటీల ఉప కులపతులతో ఆయన సంప్రదింపులు జరిపారు. అనంతరం ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి శిక్షణ కార్యక్రమాన్ని సబితారెడ్డి ప్రారంభించి అన్ని వర్సిటీల వీసీలతో చర్చిస్తారని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. నిపుణులైన అధ్యాపకులను గుర్తించండి కోచింగ్ కోసం వర్సిటీల్లోని నిపుణులైన అధ్యాపకులను గుర్తించి వారి వివరాలు పంపాలని వీసీలకు లింబాద్రి సూచించారు. అవసరమైతే బయటి నుంచి కూడా ఫ్యాకల్టీని తీసుకోవాలన్నారు. గ్రూప్స్ అభ్యర్థులకు వర్సిటీ హాస్టళ్లల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని మంత్రి సూచించినట్టు అధికారులు తెలిపారు. ‘సాక్షి’ కథనం కదిలించింది సామర్థ్యం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అభ్యర్థుల దయనీయ కథనం కదిలించేలా ఉంది. వర్సిటీల్లో వేలాది మంది పేద, మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లున్నారు. వారి సమర్థతకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదన్న ఉద్దేశంతో ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడా రాజీ పడకుండా మంచి ఫ్యాకల్టీతో కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. వర్సిటీ విద్యార్థులు అనవసరంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దు. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
50 వేల మందికి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ కల్పనలో పోలీస్ శాఖ కీలకంగా పనిచేస్తోంది. యువతకు నిర్దిష్టమైన ప్రణాళికతో ఫ్రీ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలో తాజా నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50వేల మం దికిపైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతంలో 5,800 మందికి ముందస్తు కోచింగ్ ఇవ్వగా 1,300 మందికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు లభించాయి. వరంగల్ పరిధిలో 2 వేల మందికిగాను 324 మందికి కొలువులు వచ్చాయి. పోలీస్ శాఖలో 18 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో మరోసారి కీలకపాత్ర పోషించ బోతోంది. నగర కమిషనరేట్ పరిధిలోని 5 జోన్లలో వెయ్యి మంది చొప్పున శిక్షణ ఇప్పించాలని కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. మహిళా అభ్యర్థులు ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి వారికి ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇండోర్, ఔట్ డోర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇండోర్‌లో రాత పరీక్ష కోసం ఆయా సబ్జెక్టులపై నిష్ణాతులైనవారితో క్లాసులు నిర్వహించి, ప్రతివారం టెస్టులు పెట్టనున్నారు. ఔట్‌డోర్‌లో ఫిజికల్ టెస్టుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్రోల్మెంట్కు స్పందన భారీగా ఉంటే స్క్రీనింగ్ కూడా అదే స్థాయిలో నిర్వహించి 5 వేల మందిని ఎంపిక చేసి కోచింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సైబరాబాద్‌లో షురూ.. ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రెండు రోజుల క్రితమే శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. శంషాబాద్ జోన్లో 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. మిగిలిన జోన్లలోనూ ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వాలని సీపీ భావిస్తున్నట్టు కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇచ్చిన కోచింగ్‌లోనూ సత్ఫలితాలు వచ్చినట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాచకొండలోనూ ఏర్పాట్లు రాచకొండ కమిషనరేట్‌లోనూ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సీపీ మహేశ్ భగవత్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. యూపీఎస్సీలో అనేకమంది అభ్యర్థులకు మార్గదర్శకులుగా వ్యవహరించి, అద్భుత ఫలితాలు సాధించిన అధికారిగా మంచి గుర్తింపు పొందిన ఆయన పోలీస్ ఉద్యోగాల భర్తీలోనూ ప్రముఖ పాత్ర పోషించనున్నారు. యువతకు వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా గైడ్ చేస్తున్నారు. మూడు జోన్ల పరిధిలో ఎన్రోల్మెంట్ నిర్వహించి ప్రత్యేక క్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిసింది. అటు జిల్లాల్లోనూ... ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, సూర్యాపేట నుంచి నిజామాబాద్ వరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో జిల్లాకు వెయ్యి మంది చొప్పున ముందస్తు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో రామగుండం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ కమిషనరేట్లలో ఇచ్చిన శిక్షణ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈసారి యువత భారీస్థాయిలో పోటీ పడుతుండటంతో ముందస్తు శిక్షణ స్పందన అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. -
సుమార్గ్ శిక్షణతో అద్భుత ఫలితాలు
సాక్షి, కేయూ క్యాంపస్: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యువత ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఏర్పాటుచేసిన సుమార్గ్ ఉచిత శిక్షణలో అద్భుత ఫలితాలు సాధించామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. సుమార్గ్ ఉచిత శిక్షణ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిం చిన యువతకు సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని సేనెట్‌హాల్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు సీపీ ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. సుమార్గ్ రెండోవిడత ఉచిత శిక్షణ తరగతులకు 300ల మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వగా 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. ఇందులో ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్లు 40మంది, కానిస్టేబుళ్లుగా 165మంది, మరో 49మం ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా శిక్షణ అందించిన అభ్యర్థుల్లో 80శాతం మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. మీరు ప్రతిభతో సాధించిన ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నతస్థాయికి ఎదిగే విధంగా కృషిచేయాలని ఆయన కోరారు. సుమార్గ్ శిక్షణ అందించటంలో పూర్తి సహకారం అందించిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. అనంతరం శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతకు పోలీస్ కమిషనర్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతేగాకుండా శిక్షణ ఇచ్చిన పోలీస్ అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ గిరిరాజు, ఎసీపీలు శ్రీధర్, శ్యాంసుందర్, శ్రీనివాస్, ఆర్ఐ సతీష్, హతీరాం, శ్రీనివాస్‌రావు, నగేష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, కేయూ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజు పాల్గొన్నారు. -
ఎస్సీ నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త. పేరొందిన శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ ట్రేడుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. కుటుంబ వార్షికాదాయం రూ.2లక్షలు మించకుండా 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 7 నుంచి 10 వరకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి అర్హత, ఆసక్తిని బట్టి ఆయా ట్రేడులలో శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. ఇందుకు నియోజవకవర్గాల వారీగా హరిజన బస్తీలను ఎంపిక చేశారు. అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు 16 ప్రధాన శిక్షణ సంస్థలతో ఎస్సీ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎంపిక శిబిరాలు... ♦ ఈ నెల 7న ఉదయం 11గంటలకు సైదాబాద్‌లోని పోచమ్మ బస్తీ మహిళా భవన్లో నిర్వహించనున్న శిబిరానికి గాంధీనగర్(మలక్‌పేట), హరిజన బస్తీ(చాంద్రాయణగుట్ట), చంద్రయ్య హట్స్(యాకుత్‌పురా), నర్సారెడ్డి నగర్ కాలనీ(బహదూర్‌పురా) ప్రాంతాలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కావచ్చు. ♦ 8న పద్మారావునగర్ హమాలీ బస్తీ ఫేజ్–1లోని కమ్యూనిటీ హాల్లో జరిగే శిబిరానికి ప్రేమ్‌నగర్ (ఖైరతాబాద్), వినాయకరావునగర్ (జుబ్లీహిల్స్), హమాలీ బస్తీ ఫేజ్–1 (సనత్‌నగర్), దేవినగర్ (కార్వాన్) ప్రాంతాల అభ్యర్థులు హాజరు కావచ్చు. ♦ 9న నాంపల్లిలోని పటేల్‌నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగే శిబిరానికి అఫ్జల్‌సాగర్–2(నాంపల్లి), బంగ్లాదేశ్ (గోషామహల్), ఎస్వీనగర్ (చార్మినార్)కు చెందిన అభ్యర్థులు హాజరు కావచ్చు. ♦ 10న మారేడుపల్లి అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్లో జరిగే శిబిరానికి రంగారెడ్డి బస్తీ(ముషీరాబాద్), నర్సింహా బస్తీ (అమీర్‌పేట), తుకరాం గేటు(సికింద్రాబాద్), ఆజాద్ చంద్రశేఖర్ బస్తీ (కంటోన్మెంట్) అభ్యర్థులు హాజరు కావచ్చు. శిక్షణ సంస్థలు.. ట్రేడులు ♦ జాతీయ నిర్మాణ రంగ సంస్థ (నాక్): ఫినిషింగ్, స్కూల్ ప్రోగ్రాం, కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగాం, జనరల్ వర్క్స్ సూపర్వైజర్, ఐకియా ఫర్నీచర్, అసెంబ్లింగ్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, డ్రైవాల్ ఫాల్ సిలింగ్, ఎలక్ట్రికల్, హౌస్వైరింగ్, ల్యాండ్ సర్వేయర్, స్టోర్ కీపర్, వెల్డింగ్. ♦ జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ: ఫేష్ ట్రైనింగ్, పంచకర్మ, ఆయుర్వేద స్పా, బేకరీ, హౌస్ కీపింగ్ అండ్ లాండ్రీ, రెస్టారెంట్ సర్వీసెస్. ♦ అపోలో మెడిస్కిల్స్: ఆధునిక కార్డియాలజీ కేర్ టెక్నాలజీ, ఆధునిక ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్స్, ఆధునిక డయాలసిస్ టెక్నిషియన్, అత్యవసర వైద్య నిఫుణులు, సాధారణ సహాయకుడు, దంత సహాయకుడు, రిఫ్రెష్ ట్రైనింగ్ ఫర్ ఏఎస్ఎం, టీఐఏఆర్ఏ ట్రేడ్ ట్రైయినింగ్, రోబోటిక్ సర్జరీ. ♦ కెల్ట్రాన్ ఇన్స్టిట్యూట్: వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డేటాఎంట్రీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ హార్డ్‌వేర్, లాజిస్టిక్ ట్రాన్స్‌పోర్డ్ అండ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ రిటైల్ ప్రొఫెషనల్స్, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్ కోర్సులు. ♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్: క్రాఫ్ట్ మాన్ఫిన్ కోర్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్ మల్టీక్యూజిన్ కుక్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్, రూమ్ అంటెండెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్. ♦ నిమ్స్‌మే సంస్థ: యానిమేషన్, డిజటర్ ఫొటోగ్రఫీ అండ్ విడియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, మేకప్ కోర్సులు. ♦ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ: సీఎస్సీ ఆపరేషన్ వర్టికల్ మెషిన్ సెంటర్, సీఎస్సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్, ఫీల్డ్ ఇంజినీర్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండీషనింగ్ అండ్ వాషింగ్ మెషిన్, ఆర్క్ వెల్డింగ్, వెల్డింగ్, ఫీల్డ్ టెక్నిషియన్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఎలక్ట్రానిక్స్, త్రుహోల్ అసెంబ్లింగ్ ఆపరేటర్, టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్. ♦ టీఎంఐఈ2 అకాడమీ: డీటీహెచ్ ఇన్స్టలేషన్, ఏసీ ఇన్స్టలేషన్. ♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్ఫెక్ట్ సెఫ్టీ అండ్ సర్వే: సీసీ టీవీ ♦ ఆప్షనల్ స్కిల్స్ అండ్ సొల్యూషన్ ఫౌండేషన్: హౌస్ కీపింగ్ ♦ రైజ్: స్మాల్ పౌల్ట్రీఫామ్, బ్రాయిలర్ ఫామ్ వర్కర్ ♦ టెక్నాలెడ్జ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లిమిటెడ్: ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జావా అండ్ టెస్టింగ్. ♦ సెట్విన్ సంస్థ: మొబైల్ సర్వీసింగ్ అండ్ సేల్స్, సీసీటీవీ ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, ఆటోక్యాడ్, బ్యూటిషీయన్. ♦ ఎస్ సంస్థ: మార్కెటింగ్, మార్కెటింగ్ బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్ ♦ క్యాప్ ఫౌండేషన్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ♦ హెల్త్‌కేర్: బ్యూటీ, వెల్నెస్ సేల్స్ అండ్మార్కెటింగ్. -
ఉచిత శిక్షణ ... భవితకు రక్షణ
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసెట్ కోచింగ్ అనేది తల్లిదండ్రులకు భారంగా మారింది. వేల రూపాయిల ఫీజుల కట్టలేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక భారంతో ప్రతిభ ఉండి కూడా పలువురు సాధారణ డిగ్రీలతో సరిపెట్టుకుంటున్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ధ్యేయంతో ప్రభుత్వం ముందుకొచ్చి శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఉచిత ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సత్తెనపల్లి: ఆటపాటలకు, నాణ్యమైన విద్యా బోధనకు నెలవైన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి బాలికల గురుకులం ఎంసెట్ శిక్షణ కేంద్రంగా ఎంపికైంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థినుల్ని ఎంపిక చేసి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ సంస్థల్లో శిక్షణ పొందలేని గురుకుల విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో తరగతుల్ని నిర్వహిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక జిల్లాలోని పలు ప్రాంతాల్లోని గురుకుల కళాశాలలకు చెందిన 91 మంది విద్యార్థినుల్ని(ఎంపీసీ, బైపీసీ) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఐఐటీ అ«ధ్యాపకులు వీరికి వర్చువల్ తరగతులు (ఆన్లైన్, ప్రత్యక్ష ప్రసారాలు) ద్వారా నలభై రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గత నెల 20 నుంచి రామకృష్ణాపురంలో శిక్షణ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సబ్జెక్టుల వారీగా ఇస్తున్నారు. మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందించారు. వారానికి గ్రాంట్ టెస్ట్ 160 మార్కులతో నిర్వహిస్తున్నారు. డైలీ పరీక్షలు నిర్వహిస్తూ సామర్థ్యాల్ని అంచనా వేస్తున్నారు. ప్రతి ఆదివారం గురుకులాల కార్యదర్శి కల్నల్ రాములు విద్యార్థినులతో ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అవుతూ సలహాలు ఇస్తున్నారు. శిక్షణా కేంద్రాన్ని సాక్షి సందర్శించింది. విద్యార్థుల అభిప్రాయాలు.. -
మేం అధికారంలోకొస్తే కోచింగ్ సెంటర్లు ఫ్రీ..!
సీతాపూర్ (ఉత్తరప్రదేశ్): 'మేం అధికారంలోకి వస్తే.. యువత కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి నగరంలో ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం' అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. యూపీలోని సీతాపూర్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఓటర్లపై పలు హామీల వర్షం కురిపించారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోరారు. 'నరేంద్రమోదీగారు.. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదు. మీరు, ప్రధానమంత్రి.. కాబట్టి మీరు కోరుకుంటే వాటిని వెంటనే మాఫీ చేయవచ్చు' అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీరుపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారం కోసం ఎస్పీ-కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీ మధ్య హోరాహోరీ నెలకొన్న సంగతి తెలిసిందే.