సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త. పేరొందిన శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ ట్రేడుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. కుటుంబ వార్షికాదాయం రూ.2లక్షలు మించకుండా 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 7 నుంచి 10 వరకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి అర్హత, ఆసక్తిని బట్టి ఆయా ట్రేడులలో శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. ఇందుకు నియోజవకవర్గాల వారీగా హరిజన బస్తీలను ఎంపిక చేశారు. అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు 16 ప్రధాన శిక్షణ సంస్థలతో ఎస్సీ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
ఎంపిక శిబిరాలు...
♦ ఈ నెల 7న ఉదయం 11గంటలకు సైదాబాద్‌లోని పోచమ్మ బస్తీ మహిళా భవన్‌లో నిర్వహించనున్న శిబిరానికి గాంధీనగర్(మలక్‌పేట), హరిజన బస్తీ(చాంద్రాయణగుట్ట), చంద్రయ్య హట్స్(యాకుత్‌పురా), నర్సారెడ్డి నగర్ కాలనీ(బహదూర్‌పురా) ప్రాంతాలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కావచ్చు.
♦ 8న పద్మారావునగర్ హమాలీ బస్తీ ఫేజ్–1లోని కమ్యూనిటీ హాల్‌లో జరిగే శిబిరానికి ప్రేమ్‌నగర్ (ఖైరతాబాద్), వినాయకరావునగర్ (జుబ్లీహిల్స్), హమాలీ బస్తీ ఫేజ్–1 (సనత్‌నగర్), దేవినగర్ (కార్వాన్) ప్రాంతాల అభ్యర్థులు హాజరు కావచ్చు.
♦ 9న నాంపల్లిలోని పటేల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగే శిబిరానికి అఫ్జల్‌సాగర్–2(నాంపల్లి), బంగ్లాదేశ్ (గోషామహల్), ఎస్వీనగర్ (చార్మినార్)కు చెందిన అభ్యర్థులు హాజరు కావచ్చు.
♦ 10న మారేడుపల్లి అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్‌లో జరిగే శిబిరానికి రంగారెడ్డి బస్తీ(ముషీరాబాద్), నర్సింహా బస్తీ (అమీర్‌పేట), తుకరాం గేటు(సికింద్రాబాద్), ఆజాద్ చంద్రశేఖర్ బస్తీ (కంటోన్మెంట్) అభ్యర్థులు హాజరు కావచ్చు.
శిక్షణ సంస్థలు.. ట్రేడులు
♦ జాతీయ నిర్మాణ రంగ సంస్థ (నాక్): ఫినిషింగ్, స్కూల్ ప్రోగ్రాం, కాంట్రాక్టర్స్ డెవలప్‌మెంట్ ప్రోగాం, జనరల్ వర్క్స్ సూపర్‌వైజర్, ఐకియా ఫర్నీచర్, అసెంబ్లింగ్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, డ్రైవాల్ ఫాల్ సిలింగ్, ఎలక్ట్రికల్, హౌస్‌వైరింగ్, ల్యాండ్ సర్వేయర్, స్టోర్ కీపర్, వెల్డింగ్.
♦ జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ: ఫేష్ ట్రైనింగ్, పంచకర్మ, ఆయుర్వేద స్పా, బేకరీ, హౌస్ కీపింగ్ అండ్ లాండ్రీ, రెస్టారెంట్ సర్వీసెస్.
♦ అపోలో మెడిస్కిల్స్: ఆధునిక కార్డియాలజీ కేర్ టెక్నాలజీ, ఆధునిక ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్స్, ఆధునిక డయాలసిస్ టెక్నిషియన్, అత్యవసర వైద్య నిఫుణులు, సాధారణ సహాయకుడు, దంత సహాయకుడు, రిఫ్రెష్ ట్రైనింగ్ ఫర్ ఏఎస్‌ఎం, టీఐఏఆర్‌ఏ ట్రేడ్ ట్రైయినింగ్, రోబోటిక్ సర్జరీ.
♦ కెల్ట్రాన్ ఇన్‌స్టిట్యూట్: వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డేటాఎంట్రీ, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ అండ్ హార్డ్‌వేర్, లాజిస్టిక్ ట్రాన్స్‌పోర్డ్ అండ్ మేనేజ్‌మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, సేల్స్ అండ్ రిటైల్ ప్రొఫెషనల్స్, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్ కోర్సులు.
♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్: క్రాఫ్ట్ మాన్‌ఫిన్ కోర్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్ మల్టీక్యూజిన్ కుక్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్, రూమ్ అంటెండెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్.
♦ నిమ్స్‌మే సంస్థ: యానిమేషన్, డిజటర్ ఫొటోగ్రఫీ అండ్ విడియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, మేకప్ కోర్సులు.
♦ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ: సీఎస్‌సీ ఆపరేషన్ వర్టికల్ మెషిన్ సెంటర్, సీఎస్‌సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్, ఫీల్డ్ ఇంజినీర్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండీషనింగ్ అండ్ వాషింగ్ మెషిన్, ఆర్క్ వెల్డింగ్, వెల్డింగ్, ఫీల్డ్ టెక్నిషియన్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఎలక్ట్రానిక్స్, త్రుహోల్ అసెంబ్లింగ్ ఆపరేటర్, టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్.
♦ టీఎంఐఈ2 అకాడమీ: డీటీహెచ్ ఇన్‌స్టలేషన్, ఏసీ ఇన్‌స్టలేషన్.
♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్‌ఫెక్ట్ సెఫ్టీ అండ్ సర్వే: సీసీ టీవీ
♦ ఆప్షనల్ స్కిల్స్ అండ్ సొల్యూషన్ ఫౌండేషన్: హౌస్ కీపింగ్
♦ రైజ్: స్మాల్ పౌల్ట్రీఫామ్, బ్రాయిలర్ ఫామ్ వర్కర్
♦ టెక్నాలెడ్జ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ లిమిటెడ్: ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, జావా అండ్ టెస్టింగ్.
♦ సెట్విన్ సంస్థ: మొబైల్ సర్వీసింగ్ అండ్ సేల్స్, సీసీటీవీ ఇన్‌స్టలేషన్ అండ్ సర్వీస్, ఆటోక్యాడ్, బ్యూటిషీయన్.
♦ ఎస్ సంస్థ: మార్కెటింగ్, మార్కెటింగ్ బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్
♦ క్యాప్ ఫౌండేషన్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రికల్, ఆటోమొబైల్
♦ హెల్త్‌కేర్: బ్యూటీ, వెల్‌నెస్ సేల్స్ అండ్‌మార్కెటింగ్.
Comments
Please login to add a commentAdd a comment