కొలంబో కిడ్నీ రాకెట్లో మరో బాధితుడు | colambo kidney rocket takes another kidney | Sakshi
Sakshi News home page

కొలంబో కిడ్నీ రాకెట్లో మరో బాధితుడు

Published Thu, Apr 17 2014 12:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

కొలంబో కిడ్నీ రాకెట్లో మరో బాధితుడు

కొలంబో కిడ్నీ రాకెట్లో మరో బాధితుడు

కొలంబో కిడ్నీ రాకెట్లో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. దినేష్ కుమార్తో పాటు కిరణ్ అనే యువకుడు కూడా కొలంబో వెళ్లాడని, అతడి నుంచి కూడా కిడ్నీ తీసుకుని దాన్ని కొలంబో నుంచి ఆంధ్రప్రదేశ్కు సదరు రాకెట్లోని వాళ్లు పంపారని తాజాగా తెలిసింది. సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసుల విచారణలో మొత్తం విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భ్రమపెట్టి 26 ఏళ్ల దినేష్ అనే యువకుడిని కొలంబో తీసుకెళ్లడం, అతడు సూపర్ మార్కెట్ పనిమీద విశాఖ వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లడం తెలిసిందే. మార్చి 30వ తేదీన అతడు మరణించినట్లు కొలంబో పోలీసుల నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఈ విషయమై అతడి అన్న గణేష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొలంబో కేంద్రంగా హైదరాబాద్, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ కిడ్నీ రాకెట్ నడుస్తున్న విషయం తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement