
చికిత్స పొందుతున్న చంద్ర చూడామణి
పార్వతీపురం: ఉద్యోగం రాలేదన్న నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం దేవుకోన గ్రామానికి చెందిన కొండబోయిన చంద్ర చూడామణి డిగ్రీ చదివి ఎన్నో పోటీ పరీక్షలు రాశాడు. అయితే ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంటిలో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కొమరాడ మండలం రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మతిస్థిమితం లేక
మతిస్థిమితం సరిగ్గా లేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మండలం ఎంఆర్ నగరంనకు చెందిన పొగిరి దుర్గాప్రసాద్ తాగుడికి బానిసయ్యాడు. పైగా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి 108 వాహనంలో అతడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment