gurukula notification
-
గురుకుల నోటిఫికేషన్ జాడేది? 11 వేల ఉద్యోగాలకు అనుమతులు వచ్చినా!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అన్నిరకాల అనుమతులు జారీ అయి నెలలు కావస్తున్నా గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) నోటిఫికేషన్ల ఊసెత్తడం లేదు. మొత్తం 11 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా.. ఇందులో 9,096 పోస్టులకు 8 నెలల క్రితమే.. మరో 2వేల పోస్టులకు నెలరోజుల క్రితం అనుమతులు వచ్చాయి. ఉద్యోగ జాతరలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతేడాది యుద్ధ ప్రాతిపదిక చర్యలు మొదలు పెట్టింది. అందులో ఇప్పటికే 60వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) దాదాపు 18 వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రకటనలు జారీ చేసింది. ఇక తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) సైతం మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో 7 వేల ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చింది. ఇలా వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బిజీ అవుతుండగా.. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. నిరాశలో అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం ఐదు గురుకుల సొసైటీల పరిధిలో పోస్టుల భర్తీ బాధ్యతలను టీఆర్‌ఈఐఆర్‌బీకి అప్పగించింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ పక్కా వ్యూహంతో సన్నద్ధం కావాలి. బోర్డుకు చైర్మన్‌గా గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ ఒకరు వ్యవహరిస్తారు. ఆ తర్వాత మరో కార్యదర్శి కన్వీనర్‌గా, మిగతా సొసైటీలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సొసైటీల కార్యదర్శులే బోర్డులో ఉండటంతో ఉద్యోగ ఖాళీలు, ఇతర అంశాల సమాచారం వేగంగా సేకరించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయినా జాప్యం తప్పడం లేదు. దీనితో గురుకుల కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. -
పండుగ నాటికి 12,000 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పుడు గురుకుల కొలు వులకు సమయం ఆసన్నమైంది. గత నెల రోజు లుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్ఎస్ ఆర్బీ) ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక టనలు జారీ అయ్యాయి. ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో నాలుగు ప్రధాన నియామక సంస్థలుండగా.. మూడు సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువ డ్డాయి. కానీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. వాస్తవానికి 9 వేల కొలువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులు జారీ చేసింది. దీంతో సంబంధిత గురుకుల సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో వాటికి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు మంజూరయ్యాయి. దీంతో వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇస్తే ఒకేసారి ప్రకటనలు విడుదల చేయవచ్చని గురుకుల నియామకాల బోర్డు సూచించింది. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా మంజూరైన పోస్టులకు ప్రభుత్వ అనుమతులు రావడంలో ఇప్పటివరకు జాప్యం నెలకొంది. దీంతో కొలువుల ప్రకటనల జారీ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఆనుమతులు దాదాపుగా వచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగ ప్రకటనల జారీకి టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. పండుగ నాటికి ప్రకటనల జారీ.. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుక బడిన తరగతులు సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో 9,096 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. తాజాగా బీసీ గురుకులాల్లో మరో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో దాదాపు 69 కేటగిరీలకు చెందిన కొలువులున్నాయి. ఈ పోస్టుల భర్తీకిగాను గురు కుల సొసైటీలు జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించిన ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించాయి. బోర్డు అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకు న్నాక ప్రకటనలు జారీ చేయనున్నట్లు అధికా రులు చెబుతున్నారు. పరిశీలన ప్రక్రియతో పాటు బీసీ గురుకుల సొసైటీకి సంబంధించిన కొన్ని పోస్టులకు పూర్తిస్థాయి అనుమతులు జారీ అయ్యేందుకు మరో రెండ్రోజుల సమయం పడుతుందని సొసైటీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం, పది రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ నాటి కల్లా టీఆర్‌ఈఐఆర్‌బీ నుంచి ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
దరఖాస్తుపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ ఉద్యోగాల నియామకాలపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గత నెల 14న ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో 19 ప్రిన్సిపాల్ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న కొత్తగా ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మరో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్లోనే కొత్త పోస్టులను కలుపుతూ ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 34 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేందుకు మార్చి 20 వరకు గడు వును నిర్దేశించింది. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటనే దానిపై బోర్డుకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నోటిఫికేషన్ ప్రకారం ఎస్సీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా ఎస్టీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలా అనే అం శంపై స్పష్టత లేక అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఆప్షన్లు మార్చుకుంటే సరి... గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ ఉద్యోగాల దరఖాస్తుపై గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన యంత్రాంగం.. ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యాక ఆప్షన్లు మార్చుకోవాలని సూచిస్తూ వివరాలను గురుకుల బోర్డు వెబ్సైట్లో పొందుపర్చింది. మొత్తం 34 కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇందులో 5 పోస్టులు జనరల్ కాలేజీలు కాగా... మిగతా 29 మహిళా డిగ్రీ కాలేజీలు. -
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
వైరా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ కేజీ టూ పీజీ’ మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో 2019–020 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ఆంగ్ల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 2017 జూన్‌లో ప్రారంభించబడిన 26 బీసీ, ఎస్సీ, ఎస్టీ టీఎస్ గురుకుల పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే పాఠశాలలు.. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు.. అడవి మల్లేల, కల్లూరు, వైరా, నేలకొండపల్లి, టేకులపల్లి, దానవాయిగూడెం, ఎర్రుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలు. కూసుమంచి, తిరుమాలయపాలెం, మధిర, ముదిగొండ, సత్తుపల్లి, బీసీ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలు ఎర్రుపాలెం, చెరువుమాదారం, దానవాయిగూడెం, ముసలిమడుగు, లంకపల్లి, వైరా బీసీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు. బోనకల్, కుంచపర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుమాలయాపాలెం, కారేపల్లి,(బాలురు), వైరా (బాలికలు). మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలు.. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి (బాలుర), రఘునాధపాలెం, వైరా, ఖమ్మం (బాలికలు) టీఎస్‌ఆర్‌ఎస్‌లో... వైరా (బాలికలు), ఏన్కూరు (బాలురు) ప్రవేశానికి అర్హతలు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు. 01.09.2019 నాటికి 9 నుంచి 11 ఏళ్ల వయ స్సు కలిగిన పిల్లలు అర్హులు కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించరాదు. ఇవన్నీ ఉంటే గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు. రిజర్వేషన్లు... సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 75 శాతం, బీసీ (సీ)లకు 2 శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 12శాతం, ఇతరులకు 2 శాతం, మైనార్టిలకు 3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలు 12 శాతం, ఎస్టీలకు 80 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 3 శాతం ఉంటాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15శాతం, బీసీ–సీలకు 3 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకుక 71శాతం (బీసీ–ఏ 20 శాతం, బీసీ–బీ 28శాతం, బీసీ–డీ 19 శాతం, బీసీ–ఈ 4శాతం) సైనిక ఉద్యోగుల పిల్లలకు 3 శాతం ఉంటాయి. ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 73 శాతం, అనాథలకు 3 శాతం, వికలాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. దరఖాస్తు విధానం.. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. టీఆర్ఈఎస్ఐడీఈ ఎన్టీఐఏఎల్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ల కోసం విద్యార్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, వేరేవారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేసినా సెక్షన్ 416 ఐపీసీ (1860) ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఇతర సమాచారం కోసం ఉచిత హెల్ప్‌లైన్ నం బర్ 1800 425 45678లో సంప్రదించవచ్చు. మైనార్టీ గురుకులాలకు ప్రత్యేక నోటిఫికేషన్.. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ గురకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్ల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో కోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31, ప్రవేశపరీక్ష ఏప్రిల్ 24వ తేదీన నిర్వహిస్తారు. రాత పరీక్ష... ఏప్రిల్ 07,2019న ఉదయం 11 నుంచి 1 గంట వరకు నిర్వహించే ప్రవే శపరీక్ష జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లో తెలుగు, ఉర్దూ, ఆంగ్లమాధ్యమాల్లో ఉంటుంది. 4వ తరగతి సామార్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, ఉర్ధూ, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల విషాయాలపై 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఐచ్చిక తరహ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ముఖ్యమైన తేదీలు... ఏప్రిల్ 2 నుంచి 7 వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7 ఆదివారం ఉదయం 11 నుంచి 1 గంట వరకు 5వ తరగతి ప్రవేశపరీక్ష మే నెలలో ఫలితాలు వెల్లడి మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేసి, అనంతరం ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం. -
నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఝలక్?
