హైదరాబాద్: ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ కోసం తాజాగా విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయుల నోటిఫికేషన్‌లో అనేక ఆంక్షలు ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పోస్టుల అర్హత విషయంలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పలు ఆంక్షలు, నిబంధనలు పెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
గురుకుల పోస్టుల నోటిఫికేషన్‌లో విధించిన నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళన నిర్వహించారు. డిగ్రీలో బికాం చేసిన వాళ్లకూ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అభ్యర్థుల అర్హతకు సంబంధించి విధించిన పలు నిబంధనలను తొలగించాలని వారు కోరుతున్నారు.
గురుకుల పోస్టుల్లో వాళ్లకూ చాన్సివ్వాలి!!
Published Wed, Feb 8 2017 2:51 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
Advertisement