unemployeed youth
-
స్మగ్లింగ్ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్‌కు మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉండే జీశాన్, తౌఫిక్, తన్వీర్లతో పరిచయమైంది. ‘దుబాయ్ నుంచి ఓ పార్శిల్ తీసుకురావాలి, విమానం, వీసా ఖర్చులన్నీ మేమే చూసుకుంటం. పార్శిల్ తీసుకొచ్చినందుకు రూ.40 వేలు ఇస్తం’ అన్నారు. డబ్బుల ఆశతో సర్ఫరాజ్ 2018 ఏప్రిల్ 13న దుబాయ్ వెళ్లి, 15న అక్కడ ఓ మనిషిని కలిశాడు. ఆయన ఇచ్చిన పార్శిల్ తీసుకుని నేపాల్ మీదుగా వస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ పార్శిల్లో అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని సర్ఫరాజ్‌పై కేసు పెట్టా రు. ఆ పార్శిల్లో ఏముందో తెలియని సర్ఫరాజ్ మూడేళ్లుగా నేపాల్ జైల్లో మగ్గుతున్నాడు. సర్ఫరాజ్ అరెస్టు కాగానే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లు పరారయ్యారు. అన్యాయంగా ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న తన భర్తను ఎలాగైనా విడిపించాలని సర్ఫరాజ్ భార్య అఫ్రిన్ బేగం మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటోంది. ఒక్క సర్ఫరాజ్ మాత్రమేకాదు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఒకరు, కోరుట్లలో ఒకరు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరొకరు బంగారం స్మగ్లింగ్ ముఠా కారణంగా నేపాల్ జైల్లో మగ్గుతున్నారు. ఈ ముఠాలు వేల రూపాయలు ఎరగా వేస్తూ వీరిని ఉచ్చులోకి దించుతున్నాయి. కొందరు ఎయిర్‌పోర్టులో అధికారుల కళ్లుగప్పి బయట పడుతుండగా, మరికొందరు కస్టమ్స్‌కు చిక్కి జైలుపాలవుతున్నారు. కోరుట్ల: చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకులను బంగారం స్మగ్లింగ్ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నాందేడ్‌కు చెందిన కొందరు ముంబై, దుబాయ్ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకుని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన యువతకు డబ్బు ఎరవేసి బంగారం స్మగ్లింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. కొందరికి నేరుగా బంగారం తీసుకురావాలని చెబుతుండగా, మరికొందరికి ఓ పార్సిల్ తీసుకురావాలని నమ్మబలుకుతున్నారు. కాసుల ఆశకు దుబాయ్ వెళ్తున్న యువకులు.. దుబాయ్, హైదరాబాద్, నేపాల్ ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొరికిపోయి జైల్లో మగ్గుతున్నారు. తాము దుబాయ్ పంపిన వారిలో ఎవరైనా కస్టమ్స్ తనిఖీల్లో దొరికిపోతే.. ఆ ముఠా సభ్యులు వెంటనే తమ మకాం వేరే చోటికి మార్చుతున్నారు. కిలోకు రూ.5 లక్షలు తేడా.. మనదేశంలో బంగారం ధరలతో పోల్చితే.. దుబాయ్‌లో తులానికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కిలో బంగారం ఇండియాకు చేరవేస్తే రూ.5 లక్షల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ సంపాదనకు ఆశపడ్డ స్మగ్లర్లు అమాయకులకు కాసులు ఎరవేస్తున్నారు. ఈ ముఠాలపై నిఘాపెట్టి అమాయకులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉద్యోగుల వయోపరిమితి పెంపు సరికాదు
ముషీరాబాద్: ఉద్యోగాలు లేక రోజుకొకరు చొప్పున నిరుద్యోగులు చస్తుంటే రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలోని 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు గడిచినా 30 వేల పోలీస్ ఉద్యోగాలు, మరో 15 వేల ఇతర ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. ఇంకా గ్రూప్–1లో 1500, గ్రూప్–2లో 4వేలు, గ్రూప్–4 సర్వీస్ 40 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. ఇంకోవైపు రిటైర్ అయిన వేలాదిమంది ఉన్నతాధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాజకీయ అవినీతికి పునాదులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ వయోపరిమితిని పెంచితే కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు రావాని, అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బకాయిలుగా పేరుకుపోయిన డీఏలులు చెల్లించాలన్నారు. కేవలం వయోపరిమితి పెంచి ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పొట్టకొడితే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. త్వరలో అన్ని ప్రజా సంఘాలు, యువజన , విద్యార్థి సంఘాలతో సమావేశమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రిటైర్మెంట్ వయస్సు పెంచొద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచొద్దని తెలంగాణ స్టూడెంట్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మంగళవారం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల నిరుద్యోగం బాగా పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న రిటైర్మెంట్ వయస్సును కొనసాగిస్తూ అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ సీఎం కేసీఆర్‌కు నాగరాజు విజ్ఞప్తి చేశారు. -
లాడ్జిలో ఇంటర్వ్యూలు.. ఘట్కేసర్లో శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: బ్యాక్‌డోర్ ఎంట్రీలో రైల్వే, అటవీ, పోస్టల్ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసగించి రూ.లక్షలు దండుకున్న ఏడుగురు సభ్యుల ముఠాను మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతంలో రెండుసార్లు ఇదే పోలీసులకు చిక్కిన శివరంజని అలియాస్ స్వాతిరెడ్డి నేతృత్వంలోని హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 మందిని మోసగించారు. ఈ ముఠా ఇచ్చిన నకిలీ నియామకపత్రాలు, ఐడెంటీ కార్డులు తీసుకొని ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళితే మోసం చేశారని తేలడంతో ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎల్బీనగర్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. గత నెల 28న ఇద్దరు చిక్కగా.. బుధవారం మరో అయిదుగురు పట్టుబడ్డారు. రూ.48.16 లక్షలతో పాటు నకిలీ నియామక పత్రాలు, పది సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. ముఠాకు శివరంజని నేతృత్వం ఫిర్జాదిగూడలో నివాసముంటున్న కరీంనగర్ జిల్లా టేకుర్తికి చెందిన గృహిణి శివరంజని అలియాస్ స్వాతిరెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్యోగినిగా పరిచయం చేసుకునేది. తన సహచరుడు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాధాకృష్ణ కూడా రైల్వే ఉద్యోగిగానే వ్యవహరించేవాడు. తన స్నేహితుడు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రమేష్‌బాబును ఫోన్లో సంప్రదించి రైల్వే, అటవీ విభాగాల్లో ఎటువంటి రాత పరీక్ష లేకుండానే బ్యాక్‌డోర్ ఎంట్రీలో ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.6.5 లక్షలు తీసుకుంటామని నమ్మించాడు. ఒక్కో అభ్యర్థికి భారీగానే కమిషన్ ఇస్తానని చెప్పడంతో రమేష్‌బాబు తన స్నేహితుడు కడప జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన ఓబుల్‌రెడ్డి, మైదుకూరు ఒనిపెంటకు చెందిన మహమ్మద్ ఖలీద్ ఖాన్, సికింద్రాబాద్ రైల్వేలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చిలకలగూడ వాసి మధుసూదన్‌కు వివరించాడు. కొంతమంది విద్యార్థుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేసిన రమేష్‌బాబు.. రాధాకృష్ణకు తన కమీషన్ మినహాయించుకొని రూ.12 లక్షలు ఇవ్వడంతో స్వాతిరెడ్డి ముఠా సహకారంతో నకిలీ నియామక పత్రాలు సృష్టించి అందించారు. మళ్లీ ఎస్ఆర్నగర్లో భావన ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ డైరెక్టర్ జగదీష్ నాయుడు కూడా పోస్టల్లో ఉద్యోగాలిప్పిస్తాడని రాధాకృష్ణ మళ్లీ వారికి చెప్పడంతో కడపలో చాలామంది విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.12.5 లక్షలు ఇచ్చారు. లాడ్జిలో ఇంటర్వ్యూలు.. ఘట్కేసర్లో శిక్షణ తరగతులు సికింద్రాబాద్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేసే బీవీ మధుసూదన్‌రావు ఫిబ్రవరిలో ఏడుగురు విద్యార్థులను వెంట తీసుకొని ఒక్కొక్కరి నుంచి రూ.6.5 లక్షలు తీసుకొని సీబీఎస్ సమీపంలోని హిల్ టవర్ లాడ్జ్‌లో ఉంచి ఇంటర్వ్యూలు తీసుకునేందుకు రైల్వే అధికారులు వస్తారని చెప్పాడు. రమేష్‌బాబు, ఓబుల్రెడ్డిల సమక్షంలోనే రాధాకృష్ణ రైల్వే అధికారిగా ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుచేశారు. అనంతరం కొన్ని నెలలపాటు ఘట్కేసర్లోని ఈడబ్ల్యూఎస్లోని సకల సదుపాయాలున్న ఓ భవనంలో శిక్షణ ఉంటుందని చెప్పి అక్కడికి పంపించారు. అప్పటికే స్వాతిరెడ్డి, రాధాకృష్ణలు వేసుకున్న ప్లాన్ ప్రకారం అజీముద్దీన్ అనిల్ ఇన్‌స్ట్రక్చర్‌గా వ్యవహరించి శిక్షణ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత నకిలీ నియామక పత్రాలు, ఐడీ కార్డులు జారీ చేశారు. ఇవి పట్టుకొని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు వెళితే మోసమని తెలిసి ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టురట్టు అయ్యింది. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి, మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ జి.నవీన్‌కుమార్ నేతృత్వంలోని బృందం గత నెల 28న సీతాఫల్మండి రైల్వే క్వార్టర్స్‌లో నివాసముండే రైల్వే ఉద్యోగి బీవీ మధుసూదన్‌రావు, కడపలో బ్యాంక్ ఉద్యోగి ఓబుల్‌రెడ్డిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా స్వాతిరెడ్డిగా పేరు మార్చుకున్న శివరంజనీతో పాటు మహమ్మద్ అజీముద్దీన్, జగదీశ్ కుమార్ నాయుడు, కడప జిల్లాలో ఉండే సామాజిక కార్యకర్త రమేష్ బాబు, మహమ్మద్ ఖాలీ ఖాన్‌లను బుధవారం అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన బాలకృష్ణ, గౌస్ పరారీలో ఉన్నారని సుధీర్‌బాబు తెలిపారు. మోసగించిన కేసులో గతంలోనే శివరంజని పోలీసులు అరెస్టు చేశారని ఆయన గుర్తు చేశారు. జైలుకెళ్లొచ్చిన బుద్ధి మారలేదన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ పృథ్వీరావ్, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రుణాల పేరిట లక్షల టోకరా
బంజారాహిల్స్: ప్రముఖ బ్యాంకు ఆమోదం ఉందంటూ ఓ డొల్ల కంపెనీని ఏర్పాటుచేసి ... ఈ కంపెనీ బ్యాంకు కన్నుసన్నల్లోనే నడుస్తుందని ప్రచారం చేసి 40 మంది నిరుద్యోగ యువకులకు వెరిఫికేషన్ ఆఫీసర్లు, డాక్యుమెంట్ పికప్, చెక్స్ విత్‌డ్రా విభాగం అంటూ ఉద్యోగాలు కల్పించారు. అనంతరం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి రుణాలు ఇప్పిస్తామని నమ్మించి సంతకాలు చేయని ఖాళీ చెక్కులు తీసుకుని వాటిపై ఫోర్జరీ సంతకాలు చేసి బ్యాంకుల్లో లక్షలు డ్రా చేశారు. మోసపోయిన బాధితులు, ఉద్యోగులు మంగళవారం బంజారాహిల్స్ పోలీసును ఆశ్రయంచారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్‌కు చెందిన మురళి అనే వ్యాపారికి ఈ నెల 18న ఓ బ్యాంకు పేరుతో టెలికాలర్ ఫోన్ వచ్చింది. రుణం కావాలా..? అని అడిగాడు. ఇల్లు కట్టుకునేందుకు రుణం కావాలని మురళి చెప్పారు. ఇందుకుగాను ఆదాయ ధ్రువీకరణ పత్రాలను టెలీకాలర్ అడిగాడు. రెండు రోజుల తరువాత బ్యాంకు నుంచి వచ్చినట్లు చెప్పిన ప్రశాంత్ అనే యువకుడు మురళి వద్ద నుంచి డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఇది జరిగిన నాలుగు రోజుల తరువాత బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు ఓ యువతి ఫోన్ చేసి రుణం ఇచ్చేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇళ్లు కట్టే స్థలం తనిఖీకి తమ ప్రతినిధులు వస్తారని పేర్కొంది. ఆ రెండు రోజుల తరువాత ఇద్దరు యువకులు బ్యాంకు నుంచి వస్తున్నట్లు చెప్పి స్థలాన్ని చూసి వెళ్లిపోయారు. అదే రోజు బ్యాంకు నుంచి ఫోన్ చేసి రెండు కోట్ల రుణం ఇస్తామన్నారు. కాకపోతే కొన్ని షరతులు పూర్తి చేసేందుకు సంతకాలు పెట్టని చెక్కులు కావాలని కోరారు. మురళి ఐదు చెక్కులను వారికి అందజేశారు. అంతే మరుసటి రోజు మురళి ఖాతాలో ఉన్న రూ.1.65 లక్షలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఖంగుతిన్న మురళి వెంటనే రుణం ఇస్తామని చెప్పిన వారి ఫోన్ కోసం ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రుణం పేరిట ఫోన్ చేస్తుంది ఓ డొల్ల కంపెనీ అని గుర్తించారు. బెంగళూర్‌కు చెందిన మహేశ్ అలియాస్ ఎం.ప్రణయ్ రాయ్ అలియాస్ మధు(45)గా తేలింది. తమను ఇంటర్వ్యూ చేసింది బాలాజీ అలియాస్ సురేష్ మెహతా అని బాధితులు తెలిపారు. సికింద్రాబాద్‌లో బుజ్వర్క్, ఫార్చూన్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఓ కార్యాలయం తెరిచి సుమారు 49 మంది యువతీ, యువకులను ఉద్యోగులుగా చేర్చుకున్నారు. టెలీకాలర్ ద్వారా నగరవాసులకు ఫోన్ చేసి రుణం పేరిట ఆకర్షించి మోసం చేస్తున్నట్లు తేలింది. మంగళవారం మురళితో పాటు హిమాయత్‌నగర్‌కు చెందిన దయాకర్ రెడ్డి అనే వైద్యుడు రూ. 5.50 లక్షలు, గౌస్ అనే వ్యక్తి రూ.40వేలు పోగొట్టుకున్నట్లు పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఖాతాలో కూడా రూ.6 లక్షలు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. కానీ సంతకాలు సరిపోకపోవడంతో ఆ ప్రయత్నం సాధ్యం కాలేదు. కేవలం పదిరోజుల్లో రూ.10 లక్షలకు పైగా ఆ డొల్ల కంపెనీ ప్రతినిధులు కొల్లగొట్టారు. పక్కా ప్రణాళికతో... ♦ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్రణాళికలతో మోసాలకు పాల్పడ్టట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితుల వద్ద సంతకాలు పెట్టని ఖాళీ చెక్కులు తీసుకుంటూ అనుమానం రాకుండా వారి ముందే చెక్కులుపై ఓ ప్రముఖ బ్యాంకు తాలుకు స్టాంప్ వేయడంతో బాధితులు భరోసాగా ఫిలయ్యారు. ♦ అయితే ఆ తరువాత ఆ చెక్కులను తీసుకున్న డొల్ల కంపెనీ ముఠా వాటిపై ఉన్న స్టాంప్‌లను తుడిచేసి ఫోర్జరీ సంతకాలు చేశారు. అప్పటికే రుణం కోసం వివిధ పత్రాలపై చేయించుకున్న సంతకాల ఆధారంగా సంతకాలు ఫోర్జరీ చేయగలిగారు. ఆ విధంగా డబ్బును తమ ఖాతాలోకి ఆర్టీజీఎస్ పద్ధతిలో మళ్లించుకున్నారు. పై నుంచి దూకిన నిందితుడు ఇదిలా ఉండగా ఓ బాధితుడు నిందితుడి కోసం గాలిస్తూ గూగుల్ మ్యాప్ ద్వారా వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఓ లాడ్జిలో తలదాచుకున్న మోసగాడి జాడ కనిపెట్టారు. నేరుగా మంగళవారం ఉదయం మిగతా బాధితులతో కలిసి ఆ లాడ్జి వద్దకు స్థానిక పోలీసుల సాయంతో చేరుకున్నారు.దీంతో గమనించిన నిందితుడు ప్రణయ్ లాడ్జి రెండో అంతస్తునుంచి కిందికి దూకాడు. దీంతో కాలు విరిగింది. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం బంజారాహిల్స్ పోలీసులకుఅప్పగించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం
శంషాబాద్: ఉద్యోగం సంపాదించుకోవడంలో విఫలమైన ఓ నిరుద్యోగి తానే ముఠా ఏర్పాటు చేసి పలువురు నిరుద్యోగులను మోసం చేసిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. గురువారం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోగిరి సంతోష్‌కుమార్ రెండేళ్ల క్రితం నగరంలోని ఓ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఏడాది క్రితం ఎమిరెట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగానికి గాను ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉద్యోగం రాకపోవడంతో తనలాగే ఉద్యోగాల కోసం వచ్చి తిరస్కరణకు గురవుతున్న వారిని గుర్తించిన అతను మోసాలకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టు మాజీ ఉద్యోగి మహంతి రాంకు మార్తో జత కలిశాడు. అనంతరం మల్టీమీడి యా నిపుణుడైన తన బావమరిది నారాయణతో కలిసి ఎమిరెట్స్ ఎయిర్‌లైన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించుకున్నాడు. వీరికి ఎల్బీస్టేడియం సమీపంలోని ఎయిర్వై ఏవియేషన్ అకాడమిలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ ఖాదిర్ జతకలిశాడు. నకిలీ ఐడీ కార్డులను కలర్ జిరాక్స్ తీయడం వంటి పనులకు మీర్‌పేట్‌కు చెందిన బూర్గుల పాండు సహకరించేవాడు. వీరు ఐదుగురు ఎయిర్‌పోర్టు సమీపంలోని తుక్కుగూడ వద్ద కార్యాలయం తెరిచారు. నిరుద్యోగులను అక్కడికే రప్పించి ఇంటర్వ్యూలు నిర్వహించి నకిలీ ఐడీ కార్డులతో పాటు నకిలీ ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాసులను కూడా తయారు చేసి ఇచ్చేవారు. ఇందుకుగాను ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవారు. గత ఆగస్టులో బార్కాస్‌కు చెందిన ఖాలిద్ మహ్మద్ ఖాన్ కూడా వీరి వద్ద ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడికి నకిలీ ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాస్ ఇచ్చారు. దీనిని గుర్తించిన ఖాలిద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీ సులు ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, రెండు ల్యాప్‌టాప్‌లు, కారుతో పాటు నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదించడంలో కీలక పా త్ర పోషించిన ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రామకృష్ణతో పాటు ఎస్సైలను డీసీపీ అభినందించారు. -
నిరుద్యోగ భారతం
విశాల్ చౌధరీ. చురుకైన యువకుడు. ఎంబీఏ పూర్తయి రెండేళ్లయింది. ఖాళీగా ఉన్నాడు. గత ఏడాదిలో 50 ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అయినాఉద్యోగం రాలేదు. అటెండర్ పని చేయడానికీ సిద్ధపడ్డాడు. అదీ రాలేదు. చుట్టాలు పక్కాలు ఇప్పుడేం చేస్తున్నావని ప్రశ్నిస్తే జాబు లేదన్న జవాబు చెప్పలేక ఇబ్బందిపడుతున్నాడు. ఆ ఆక్రోశం అంతా ఉద్యోగాలు కల్పించలేని కేంద్ర ప్రభుత్వంపైఆగ్రహంగా మారుతోంది. ఇది కేవలం విశాల్ కథ మాత్రమే కాదు.దేశంలోని కోట్లాదిమంది నిరుద్యోగుల వ్యధ. మరి వీరి ఆగ్రహ జ్వాలలుప్రధానమంత్రి మోదీ పీఠాన్ని తాకుతాయా? ఈ ఎన్నికల్లో నిరుద్యోగంఎంత మేరకు ప్రభావితం చేస్తుంది? ఉద్యోగం.. ఉద్యమం నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి ఆందోళనల రూపంలో బయటకి వస్తోంది. అదీ కులపరమైన రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడ్డెక్కుతున్నారు. గుజరాత్లో పాటీదార్లు, మహారాష్ట్రలో మరాఠాలు, హరియాణా, రాజస్తాన్‌లో జాట్లు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు రిజర్వేషన్లుకల్పించాలంటూ చేస్తున్న ఉద్యమాలన్నీ ఉద్యోగాలకోసం చేస్తున్నవే.యూపీఏ పదేళ్ల పాలనలో అంతూదరీ లేకుండా పెరిగిపోయిన నిరుద్యోగంతో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువతరానికి 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓ ఆశాదీపంలా కనిపించారు. కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ మోదీని ప్రధాని పీఠానికి దగ్గర చేసింది. కానీ ఈ అయిదేళ్లలో నిరుద్యోగ సమస్య తగ్గకపోగా పెరిగిపోయింది. పెద్దనోట్ల రద్దుతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కుదేలయ్యాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరిందని 2017–18లో కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే వెల్లడైంది. నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ ప్రకారం 1977–2012 మధ్యకాలంలో నిరుద్యోగం ఎప్పుడూ 2.6 శాతం దాటలేదు. 2018లో 6.10 శాతానికి చేరుకుని కమలనాథుల్లో ఆందోళన పెంచితే, ఫిబ్రవరి నాటికి ఇది 7.2 శాతంగా మారి మరింత గుబులెత్తిస్తోంది. కేంద్రం అధికారికంగా ఈ సర్వే వివరాలు బయటపెట్టకున్నా.. కొన్ని మీడియా సంస్థలు నివేదికను బట్టబయలు చేయడంతో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే దుస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దుతో అసంఘటిత రంగం అల్లకల్లోలమైంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సర్వే ప్రకారం డిసెంబర్ 2017, డిసెంబర్ 2018 మధ్య కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని తేలింది. ఏటా 10 లక్షల మంది కొత్త యువకులు డిగ్రీలు చేతపట్టి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏడాదికి 81 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితేనే భారత్ నిరుద్యోగ సమస్యను అధిగమించగలదని అంచనా. అన్ని ఉద్యోగాల్ని ఒకేసారి మోదీ సర్కార్ సృష్టించగలదా? మోదీ సర్కార్ మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యాయి. సర్వేలు ఏం చెబుతున్నాయంటే.. నిరుద్యోగ సమస్య ఉత్తరభారతంలో ఉన్నంతగా దక్షిణాదిన లేదు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగమే అత్యధిక ప్రభావాన్ని చూపించే అంశమని ఉత్తరాది రాష్ట్రాల్లో 37 శాతం మంది లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వేలో అభిప్రాయపడ్డారు. అదే దక్షిణంవైపు వచ్చేసరికి 16 శాతం మంది మాత్రమే నిరుద్యోగ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందన్నారు. ఇండియా టుడే–కార్వి సర్వే ప్రకారం ఏకంగా 60 శాతం మంది ఉద్యోగాల కల్పనకు మోదీ సర్కార్ చేసిందేమీ లేదని నిందించారు. సీ ఓటరు సర్వేలో 23 శాతం మంది నిరుద్యోగమే ప్రధాన అంశమన్న అభిప్రాయాన్నే వెల్లడించారు. ఓ రకంగా ఈ ఫలితాలు బీజేపీకి నిరాశ కలిగించేవే. బీజేపీ తిరిగి గద్దెనెక్కడానికి ఉత్తరాదినే నమ్ముకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ ఇంకా పట్టు బిగించలేకపోతోంది. గత ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో 151 స్థానాలకు 131 చోట్ల బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అందుకే నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం కమలనాథులకు కఠిన పరీక్షగా మారింది. ప్రభుత్వ వాదన ఏమిటంటే.. రకరకాల సర్వేలు చెబుతున్నట్టు నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా లేదంటూ కేంద్రం సమర్థించుకునే ప్రయత్నాలే చేస్తోంది. దీనికి ఉదాహరణగా ప్రభుత్వ పీఎఫ్ ఖాతాలను పెరగడాన్ని, ముద్ర రుణాలను చూపిస్తోంది. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లెక్కల ప్రకారం 2017 సెప్టెంబర్– 2018 నవంబర్ మధ్య కాలంలో 73.5 లక్షల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. అంటే అన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా అన్నది ప్రభుత్వ వాదన. కానీ ఆ వాదనలో పస లేదన్న అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే కొందరు ఉద్యోగులు సంస్థలు మారినప్పటికీ మళ్లీ కొత్తగా పీఎఫ్ ఖాతా ప్రారంభించాలి. అలా కొత్త ఖాతాలు తెరిచిన వారిలో 24 శాతం మంది ఉద్యోగులు మారిన వారేనని బిజినెస్ స్టాండర్డ్ చేసిన సర్వేలో తేలింది. ఇక చిన్నతరహా పరిశ్రమల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాల్ని మంజూరు చేస్తోంది. ఈ రుణాలు తీసుకున్న వారి డేటా చూస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తోందో తెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాదన. అయితే ఆర్టీఐ ద్వారా దీనికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలని కొందరు ప్రయత్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు.. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం బాగా తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తోంది. పకోడీలు అమ్ముకోవడం కూడా ఒక ఉద్యోగమేనంటూ ప్రధానమంత్రి ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై దుమారమే రేగింది. ఇప్పటికే భారత్‌లో ఉద్యోగం చేస్తున్న వారిలో 77 శాతం మంది అతి తక్కువ వేతనాలకు చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నవారే కావడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో నిరుద్యోగాన్నే అస్త్రంగా చేసుకుంది. కాంగ్రెస్ క్యాష్ చేసుకోగలదా? ఉగ్రవాదం కంటే నిరుద్యోగం భయంకరమైన సమస్య అంటూ రాహుల్‌గాంధీ ఈ అంశాన్ని గట్టిగానే పట్టుకున్నారు. ప్రతీ ఎన్నికల సభలోనూ దానినే ప్రస్తావిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపునకు నిరుద్యోగుల ఓట్లే కారణమన్న అంచనాలున్నాయి. అందుకే ఈసారి ఎన్నికల్లో రఫేల్ అంశానికి బదులుగా నిరుద్యోగం, రైతు సమస్యలు, గ్రామీణ సంక్షోభాన్నే అస్త్రాలుగా చేసుకోవాలని నిర్ణయించింది. గతంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంటికో ఉద్యోగం అన్న హామీ ఇస్తే, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో రూ.2,500 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీనిచ్చింది. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఏ కంపెనీలైనా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వేతనాల గ్రాంట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగం, గ్రామీణ సంక్షోభం, రైతు సమస్యలన్నింటినీ కలిపి కొట్టేలా ఒక్కటే పరిష్కారంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కనీస ఆదాయ పథకాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఎన్నికల సభల్లో పదేపదే ఆ హామీనే ప్రస్తావిస్తూ ప్రతీ కుటుంబానికి నెలవారీ ఆదాయంపై భరోసా ఉంటుందని అంటున్నారు. మరి నిరుద్యోగ యువత ఈసారి ఎటు మళ్లుతారో వేచి చూడాలి. ఆఫీస్‌బాయ్ పోస్టుకు 23 వేల మంది.. ♦ భారతీయ రైల్వే గత ఏడాది 63 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే ఏకంగా కోటీ 90 లక్షల మంది దరఖాస్తు చేశారు. ♦ మహారాష్ట్రలో ఆఫీస్ బాయ్ ఉద్యోగాలు అయిదు ఖాళీలు ఉన్నాయంటూ వాంటెడ్ ప్రకటన వెలువడితే ఏకంగా 23 వేల మంది పట్టభద్రులు, ఇంజనీరింగ్ చదివిన వారు దరఖాస్తు చేశారు. ♦ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనాలప్రకారం ప్రస్తుతం 3.1 కోట్ల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ♦ 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిలో ఏకంగా 65 శాతం మందికి ఉద్యోగాలు లేక నిరాశా నిçస్పృహల్లో ఉన్నారు. ♦ వరల్డ్ బ్యాంకు అంచనాల ప్రకారం ఏడాదికేడాది మహిళా ఉద్యోగులు తగ్గిపోతున్నారు. 2005లో మహిళా ఉద్యోగుల శాతం 38.7 ఉంటే 2017 నాటికి 28.6 పడిపోయింది. ♦ రైల్వేలో నాలుగేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో ముంబైలో రైల్వే ట్రాక్‌లపై వేలాది మంది చేరి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగాలు రావన్న ఆందోళనతో 10 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లకి ‘టైమ్’ వచ్చిందా? జనరేషన్ టైమ్‌పాస్.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా. అదేదో సినిమాలో హీరోయిన్ అన్నట్టు పనీపాటా లేకుండా ఖాళీగా తిరిగే బ్యాచ్ అన్న మాట. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. వీరందరికీ పెద్ద డిగ్రీలు ఉంటాయి. కానీ విద్యలో నాణ్యత ఉండదు. పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాదు. అందుకే చదువుకి తగ్గ ఉద్యోగాలు దొరకవు. అన్ని విద్యార్హతలుండీ నిరుద్యోగులుగా ఉన్నవారిది ఒక వ్య«థ అయితే, వీరిది మరో రకం బాధ. యూపీలోని మీరట్‌లో 2004–05లో కొందరు నిరుద్యోగులంతా కలసి జనరేషన్ టైమ్‌పాస్ అనే గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఊరూరా తిరుగుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ వార్తల్లోకెక్కారు. వీళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో వీళ్లు కీలకంగా మారనున్నారు. 2004–05లో వీరి సంఖ్య 7 కోట్లు ఉంటే 2017–18 నాటికి 11.6 కోట్లకి చేరుకుంది. ఉత్తరాదినే ఎక్కువ.. జనరేషన్ టైమ్‌పాస్ వర్గం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిరాదరణకు గురవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యలో నాణ్యతా ప్రమాణాలు కనిపించవు. ఆర్యోగ రంగ సేవలు అందుబాటులో ఉండవు. మౌలిక సదుపాయాలు సున్నా. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి అలసత్వం ఎక్కువ. ఇవన్నీ వీరికి ఉద్యోగాలు రాకపోవడానికి కారణాలే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన కులాల వారికి టైమ్‌పాస్ ఒక అలవాటుగా మారింది. 2010 వరకు వీరంతా తమ వాయిస్ బలంగా వినిపించేవారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారు. ఇటీవల కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం యూనివర్సిటీల్లో రాజకీయాలను కట్టడి చేయడంతో వీరి వాయిస్ వినిపించడం లేదు. ఇప్పుడీ జనరేషన్ టైమ్ పాస్ వర్గం లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించనుందో చూడాలి. -
ఉద్యోగం రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: ఉద్యోగం రాలేదన్న నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం దేవుకోన గ్రామానికి చెందిన కొండబోయిన చంద్ర చూడామణి డిగ్రీ చదివి ఎన్నో పోటీ పరీక్షలు రాశాడు. అయితే ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంటిలో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కొమరాడ మండలం రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతిస్థిమితం లేక మతిస్థిమితం సరిగ్గా లేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మండలం ఎంఆర్ నగరంనకు చెందిన పొగిరి దుర్గాప్రసాద్ తాగుడికి బానిసయ్యాడు. పైగా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి 108 వాహనంలో అతడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త. పేరొందిన శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ ట్రేడుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. కుటుంబ వార్షికాదాయం రూ.2లక్షలు మించకుండా 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 7 నుంచి 10 వరకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి అర్హత, ఆసక్తిని బట్టి ఆయా ట్రేడులలో శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. ఇందుకు నియోజవకవర్గాల వారీగా హరిజన బస్తీలను ఎంపిక చేశారు. అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు 16 ప్రధాన శిక్షణ సంస్థలతో ఎస్సీ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎంపిక శిబిరాలు... ♦ ఈ నెల 7న ఉదయం 11గంటలకు సైదాబాద్‌లోని పోచమ్మ బస్తీ మహిళా భవన్లో నిర్వహించనున్న శిబిరానికి గాంధీనగర్(మలక్‌పేట), హరిజన బస్తీ(చాంద్రాయణగుట్ట), చంద్రయ్య హట్స్(యాకుత్‌పురా), నర్సారెడ్డి నగర్ కాలనీ(బహదూర్‌పురా) ప్రాంతాలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కావచ్చు. ♦ 8న పద్మారావునగర్ హమాలీ బస్తీ ఫేజ్–1లోని కమ్యూనిటీ హాల్లో జరిగే శిబిరానికి ప్రేమ్‌నగర్ (ఖైరతాబాద్), వినాయకరావునగర్ (జుబ్లీహిల్స్), హమాలీ బస్తీ ఫేజ్–1 (సనత్‌నగర్), దేవినగర్ (కార్వాన్) ప్రాంతాల అభ్యర్థులు హాజరు కావచ్చు. ♦ 9న నాంపల్లిలోని పటేల్‌నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగే శిబిరానికి అఫ్జల్‌సాగర్–2(నాంపల్లి), బంగ్లాదేశ్ (గోషామహల్), ఎస్వీనగర్ (చార్మినార్)కు చెందిన అభ్యర్థులు హాజరు కావచ్చు. ♦ 10న మారేడుపల్లి అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్లో జరిగే శిబిరానికి రంగారెడ్డి బస్తీ(ముషీరాబాద్), నర్సింహా బస్తీ (అమీర్‌పేట), తుకరాం గేటు(సికింద్రాబాద్), ఆజాద్ చంద్రశేఖర్ బస్తీ (కంటోన్మెంట్) అభ్యర్థులు హాజరు కావచ్చు. శిక్షణ సంస్థలు.. ట్రేడులు ♦ జాతీయ నిర్మాణ రంగ సంస్థ (నాక్): ఫినిషింగ్, స్కూల్ ప్రోగ్రాం, కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగాం, జనరల్ వర్క్స్ సూపర్వైజర్, ఐకియా ఫర్నీచర్, అసెంబ్లింగ్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, డ్రైవాల్ ఫాల్ సిలింగ్, ఎలక్ట్రికల్, హౌస్వైరింగ్, ల్యాండ్ సర్వేయర్, స్టోర్ కీపర్, వెల్డింగ్. ♦ జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ: ఫేష్ ట్రైనింగ్, పంచకర్మ, ఆయుర్వేద స్పా, బేకరీ, హౌస్ కీపింగ్ అండ్ లాండ్రీ, రెస్టారెంట్ సర్వీసెస్. ♦ అపోలో మెడిస్కిల్స్: ఆధునిక కార్డియాలజీ కేర్ టెక్నాలజీ, ఆధునిక ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్స్, ఆధునిక డయాలసిస్ టెక్నిషియన్, అత్యవసర వైద్య నిఫుణులు, సాధారణ సహాయకుడు, దంత సహాయకుడు, రిఫ్రెష్ ట్రైనింగ్ ఫర్ ఏఎస్ఎం, టీఐఏఆర్ఏ ట్రేడ్ ట్రైయినింగ్, రోబోటిక్ సర్జరీ. ♦ కెల్ట్రాన్ ఇన్స్టిట్యూట్: వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డేటాఎంట్రీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ హార్డ్‌వేర్, లాజిస్టిక్ ట్రాన్స్‌పోర్డ్ అండ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ రిటైల్ ప్రొఫెషనల్స్, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్ కోర్సులు. ♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్: క్రాఫ్ట్ మాన్ఫిన్ కోర్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్ మల్టీక్యూజిన్ కుక్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్, రూమ్ అంటెండెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్. ♦ నిమ్స్‌మే సంస్థ: యానిమేషన్, డిజటర్ ఫొటోగ్రఫీ అండ్ విడియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, మేకప్ కోర్సులు. ♦ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ: సీఎస్సీ ఆపరేషన్ వర్టికల్ మెషిన్ సెంటర్, సీఎస్సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్, ఫీల్డ్ ఇంజినీర్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండీషనింగ్ అండ్ వాషింగ్ మెషిన్, ఆర్క్ వెల్డింగ్, వెల్డింగ్, ఫీల్డ్ టెక్నిషియన్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఎలక్ట్రానిక్స్, త్రుహోల్ అసెంబ్లింగ్ ఆపరేటర్, టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్. ♦ టీఎంఐఈ2 అకాడమీ: డీటీహెచ్ ఇన్స్టలేషన్, ఏసీ ఇన్స్టలేషన్. ♦ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్ఫెక్ట్ సెఫ్టీ అండ్ సర్వే: సీసీ టీవీ ♦ ఆప్షనల్ స్కిల్స్ అండ్ సొల్యూషన్ ఫౌండేషన్: హౌస్ కీపింగ్ ♦ రైజ్: స్మాల్ పౌల్ట్రీఫామ్, బ్రాయిలర్ ఫామ్ వర్కర్ ♦ టెక్నాలెడ్జ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లిమిటెడ్: ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జావా అండ్ టెస్టింగ్. ♦ సెట్విన్ సంస్థ: మొబైల్ సర్వీసింగ్ అండ్ సేల్స్, సీసీటీవీ ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, ఆటోక్యాడ్, బ్యూటిషీయన్. ♦ ఎస్ సంస్థ: మార్కెటింగ్, మార్కెటింగ్ బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్ ♦ క్యాప్ ఫౌండేషన్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ♦ హెల్త్‌కేర్: బ్యూటీ, వెల్నెస్ సేల్స్ అండ్మార్కెటింగ్. -
24 సెంటర్లు.. 11 వేల మందికి శిక్షణ
సాక్షి సిటీబ్యూరో: సెట్విన్ సంస్ధ ఆధ్వర్యంలో 2018 సంవత్సరంలో 24 సెంటర్లలో 11 వేల మంది యువతకు, 30 కోర్సుల్లో శిక్షణ ఇచ్చామని, ఇందులో దాదాపు 80 శాతం విద్యార్థులకు ప్లెస్మెంట్ కల్పించినట్లు సెట్విన్ మేనేజింగ్ డైరెకర్ట్ వేణుగోపాల్‌రావు తెలిపారు. శుక్రవారం ఈ ఏడాది సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, వచ్చే ఏడాది చేపట్టనున్న కార్యక్రమాలపై మీడియాకు వివరించారు. సెట్విన్ ద్వారా ట్రెయినింగ్, ట్రాన్స్‌పోర్టు, ట్రేడింగ్ మూడు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సంస్థతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖల సౌజన్యంతో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సంస్థ శిక్షణా కేంద్రాలతో పాటు ఈ ఏడాది 15 ప్రైవేట్ సంస్థల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చిందన్నారు. ఈ ఏడాది నగరంతో పాటు గజ్వేల్, డిచ్‌పల్లిలో సెట్విన్ సెంటర్లలను ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, మహబూబ్‌నగర్‌లో సంస్థ తమ సెంటర్లను ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. మైనార్టీ యువతకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రవేశపెట్టిన కేజీఎన్ పథకం ద్వారా ఈ ఏడాది 800 మందికి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 160 మందికి మొబైల్ టెక్నిషియన్, రిఫ్రెజిరేటర్ రిపెరింగ్తో పాటు యువతులకు బ్యూటీషన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చామన్నారు. ట్రాన్స్‌పోర్టులో భాగంగా నగరంలోని వివిధ రూట్‌ల్లో సంస్థ వంద బస్సు సర్వీసులు నడుపుతున్నామని, వచ్చే ఏడాది సెట్విన్ ద్వారా కొత్త బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకుగాను బస్సు నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారు తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏప్రిల్‌లో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తాయన్నారు. ట్రేడింగ్‌లో భాగంగా పలు విద్య సంస్థలకు నోట్‌బుక్‌ల సరఫరా చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి కొత్త నగరంలో విద్యార్థుల కోసం సీతాఫల్ మండీలో మాజీ మంత్రి పద్మారావుగౌడ్ నిధులతో నిర్మించిన బహుల అంతస్తుల సెట్విన్ భవనం అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే పాత నగరం విద్యార్థులకు ఖిల్వత్ మోతీగల్లీలోని సెంటర్ ఉందని, ఇక కొత్త నగరంలో కూడా అన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి సెట్విన్ హోమ్ సర్వీస్ యాప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా సెట్విన్ సంస్థలో శిక్షణ పొందిన ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితరులు ఇంటి వద్దకు వచ్చి సేవలు అందజేస్తారన్నారు. వచ్చే ఏడాది 20 వేల మంది యువతకు సెట్విన్ ద్వారా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటీకే భీమాస్ ఆల్పహారం ద్వారా నగరంలో పలు ప్రాంతాల్లో 2018 సంవత్సరంలో టిఫిన్లను అందజేస్తున్నామని, వచ్చే ఏడాది వీటి సంఖ్యను పెంచనున్నట్లు ఆయనపేర్కొన్నారు. -
నిరుద్యోగ శంఖారావం
సర్కారు కొలువు కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ అలసత్వంపై సమరశంఖం పూరించారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా, అర్ధాకలితో ఇరుకుగదుల్లోనే అవస్థలు పడుతూ.. కోచింగ్‌ల కోసం వేలకు వేలు వెచ్చించి నానా పాట్లు పడుతుంటే ఇన్ని తక్కువ పోస్టులకే పరిమితం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష పోస్టులను భర్తీ చేయాల్సిందేనంటూ భీష్మించారు. కడుపు మండిన వారంతా ‘నిరుద్యోగ మార్చ్’ లో కదం తొక్కారు. ద్వారకానగర్(విశాఖ దక్షిణ): ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను లక్షకు పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూలోని వీఎస్ కృష్ణా గ్రంథాలయం నుంచి జీవీ ఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరుద్యోగ మార్చ్ చేపట్టారు. నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చొక్కాపు ఆనందరావు, శెల్లి వైకుంఠరావు మాట్లాడుతూ కమలనా«థ్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో లక్షా నలభై వేల పోస్టులు ఖాళీ ఉండగా.. ప్రభుత్వం 20 వేల పోస్టులు మాత్ర మే భర్తీ చేస్తాననడం సరికాదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేక తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కుటుంబాన్ని, గ్రామాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా చదువుతున్న నిరుద్యోగుల ఆకలిబాధలను ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణమే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. నిరుద్యోగుల్లో నిరాశ ఇటీవల ఆర్ధిక శాఖ ఆమోదించిన పోస్టుల్లో ఎంతో కీలకమైన గ్రూప్–1 పోస్టులు 182, గ్రూప్–2, 337 పోస్టులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు నిరాశ చెందారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్తున్న వారు పోస్టులు చాలా తక్కువగా ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పోలీస్ శాఖలో 30 వేల పోస్టులు ఉండగా ప్రభుత్వం కేవలం ఆరువేల పోస్టులు భర్తీ చేయడం చూస్తే ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష కట్టినట్లు ఉందన్నారు. ఏటా లక్షల్లో విద్యార్థులు డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్లపైకి వస్తుంటే ప్రభుత్వం వందల్లో , వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణాలో సుమారు 19 వేల పోస్టులకు పోలీస్‌శాఖలో నోటిఫికేషన్ ఇస్తే మనరాష్ట్రంలో మూడు వేల ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదించడం నిరుద్యోగులను కించపరచడమేనన్నారు. రాష్ట్రంలో ఏటా వేల మంది విద్యార్థులు తమ పీజీ పూర్తి చేసుకున్నప్పటకీ సుమారు పదేళ్లుగా జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ లేకపోవడం చూస్తే ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులను ఈ ప్రభుత్వం ఎలా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని లేని పక్షంలో నిరుద్యోగుల ఉద్యమాన్నిఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ర్యాలీలో అప్పారావు, శ్రీధర్, ఎ,ఉమామహేష్, తెంకి కూర్మినాయుడు, బి.తరుణ్, సాగర్, పోలినాయుడుతో పాటు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
#మీటూ: ‘ముద్దుకు ఒక రేటు, వస్తే అడిగినంత’
యశవంతపుర: మీటూ లైంగిక వేధింపుల ఆరోపణలు సినిమా రంగానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై అనేక మంది యువతులు మీ టూ అని గళమెత్తుతున్నారు. కర్ణాటకలోకి హాసన్ ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ యువతి ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకంపై మీటూ అంటూ సెల్ఫీ వీడియోను తీసి ఫేస్బుక్, వాట్సప్‌లలో పోస్ట్ చేసింది. ఆ పోస్టు విస్తృతంగా షేర్ అవుతోంది. ఉద్యోగమిప్పిస్తానని.. బాధిత యువతి తన పేరును వెల్లడించకుండా.. తనను వేధించిన వ్యక్తి ఎవరో చాటిచెప్పింది. హాసన్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కృష్ణేగౌడ ఉద్వోగం ఇప్పిస్తానంటూ నమ్మించి తన మొబైల్ నంబర్‌ను తీసు కుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. ముద్దుకు ఒక రేటు, పిలిచినప్పుడు వస్తే అడిగినంత డబ్బులు ఇస్తానంటూ తనపై ఒత్తిడి చేసిన్నట్లు గోడును వెళ్లబోసుకుంది. పత్రికలు, టీవీలో వస్తున్న మీటూ ఉద్యమం స్ఫూర్తితో తన బాధను వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపింది. కామాంధునిపై చర్యలకు జిల్లా ఎస్పీ ప్రకాశ్‌గౌడ సాయం కావాలని, కృష్ణేగౌడ లాంటి కీచకుడికి చట్టం ప్రకారం శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రిటైరయ్యే వయస్సులోనున్న అతడు.. రూ.15 వేలు ఇస్తా, ఒక ముద్దు పెట్టించుకోవాలని తనను వేధించినట్టు ఆమె వెల్లడించింది. నువ్వూ ఒక తండ్రివేనా?: గురుప్రసాద్‌పై భార్య ఆగ్రహం మీ టూను కొందరు నటీమణులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన దర్శకుడు గురుప్రసాద్‌పై అతని మొదటి భార్య ఆరతి విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల వయస్సున్న కూతురు, భార్యను అర్ధరాత్రి ఇంటి నుండి గెంటేసిన సంగతి మరిచావా అని ప్రశ్నించారు. ఒక తండ్రిగా ఆయన ప్రవర్తించలేదని, గురుప్రసాద్‌కు ఒక కూతురుందనే విషయం మరిచి మాట్లాడటం సరికాదన్నారు. ఇంటి నుంచి తనను గెంటివేస్తే ఎలాంటి గొడవ చేయకుండా బయటకు వచ్చానన్నారు. తండ్రిగా బాధ్యతలను నిర్వహించలేని గురుప్రసాద్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. తాను విడాకులు తీసుకోవాలనుకున్నా ఆయన సిద్ధంగా లేరని చెప్పారు. సంగీతభట్ భర్త సైతం.. యశవంతపుర: దర్శకుడు గురుప్రసాద్ చేసిన వ్యాఖ్యలను నటి సంగీతాభట్ భర్త సుదర్శన్ భట్ ఖండించారు. సంగీత ఇప్పుడు చిత్రరంగాన్ని వదిలేశారు. ప్రచారం కోసం మీటూ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. -
నిరుద్యోగ భృతి కాదు.. టీడీపీ నేతల రాజకీయ భృతి
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : యువనేస్తం పథకం నిరుద్యోగ భృతి కోసం కాదని, టీడీపీ నేతల రాజకీయ భృతిగా మారిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని 36వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మరో ఐదారు మాసాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు గాలం వేయడానికి కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఇది అని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చే డబ్బు చాలా తక్కువ కానీ శిక్షణా సంస్థలకు ఇచ్చే సొమ్ము మాత్రం ఎక్కువని చెప్పారు. ఈ శిక్షణా సంస్థలన్నీ చంద్రబాబు కుమారుడు లోకేష్ బినామీలవన్నారు. యువనేస్తం పథకం ద్వారా రూ. వందల కోట్లు దోచుకోవడానికి రంగం సిద్ధమైందన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 25–30 వేల మంది డిగ్రీ పట్టా తీసుకుంటున్నారని, నాలు గేళ్లలో సుమారు లక్షా 10 వేల మంది నిరుద్యోగులు సమాజంలోకి వస్తున్నారు. అయితే జిల్లాలో కేవలం 12 వేల మందిని మాత్రమే గుర్తించారన్నారు. ప్రభుత్వం ఒక్క రోజులో 13 జిల్లాలకు సంబంధించి డిగ్రీ చదివిన వారి సమాచారం తెప్పించుకోవచ్చని అన్నారు. ఎలాంటి వడబోత కార్యక్రమం లేకుండా డిగ్రీ చదివిన వారి అకౌంట్‌కు నేరుగా డబ్బు ట్రాన్స్పర్ చేయొచ్చన్నారు. యువనేస్తం పట్ల ఈ రాష్ట్రంలోని యువత ఆగ్రహావేశాలతో ఉన్నారని, వారం, పది రోజుల తర్వాత తీవ్రమైన అలజడి మొదలవుతుంది. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై దీక్ష నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై త్వరలో దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో కేవలం 1200 మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి, రాష్ట్రమంతా పంపిణీ చేశామని ఆర్భాటం చేస్తున్నారన్నారు. అర్హత పొందిన సంఖ్యను గుర్తించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. సమావేశంలో సీపీ నరసింహులు, శేఖర్‌రెడ్డి, దేవి, రాయుడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మైనారిటి నాయకుడు ఆయిల్‌మిల్లు ఖాజా, నల్లం రవిశంకర్ పాల్గొన్నారు. -
మాయానేస్తం..డిగ్రీ ఉన్నా.. దరఖాస్తుతిరస్కరణ
ఈ చిత్రంలో కనిపిస్తున్న నిరుద్యోగ యువతి పేరు చిచ్చడి సుశీల. వేలేరుపాడు మండలంలోనిచాగరపల్లి గ్రామం. ఈమె తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీఏ పొలిటికల్ సైన్స్2017లో పూర్తి చేసింది. యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకుంది. రిజిస్టేషన్ చేసుకున్నా నంబర్ ఎలాట్ కాలేదు. ఆన్లైన్లో అన్ని ఆప్షన్లలో ఓకే అయింది. కానీ చదువుకున్న కాకతీయ యూనివర్సిటీ మాత్రం ఆన్లైన్ వెబ్సైట్లో లేకపోవడంతో దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో అర్హత ఉన్నా యువనేస్తం పథకానికి ఎంపిక కాలేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన యువనేస్తం పథకం పోలవరంముంపు మండలాల్లో 6,500 మంది నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఈ పథకం నిరుద్యోగ యువతను నిరుత్సాహానికి గురి చేసింది. పోలవరం ముంపుతో నిర్వాసితులమై ఇప్పటికే అంతా కోల్పోయామని వేదన చెందుతున్న ఈ ప్రాంత యువత మరింత షాక్‌కు గురయ్యారు. పశ్చిమగోదావరి, వేలేరుపాడు: ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే స్థాయిలోనే కష్టాలు ఎదురుకాగా వాటిని పరిష్కరించే నాథుడే లేకుండా పోయాడు. ఉమ్మడి ఆంధ్రాలో ఉండగా తమకు సమీపంలోని కళాశాలలో చదువుకోవడం, విభజన తర్వాత అవి తెలంగాణలో ఉండిపోవడమే వీరికి శాపంగా మారింది. ముంపు ప్రాంత ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి యువనేస్తం పథకం నిదర్శనంగా నిలుస్తోంది. ఓట్లతో సహా అధికారికంగా ఇటీవలే ఆంధ్రాలో కలిపిన అధికారులకు యువనేస్తం పథకం అమలులో వచ్చిన చిన్న ఆటంకాన్ని పరిష్కరించే తీరిక లేకపోవడంపై నిరుద్యోగ యువత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ముంపు ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు, తూర్పుగోదావరి జిల్లాలో కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో అధికారిక లెక్కల ప్రకారం 66,328 కుటుంబాల నిర్వాసితులున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 29,545 నిర్వాసిత కుటుంబాలుఉండగా ఇందులో పదివేల గిరిజన కుటుంబా లున్నాయి. ఏడు ముంపు మండలాల్లో సుమారు 6,500 మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్నారు. ఈ మండలాల్లో వేలసంఖ్యలో యువనేస్తం పథకానికి నిరుద్యోగులు నిరుద్యోగ భృతి లభిస్తుందని ఆన్లైన్లో ఎంతో ఆశతో దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. 100 మందే అర్హులట ఈ ఏడు ముంపు మండలాల్లో 6,500 మంది నిరుద్యోగులుండగా, అందులో వందమంది యువనేస్తం పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వేలేరుపాడులో 17, కుక్కునూరులో 34, కూనవరంలో 13, చింతూరు మండలంలో 14, వీఆర్‌పురంలో 14, ఎటపాక మండలంలో 8 మంది ఎంపిక అయినట్లు అధికారులు ప్రకటించారు. వేలేరుపాడు, కుక్కునూరు మినహా మిగతా నాలుగు మండలాల్లో మంజూరైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. అడుగడుక్కీ కొర్రీలే నిరుద్యోగ యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నా అడుగడుగునా ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. దరఖాస్తు చేసుకున్నాక ఎన్నో నిబంధనలు తెరపైకి వచ్చాయి. ఆధార్‌కార్డు, రేషన్, ఇతర ఆధారాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ ఆన్లైన్లో వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు మాత్రమే కన్పిస్తున్నాయి. తెలంగాణ యూనివర్శిటీలు లేవు. అసలు తెలంగాణ యూనివర్సిటీల ఆప్షనే లేదు. హాల్ టికెట్ నంబర్ కొట్టినా ఆ డేటా ఎంట్రీ కావడంలేదు. దీంతో వేలమంది అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. లభించని తెలంగాణ విద్యాసంస్థల డేటా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ప్రాంత యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ, ఉస్మానియా, జేఎన్టీయుహెచ్ యూనివర్శిటీలలో విద్యనభ్యసించారు. వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాకలలో కళాశాలలు కాకతీయ యూనివర్శిటీకి అనుసంధానంగా ఉండేవి. విభజన తర్వాత ఈ కళాశాలలన్నీ ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోకి వచ్చాయి. గతంలో చదువుకున్న విద్యార్థుల డేటా అంతా తెలంగాణలోనే ఉంది. ఆంధ్రాలో ఉండే అవకాశమే లేదు. ఫలితంగా నిరుద్యోగ భృతి పథకానికి ఈ ప్రాంత నిరుద్యోగులు నోచుకోవడంలేదు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం ఇలా ఇతర రాష్ట్రాల్లో విద్యనభ్యసించిన వారు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం లభించడంలేదు. మీరు ఈ రాష్ట్రపు గ్రాడ్యుయేట్ కాదు అని ఫిర్యాదు చేసిన నిరుద్యోగులకు సమాధానం వస్తోంది. అధికారులు ఎవరూ ఈ ముంపు మండలాల నిరుద్యోగుల గురించి పట్టించుకోవడంలేదు. వెబ్సైట్లో మార్పులు చేస్తున్నాం యువనేస్తం పథకం ముంపు మండలాల నిరుద్యోగులకు వర్తించేలా వెబ్‌సైట్‌ను ప్రభుత్వం మారుస్తోంది. రెండు రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీలను కూడా వెబ్సైట్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. వెబ్సైట్లో తిరస్కరణకు గురైన నిరుద్యోగులంతా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. – కె.శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ -
బాబూ.. బంగాళాఖాతంలో కలిపేస్తారు
శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): యువతకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబుని 2019 ఎన్నికల్లో బంగాళాఖాతంలో యువత కలపడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. హిందువులకి రామాయణం, క్రైస్తవులకు బైబిల్, ముస్లిం లకు ఖురాన్ ఎంత పవిత్రమైనవో రాజకీయ పార్టీలకు ఎన్నికల మ్యానిఫెస్టో అంతే పవిత్రమైనదని.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీలపై ఉందన్నారు. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ దీక్ష’ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలిలో మంగళవారం నిర్వహించారు. గాంధీజయంతి సందర్భంగా ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం నిరుద్యోగులకు ఇచ్చిన మోసాలపై కరపత్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారన్నారు. నోటిఫికేషన్లు ఇస్తారని ఆశగా ఎదురుచూస్తు కోచింగ్సెంటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారే తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్నారు. నాలుగున్నరేళ్లుగా గుర్తుకురాని నిరుద్యోగ యువత ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ‘యువనేస్తం’ పేరుతో మరో మోసానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్నారు. రాష్ట్రవిభజన సమయానికి రాష్ట్రంలో 1.34 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదికిస్తే ఇప్పటివరకు ఒక్క ఖాళీని భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. అధికార దాహంతో రైతులకు, మహిళలకు, నిరుద్యోగులందరికీ అమలు చేయలేని హామీలిచ్చి అధికారం చేపట్టి తన కొడుక్కి మాత్రమే ఉద్యోగం ఇచ్చేసి దోచుకు తింటున్నారన్నారు. రాష్ట్రంలో మళ్లీ స్వర్ణయుగం రావాలంటే వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితోనే సాధ్యపడుతుందన్నారు. నిరుద్యోగులపై కనికారం, బాధ్యత లేకుండా వారి జీవితాలతో చెటగాటమాడుతున్న బాబును చిత్తుచిత్తుగా యువత ఓడించడం ఖాయమన్నారు. దీక్షలో యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), ధర్మాన రామ్మోనోహర్నాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, నగర అధ్యక్షుడు కోరాడ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నక్క రామకృష్ణ, పేడాడ అశోక్, నగర ప్రధానకార్యదర్శులు సీపాన రామారావు, చీమల తారక్, అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఎం.వి పద్మావతి, ఎన్ని ధనుంజయరావు, శిమ్మ రాజశేఖర్, గొండు కృష్ణమూర్తి, మూకళ్ల తాతబాబు, పొన్నాడ రుషి, కేఎల్ ప్రసాద్, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను, రఘుపాత్రుని చిరంజీవి, టి.కామేశ్వరి, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, ఆర్.ఆర్.మూర్తి, కె.ముకుందరావు, గుడ్ల మల్లేశ్వరరావు, పొట్నూరు బాలకృష్ణ, చల్లా మంజులత, గుమ్మా నగేష్, ఆదిలక్ష్మి, జ్వోతి, శ్యామ్ వైఎస్సార్ అభిమాని ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన:దాసన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని...మోసాలకు, అన్యాయాలకు, అక్రమాలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నిత్యం విదేశాలు తిరగడమే తప్పా ఈ నాలుగున్నరేళ్లల్లో ఒక్క పరిశ్రమను నెలకొల్పిన పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగ యువతకు సరైన శిక్షణ ఇచ్చి నైపుణ్యతను పెంచితే తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఆ దిశగా టీడీపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేయడం లేదన్నారు. చంద్రబాబు మాటలకు.. చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతుందన్నారు. తెలంగాణలో రోజుకో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తుంటే ఏపీలో మాత్రం ఇస్తామని ప్రకటనలు గుప్పించడమే తప్పా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. దోచుకు తినడమే బాబుకు తెలుసు:తమ్మినేని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ చంద్రబాబుకి రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు. న్యాయస్థానాలపై గౌరవం లేకుండా చట్టాలను చుట్టాలుగా మార్చుకుని దోచుకు తినడమే బాబుకి తెలుసన్నారు. గాంధీజీ అహింస, నీతికి, ఆదర్శానికి, నిగ్రహానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. గాంధీ జయంతి రోజున నిరుద్యోగ యువత ఇటువంటి కార్యక్రమం చేపట్టారంటే గాంధీపై ఏ మాత్రం గౌరవమున్నా చంద్రబాబు యువతకు ఓ నిజమైన హామీనివ్వాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఊరురా, వాడవాడలా తిరిగి అబద్ధపు హామీలు ప్రచారం చేసి, పోస్టర్లు అంటించి వాటన్నింటిని గాలికొదిలేసిన బాబుని ప్రజలు ఏ విధంగా క్షమించరన్నారు. ముఖ్యమంత్రి అంటే పీకపోయినా మాటమార్చకుండా ఉండాలే తప్పా చంద్రబాబులా గంటకోమాట, గడియకోమాట చెప్పి ప్రజలను మోసం చేయడం కాదన్నారు. -
ఆకలిపోరాటం..!
నాలుగున్నరేళ్లుగా కొలువు కోసంఎదురుచూస్తున్నా.. ఫలితం మాత్రం దక్కడం లేదు. రాష్ట్రంలో లక్షలాదిపోస్టులు.. జిల్లాలో వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నా.. భర్తీ ఎండమావిగానే మారింది. ప్రభుత్వం రేపుమాపు అంటూ డీఎస్సీ,పంచాయతీ కార్యదర్శి, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ ప్రకటనలకే పరిమితం అవుతోంది. తల్లిదండ్రుల కష్టార్జితంతో చదివిన పేదలు ప్రభుత్వ ఉద్యోగం కోసం వేలాది రూపాయలు ఖర్చుచేస్తూ కోచింగ్సెంటర్ల చుట్టూతిరుగుతున్నారు. కానీ నోటిఫికేషన్లు మాత్రం రావడం లేదు. ఉద్యోగాలు రాక...కుటుంబానికి భారం కాకూడదనే ఆవేదనతో ఆత్మహత్యలకు సైతంవెనకాడటం లేదు. ఇటీవల రాయచోటిలో కుసుమ అనే నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడటమే దీనికి నిదర్శనం. సాక్షి, కడప : జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. డిగ్రీ మొదలు ఎంఏ, ఎంబీఏ, పీజీలు, బీటెక్, ఎంటెక్, బీఈడీ, ఫార్మసీతోపాటు టెక్నికల్ రంగాలకు సంబంధించిన ఎంతోమంది ఇప్పటికే చదువు ముగించుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 80 వేల వరకు కనిపిస్తున్నా అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు మూడు లక్షల మేర నిరుద్యోగులు ఉన్నారు.ఏడాదికేడాదికి నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టు ఉపాధి అవకాశాలు లేకపోవడం..స్వయం సహాయక పథకాలు (రుణాలకు సంబంధించి యూనిట్లు) ఉన్నా అవి కూడా అధికార పార్టీ అనుకూలురకు.. జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకే ఇస్తుండడంతోనిరుద్యోగులకు అవి కూడా అందని ద్రాక్షగా మారాయి. కనిపించని నోటిఫికేషన్లు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ ఒకసారి, పోలీసుశాఖకు సంబంధించి కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయింది. రెండోసారి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం మొదలుకొని విద్యాశాఖ మంత్రి వరకు మాటలు చెబుతున్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ కాలేదు. జిల్లాలోని అన్నిశాఖల్లో అటెండర్ మొదలుకొని కీలక అధికారి వరకు ఖాళీలు కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ భర్తీ చేయలేదు. ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో నిరుద్యోగులు ప్రైవేటు సంస్థల వైపు అడుగులు వేస్తున్నా టార్గెట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక వెనక్కి మళ్లుతున్నారు. అధికారంలోకి వచ్చినాలుగున్నరేళ్లు దాటినా... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట....వచ్చిన తర్వాత మరో మాట చెబుతోంది.ఎలాగోలా పథకంలో నుంచి లబ్ధిదారులను తగ్గించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన నిరుద్యోగ భృతి విషయంలోనూ దాదాపు నాలుగేళ్ల పుణ్యకాలం గడిచినంత వరకు మొద్దునిద్రలో ఉన్న టీడీపీ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో మేలుకున్నట్లు నటిస్తోంది. ఇంటింటికి ఉద్యోగం.లేకుంటే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 1000లకే పరిమితం చేసింది. అక్టోబరు నుంచి అందించాలని కసరత్తు చేస్తున్నా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
బాబూ జాబెక్కడా..?
ఎస్వీఎన్ కాలనీ : బాబూ జాబెక్కడా..?అంటూ నిరుద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని సూటిగా ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి యువత ఓట్లును రాబట్టుకున్న చంద్రబాబు, గద్దెనెక్కిన తరువాత యువతను నిరుద్యోగులను ఏమార్చుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన నిరుద్యోగులు, యువత, ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా నిరుద్యోగ ఐక్యవేదిక కన్వీనర్ కేవీ.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువతపట్ల, నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. బాబు వస్తే జాబు వస్తుందని అందరూ నమ్మారని, చివరకు నిరుద్యోగులకు రూ.2వేలు నెలవారీ భృతి ప్రకటించి చేతులు దులుపుకున్నారన్నారు. తీరా ఇపుడు నాలుగేళ్లు గడిచిన తరువాత ముందస్తుగా ప్రకటించిన రూ.2వేలనూ రూ.వెయ్యికి కుదించి రాష్ట్రంలోని యువతను నిలువునా మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ప్రకటన చేసి పాలాభిషేకాలు చేయించుకున్న చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 33లక్షల మంది నిరుద్యోగులను మోసగించారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత యువతకు కనీస ప్రయోజనాలు దక్కలేదని, క్యాబినెట్ హామీ మేరకు 20వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగులకు ఆదుకునేలా ప్రకటన జారీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తమ ప్రధాన డిమాండ్‌గా తెలిపారు. పోరాటంతోనే సాధన... మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయితీ కార్యదర్శుల ఖాళీల భర్తీకై రాష్ట్ర మంత్రి లోకేష్‌బాబు 1500 పోస్టులు ఔట్‌సోర్సింగ్‌లో ఇస్తానని ప్రతిపాదించి జిల్లా కలెక్టర్లకు జీవోలు పంపారని వెల్లడించారు. కేవలం నిరుద్యోగులు చేసిన ఆందోళనతోనే ఆ జీవో ఉపసంహరించి నోటిఫికేషన్‌కు సిద్ధమయ్యారన్నారు. పోరాటం చేయకుండా, ఉద్యమించకుండా ఏదీ సాధించలేమన్నారు. ç2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఏడాదికి ఒక డీఎస్సీ ఇస్తానన్నారని, ఇప్పటికీ కనీసం ఒక్క డీఎస్సీని ప్రకటించలేదన్నారు. డీఎస్సీలో 22వేల పోస్టులుంటాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ముందుగా ప్రకటించి ఇపుడు వాటిని వెయ్యికి మాత్రమే పరిమితం చేశారన్నారు. గ్రూప్2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్2లోనే కొనసాగించాలని, జీవో 622 రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సి ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కళ్లుండి చూడలేని ప్రభుత్వం పట్టభధ్రుల ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళుతెరిచి రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను ఆలకించాలని, లేకుండా రానున్న ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు సైతం దక్కని విధంగా ఓటమిని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటి అధ్యక్షుడు పూర్ణ, కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి సవరం రోహిత్, ప్రజాసంఘాల నేతలు కుమ్మరి క్రాంతికుమార్, అంగిరేకుల వరప్రసాద్, ఎస్ఎఫ్ఐ నేత భగవాన్‌దాస్, పీడీఎస్యు నేత గనిరాజు, దొంతా సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్పాట్ అపాయింట్ మెంట్.. ఢిల్లీలో ట్రైనింగ్
సాక్షి, సిటీబ్యూరో/లింగోజిగూడ: రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను రాచకొండ ఎస్వోటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సయ్యద్ రఫీక్ మంగళవారం వివరాలు వెల్లడించారు. మల్కాజ్‌గిరికి చెందిన శ్రీకాంత్, మలక్‌పేట్‌కు చెందిన సంజయ్ స్నేహితులు. వీరికి నగరంలో సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న బండారు గౌరీ శంకర్‌తో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం పన్నిన శ్రీకాంత్ తనకు రైల్వేలో మంచి పరిచయాలున్నాయని, ఎవరైనా అభ్యర్థులను తీసుకువస్తే లంచాలు ఇచ్చి ఉద్యోగాలిప్పిస్తానని సంజయ్, గౌరీ శంకర్లకు చెప్పాడు. ఈ విషయాన్ని సంజయ్ తన బంధువు చైతన్యపురికి చెందిన ఉమాదేవికి చెప్పడంతో ఆమె ఇద్దరు అభ్యర్థులను సంజయ్‌కి పరిచయం చేసింది. అనంతరం వారు సదరు యువకులకు రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇందుకుగాను రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారి మాటలు నమ్మిన అభ్యర్థులు రూ.ఐదు లక్షల చొప్పున రూ.10 లక్షలు చెల్లించడంతో ఉమాదేవి, సంజయ్ తమ కమీషన్లు రూ.2 లక్షల చొప్పున తీసుకుని మిగతా మొత్తాన్ని శ్రీకాంత్‌కు అందజేశాడు. అనంతరం శ్రీకాంత్ వారిని నమ్మించేందుకు రైల్వేలో ఉద్యోగం వచ్చినట్లుగా నకిలీ నియామక పత్రాలు అందజేసి, శిక్షణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లి పది రోజుల పాటు అక్కడే ఉంచాడు. శిక్షణ అనంతరం కొద్ది రోజుల్లో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని చెప్పి పంపారు. ఇదే విధంగా గౌరీశంకర్ తీసుకొచ్చిన మరో అభ్యర్థిని కూడా ఇదే తరహాలో టోకరావేయడంతో వారిపై అనుమానం వచ్చిన అతను రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై రాజు దర్యాప్తు చేపట్టారు. రైల్వే ఉద్యోగం ఆశిస్తున్న అభ్యర్థిలా వెళ్లిన పోలీసులు మంగళవారం చైతన్యపురిలో నిందితులను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. -
నిరుద్యోగులకు వల
ఆరిలోవ(విశాఖ తూర్పు): వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఓ ప్రబుద్ధుడు వల చేసి, లక్షల్లో దండేశాడు. తీరా ఉద్యోగాలు లేకపోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో టాస్క్ఫోర్సు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు.వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌కు చెందిన కోటేశ్వరరావు జిల్లా పరిషత్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సాయికృష్ణ పరిచయమయ్యాడు. కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి సాయికృష్ణ.. కోటేశ్వరరావుతో పరిచ యం పెంచుకున్నాడు. జిల్లాలో ఏదైనా పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లో ఉద్యోగం ఇప్పిస్తానని, డీఎంహెచ్‌వో, ఇతర వైద్యాధికారులు తనకు బాగా తెలుసని నమ్మించాడు. అలా కోటేశ్వరరావు వద్ద రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ విషయం కోటేశ్వరరావు తన స్నేహితులతో చెప్పడంతో విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన మరో 8 మంది, శ్రీకాకుళం జిల్లా, విశాఖ నగరానికి చెందినవారు సుమారు 30 మంది రూ.35,000లు నుంచి రూ.లక్ష వరకు సాయికృష్ణకు చెల్లించారు. పీహెచ్సీలలో కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మించి ఈ ఏడాది జూన్ మొదటి వారంలో డబ్బులు వసూలు చేశాడు. రెండో వారంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. చేతికి పోస్టింగ్ ఆర్డర్ ఇస్తానంటూ కొందరిని కాకినాడ రీజనల్ హెల్త్ సెంటర్‌కు కూడా తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు లాడ్జీలో ఉంచాడు. కొద్ది రోజులు పడుతుందని అధికారులు అన్నారని మాయమాటలు చెప్పి తిరిగి పంపించేశాడు. జూలై గడిచినా ఉద్యోగాలు రాలేదని, సాయికృష్ణ మోసం చేశాడని బాధితులు గ్రహించారు. సాయికృష్ణను పరిచయం చేసిన కోటేశ్వరరావుని బాధితులు నిలదీశారు. దీంతో కోటేశ్వరరావు తాను కూడా బాధితుడినేనని, మిగిలిన బాధితుల సహకారంతో ఇటీవల టాస్క్ఫోర్సు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు గురువారం నగరంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్రనగర్‌కు చెందిన కోటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకొన్న సాయికృష్ణను ఆరిలోవ పోలీసులకు అప్పగించారు. మిగిలిన బాధితులు కూడా స్టేషన్‌కు వచ్చి సాయికృష్ణ తమకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. ఆరిలోవలో రెండో ఫిర్యాదు ఇదిలా ఉండగా సాయికృష్ణ ఆరు నెలల క్రితం ఇదే విధంగా నిరుద్యోగులను మోసం చేయడంపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అప్పట్లో కూడా నగరానికి చెందిన కొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. వారంతా హనుమంతవాక వద్ద సాయికృష్ణను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ ఇదే మాదిరిగా నిరుద్యోగులను మోసం చేశాడు. ఇప్పుడు రెండో ఫిర్యాదు నమోదైంది. సాయికృష్ణ వలలో పడి ఇలా నిరుద్యోగులు తరచూ మోసపోతున్నారు. ద్యోగాల పేరిట మోసగించిన వ్యక్తి అరెస్ట్ అల్లిపురం(విశాఖ దక్షిణ): నేవల్ డాక్‌యార్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసగించిన వ్యక్తిని టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జీవీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ పార్కు దరి హెచ్‌బీ కాలనీకి చెందిన గాడి సత్యసూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్ హైదరాబాద్ యల్లారెడ్డి గూడెంలోని సన్ సిటీ అపార్టమెంట్స్‌లో నివసిస్తున్నాడు. ఈయన గత నెల జూలైలో విశాఖపట్నం వచ్చి డాల్ఫిన్ హోటల్లో బస చేశాడు. ఆ సమయంలో ఆయన నేవల్ అధికారుల వస్త్రధారణలో, కెప్టెన్‌గా నిరుద్యోగులను ఆకట్టుకున్నాడు. ఉద్యోగం అవసరమైన వారిని గుర్తించి వారిని హోటల్‌కు ఆహ్వానించి డిన్నర్ ఏర్పాటు చేసేవాడు. ఇలా అక్కయ్యపాలెంలో సరోజా హాస్పటల్ వద్ద నివసిస్తున్న హుకుంపేటకు చెందిన బుడ్డిగ తరుణ్‌కుమార్‌ను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హోటల్‌కు పిలిచాడు. అతని వద్ద నుంచి రూ.50వేలు తీసుకున్నాడు. ఆ తరువాత శశికాంత్ ముఖం చాటేయడంతో తరుణ్‌కుమార్ మోసపోయానని గ్రహించి గత నెల 30న టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన సీఐ, తన సిబ్బందితో కలసి నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. శశికాంత్ చేతిలో మోసపోయిన నిరుద్యోగులు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. బాధితులు 9440904716, 7989359509 నంబర్లలో ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. -
ఉపాధికి మార్గం.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను చైతన్యం చేసి వారికి తగిన శిక్షణ అందించి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకునే లక్ష్యంతో ఆంధ్రాబ్యాంక్ ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ తరగతులను ఏలూరులో నిర్వహిస్తున్నట్టు జయప్రకాష్ నారాయణ ఆంధ్రాబ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంచాలకులు జె. షణ్ముఖరావు తెలి పారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ ఆ సంస్థలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపై 1,650 మంది శిక్షణ పొందగా, 1,520 మంది వరకూ స్థిరపడినట్టు తెలిపారు. ఇదే కోర్సుపై 2018–19 సంత్సరానికి మరో కొత్త బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కొత్త బ్యాచ్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ కోర్సు శిక్షణకు సంబం ధించిన వివరాలు తెలుసుకుందాం. అభ్యర్థుల అర్హతలు ఇలా.. ♦ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు మాత్రమే ♦ వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ♦ విద్యార్హత : 5వ తరగతి ఆపై శిక్షణ కాలంలో సదుపాయాలు ♦ శిక్షణకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ దూరప్రాంతాల నుంచి శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ♦ హాస్టల్ అభ్యర్థులకు వారి గ్రామాల నుంచి ఒకసారి సంస్థకు రానుపోను ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. ♦ స్థానిక అభ్యర్థులకు కూడా మ««ధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పిస్తారు. ♦ శిక్షణ కాలమందు అవసరమగు సేవలు, మెటీరియల్ సంస్థచే ఉచితంగా అందిస్తారు. ♦ ఫ్యాషన్ డిజైనింగ్‌పై సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనా శిక్షణ ఉంటుంది. ప్రత్యేకతలు ఇలా.. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ♦ 30 రోజుల్లోనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో నైపుణ్యంపై మెరుగైన శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు ఇలా.. ♦ ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు ఫోన్ ద్వారా/ఎస్ఎంఎస్/పోస్ట్ కార్డు ద్వారా పేర్లు, చిరునామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ♦ గతంలో పేర్లు నమోదు చేసుకున్నవారు, కొత్తగా అడ్మిషన్‌కు అర్హత సాధించినవారు వారి ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 3 ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది. శిక్షణ సంస్థ చిరునామా : జయప్రకాష్ నారాయణ్ ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, వెలుగు ఆఫీస్ ప్రాంగణం/ఐటీఐ కాలేజీ దగ్గర, సత్రంపాడు, ఏలూరు–534 007. ఫోన్ నంబర్స్: 08812–253 975. సెల్ నెంబర్: 98660 94383/94909 98882 ఫ్యాషన్ డిజైనింగ్‌కు మార్కెట్లో డిమాండ్ ఈ శిక్షణ సంస్థను 2005లో ఏర్పాటు చేశాం. నేటివరకూ 371 బ్యాచ్‌లు 20 రకాల కోర్సుల్లో 12,200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులో ఎక్కువమంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా సంస్థలో శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత యూనిట్ స్థాపించేందుకు బ్యాంకు రుణం పొందుటలో అవసరమగు సలహాలు, సహాయ సహకారం బ్యాంక్ సిబ్బంది అందిస్తారు. – జె. షణ్ముఖరావు, సంచాలకులు, ఏబీఆర్ఎస్ఈటీఐ -
మోసం చేస్తావా అంటూ దేహశుద్ధి!
సాక్షి, విజయవాడ: ఉద్యోగాలిస్తామంటూ వందలాది మందిని మోసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివకోటిరెడ్డి అనే వ్యక్తి మడ్విక్ హార్డ్‌వేర్ సొల్యూషన్స్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పాడు. ఉద్యోగం తన వద్దకు వచ్చిన సుమారు 140 మంది నుంచి రూ.25వేల చొప్పున వసూలు చేశాడు. ఉద్యోగం అడిగితే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన బాధితులు బుధవారం శివకోటిరెడ్డిపై దాడికి దిగి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
గురుకుల పోస్టుల్లో వాళ్లకూ చాన్సివ్వాలి!!
హైదరాబాద్: ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ కోసం తాజాగా విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయుల నోటిఫికేషన్లో అనేక ఆంక్షలు ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పోస్టుల అర్హత విషయంలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పలు ఆంక్షలు, నిబంధనలు పెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. గురుకుల పోస్టుల నోటిఫికేషన్లో విధించిన నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన నిర్వహించారు. డిగ్రీలో బికాం చేసిన వాళ్లకూ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అభ్యర్థుల అర్హతకు సంబంధించి విధించిన పలు నిబంధనలను తొలగించాలని వారు కోరుతున్నారు. -
ఉద్యోగాల కోసం యువత ఉద్యమించాలి
మంచిర్యాల అర్బన్ : నిరుద్యోగ యువకులు ఉద్యోగ, ఉపాధి కోసం ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మార్క్స్ భవనంలో పీవైఎల్ మహాసభల నిర్వహణ పై సమీక్షాసమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై పీవైఎల్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారని, భవిష్యత్‌లో యువతకు ఉపాధి మార్గాన్ని చూపించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని సూచించారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ అణచివేత, రాజ్యాధికారం దుర్వినియోగంపై యువకులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు,కర్షకులు, నిరుద్యోగులు హక్కుల సాధనకు పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. పీవైఎల్ మహాసభలకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఆర్థిక చేయూత నివ్వాలని కోరారు. ప్రగతిశీల సమాజాన్ని నిర్మించే బాధ్యత నేటి తరం యువకులపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్రావు అన్నారు. సమాజం మార్పు కోసం యువజన ఉద్యమాలు రావాలని అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమాలను నిరోధించి, దూరమవుతున్న మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడానికి, భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవడానికి యువకులు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య, నాయకులు మల్లేశ్, రమేశ్, రాజేశ్ పాల్గొన్నారు. మహాసభ సన్నాహక కమిటీ అధ్యక్షునిగా గురిజాల.. మంచిర్యాలలో ఆగస్టు 30, 31వ తేదీలలో నిర్వహించనున్న పీవైఎల్ 6వ రాష్ట్ర మహాసభల సన్నాహక కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గురిజాల రవీందర్రావు, ఉపాధ్యక్షులుగా పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నంది రామయ్య, రాజన్న, మల్లేశ్, రవీందర్, బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా పుల్లయ్య, సహాయ కార్యద ర్శులుగా జైపాల్, జ్యోతి, మంగ, తిరుపతి, రమేశ్, మాన్సింగ్, తిరుపతి, కోశాధికారిగా లాల్కుమార్లతో మొత్తం 50 మందితో సన్నాహక కమిటీని ఎన్నుకున్నారు. -
చంద్రబింబం: జూన్ 15 నుండి 21 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) నూతన వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. వారం ప్రారంభంలో రుణయత్నాలు. దూరప్రయాణాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో లేనిపోని వివాదాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకూ సఫలం. వారం చివరిలో ధన,వస్తులాభాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ధనలాభం. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో అనారోగ్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనులు సజావుగా పూర్తికాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం మధ్యలో ఇంటాబయటా ఒత్తిడులు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు అసంతృప్తి. ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఈ వారం మీ సహనానికి పరీక్షా సమయమే. బంధువులు, మిత్రులతో వివాదాలు. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాల వారు కొంత నిరాశ చెందుతారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. సోదరులతో వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారవచ్చు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారు ఆశించిన ప్రగతి. వారం చివరిలో అనారోగ్యం. ఆటంకాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
-
కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ : కిడ్నీ రాకెట్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందం చెన్నైకి వెళ్లింది. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఈరోజు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దినేష్ ఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీసీఎస్ డీసీపీ పాల్రాజు తెలిపారు. కాగా కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు దినేష్ పోస్టుమార్టం నివేదికలో అతనిది సాధారణ మరణం (గుండెపోటు) అని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక ఆపరేషన్‌కు ముందే గుండెపోటు వచ్చి చనిపోయాడా అనే విషయాలు ఆ నివేదికలో డాక్టర్లు పేర్కొనలేదని పాల్రాజు తెలిపారు. -
కొలంబో కిడ్నీ రాకెట్లో మరో బాధితుడు
కొలంబో కిడ్నీ రాకెట్లో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దినేష్ కుమార్‌తో పాటు కిరణ్ అనే యువకుడు కూడా కొలంబో వెళ్లాడని, అతడి నుంచి కూడా కిడ్నీ తీసుకుని దాన్ని కొలంబో నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సదరు రాకెట్‌లోని వాళ్లు పంపారని తాజాగా తెలిసింది. సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసుల విచారణలో మొత్తం విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భ్రమపెట్టి 26 ఏళ్ల దినేష్ అనే యువకుడిని కొలంబో తీసుకెళ్లడం, అతడు సూపర్ మార్కెట్ పనిమీద విశాఖ వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లడం తెలిసిందే. మార్చి 30వ తేదీన అతడు మరణించినట్లు కొలంబో పోలీసుల నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఈ విషయమై అతడి అన్న గణేష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొలంబో కేంద్రంగా హైదరాబాద్, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ కిడ్నీ రాకెట్ నడుస్తున్న విషయం తెలిసింది. -
ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి...
-
ఉద్యోగానికి వెళ్తున్నారా.. కిడ్నీ జర భద్రం
మీరు పదో తరగతి ఫెయిలైనా, పాసైనా పర్వాలేదు.. నెలకు పది, పదిహేను వేల రూపాయల జీతంతో ఉద్యోగం ఇస్తాం, ముందుగా వైద్యపరీక్షలు చేయిస్తాం అని ఎవరైనా చెబుతున్నారా? పొరపాటున కూడా నమ్మి వెళ్లకండి. అలా వెళ్లారో, మీ ఒంట్లోంచి మీకు తెలియకుండానే ఒక కిడ్నీ మాయమైపోయే ప్రమాదం పొంచి ఉంది. ఉద్యోగాల పేరుతో యువతకు ఎర వేస్తూ కిడ్నీలు దొంగిలిస్తున్న ఓ రాకెట్ వ్యవహారం మొత్తం హైదరాబాద్‌లో బయటపడింది. ఇంతకుముందు కూడా విజయవాడ లాంటి నగరాలు కేంద్రాలుగా కిడ్నీ రాకెట్లు నడిచాయి. ఇప్పుడు మరోసారి అవి రెక్కలు విప్పుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లిన ఓ యువకుడి నుంచి అతడి కిడ్నీ దొంగిలించి.. ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టడంతో మొత్తం విషయం బయటపడింది. శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా 'కిడ్నీ రాకెట్' నడుస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువకుడి అనుమానాస్పద మృతితో అసలు కథ వెలుగులోకి వచ్చింది. డిగ్రీ చదివిన దినేష్ కుమార్ అనే ఆ యువకుడు సూపర్ మార్కెట్ పనిమీద విశాఖ వెళ్తున్నానని గత నెల 22న ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత..మీ సోదరుడు గుండెపోటుతో మృతి చెందాడు అంటూ గత నెల మార్చి 30న దినేష్ అన్న గణేష్‌కు కొలంబో పోలీసులనుంచి ఫోన్ వచ్చింది. వెంటనే వారు భారత హైకమీషన్ అధికారుల సాయంతో దినేష్ మృతదేహాన్ని తెప్పించుకుని అంత్యక్రియలు జరిపించారు. అయితే విశాఖ వెళ్లిన వాడు కొలంబోకు ఎందుకు వెళ్లాడు అని కుటుంబ సభ్యులకు వచ్చిన అనుమానంతో వ్యవహారం మలుపు తిరిగింది. దినేష్‌కు చెందిన ఈమెయిల్స్‌ను పరిశీలించగా, మూత్రపిండాలు కొనుగోలు చేసే ఏజెంట్లతో అతను లెక్కలేనన్ని సార్లు సంప్రదింపులు జరిపినట్లు తేలింది. దీంతో కొలంబోకు వెళ్లిన తర్వాత మూత్రపిండాలు తీసుకుని దినేష్‌ను చంపేసి వుంటారని అతని సోదరుడు గణేష్..సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.