గురుకుల నోటిఫికేషన్ వచ్చిందనే సంబరం కాసేపే నిబంధనలు చూసి బిత్తరపోతున్న నిరుద్యోగ, విద్యార్థిలోకం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా లేదంటూ ఆవేదన అర్హతల విషయంలో ఆమోదయోగ్యంకాని ఆంక్షలు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే సాధారణంగా ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి లోకం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది. ఇదేం నోటిఫికేషన్ దేవుడా అంటూ తాము తలలు పట్టుకునే పరిస్థితి ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలొస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన తమకు టీఎస్పీఎస్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో ఊహించని నిబంధనలు పెట్టి తమ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసిందని గగ్గోలు పెడుతున్నారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపించినట్లు తొలిసారి ఒక మోస్తరు నోటిఫికేషన్‌ను గురుకుల విద్యాలయాల్లో టీచర్ల కొలువుల పేరిట టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల సంఖ్య 7306. ఉద్యోగాల సంఖ్య సంగతి ఎట్లున్నా టీఎస్పీఎస్సీ పెట్టిన నిబంధనలు చూసి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అభ్యర్థులు చెబుతున్న ఆందోళనకరమైన విషయాలేమిటంటే.. గ్రామీణ సోయి మరిచారు ‘తెలంగాణ నగర తెలంగాణ కాదు.. గ్రామీణ తెలంగాణ. ఈ సోయి టీఎస్పీఎస్సీ పెద్దలు మరిచినట్లే కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మొన్నటి వరకు డిగ్రీ చేసే పరిస్థితులే అంతంతమాత్రం. అలాంటిది పాసవడం.. పైగా పెద్దపెద్ద పర్సెంటేజీలు తెచ్చుకోవడం ఇంకా కష్టం. సగం రోజులు కాలేజీల్లో.. సగం రోజులు కూలిపనుల్లో ఉంటూ చదివినవారు.. ఎట్లా పూర్తిగా చదువుతారు ఎట్లా మంచి పర్సెంటేజీ సాధ్యమైతది? ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు డిగ్రీకి 60శాతం ఓసీ, బీసీ అభ్యర్థులకు, 55శాతం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హతగా పెట్టారు. బహుశా ఈ నిబంధన దేశవ్యాప్తంగా ఏ పరీక్షకు నిర్ణయించలేదనే విషయం టీఎస్పీఎస్సీ తెలుసుకుంటే మంచిది’ అంటూ అభ్యర్థులు వేడుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం ‘తెలంగాణలో టీచర్ కొలువుకు పోటీపడే వారిలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు అధికం. తెలుగు మాధ్యమంగా చదివినవారే దాదాపు 80 నుంచి 90% మంది ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రశ్నాపత్రం కేవలం ఆంగ్లంలోనే ఇస్తామని టీఎస్పీఎస్సీ చెప్పింది. ఇది ఎంతవరకు సమంజసం? ఒక తెలుగు రాష్ట్రంలో తెలుగును కాదని, ఆంగ్ల మాధ్యమంలో పేపర్ ఇవ్వడం ఎంతవరకు సబబు? అన్నింటికిమించి ఇక ఆంగ్లంపై పట్టుసరిగా లేనివాళ్లకు ఈ నిబంధన ఒక ఆశని పాతమేగా? ఆంగ్లాన్ని కాదనడం లేదు.. అదే సమయంలో తెలుగు మాధ్యమాల్లో కూడా ప్రశ్నలు ఇవ్వాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. మూడేళ్ల బోధనానుభవం ‘అన్నింటికిమించి పీజీటీ ఉద్యోగాలకు మూడేళ్ల బోధనానుభవం ఉండాలని నిబంధన పెట్టారు. అసలు ఈ నిబంధన పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. డిగ్రీ అయ్యాక, బీఈడీ, టీపీటీ, పీజీ, పీహెచ్డీ ఇలా చదువుకుంటూ వెళతారు.. అలా వెళ్లడం కుదరని వారు కాంపిటేషన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. అంతేకానీ, ప్రైవేటు రంగంలో బోధనవైపు వెళ్లడం అరుదు? ఒక వేళ అలాంటి నిబంధన పెట్టే ఉద్దేశమే ఉంటే టీచర్ ఉద్యోగం చేయాలనుకునే వారు తమ బీఈడీ అయ్యాక మూడేళ్లు ఏదైనా పాఠశాలల్లో పనిచేయాలనే నిబంధన ముందే చెప్పి ఉండాలి. వారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసేవారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. వారికి మాత్రమే అర్హత వస్తుంది. అంతేకాకుండా కొంత డబ్బుగలవారు తాము ఆయా పాఠశాలల్లో బోధన చేశామని దొంగ సర్టిఫికెట్లు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన మిగితా వారంతా నష్టపోవాల్సిందేనా? దీని ప్రకారం 2013, 2014, 2015, 2016లో పీజీలు అయిపోయిన వారు పీజీటీ ఉద్యోగాలకు అనర్హులా? ’ అంటూ వారంతా నిలదీస్తున్నారు. ఆన్లైన్ తలనొప్పి ‘ఇప్పటివరకు ఏ టీచర్ ఉద్యోగాన్ని కూడా ఆన్లైన్లో నిర్వహించలేదు. అలాంటిది తొలిసారి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు పరిచయం లేకుండానే అందరికీ ఆన్లైన్లో పరీక్ష రాయడం ఎలా వస్తుంది? దీనిని టీఎస్పీఎస్సీ సభ్యులు ఏమేరకు సమర్థిస్తారు’ అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. బాలికల పాఠశాలల్లో అమ్మాయిలకే ’గురుకులాల్లో మొత్తం టీజీటీ పోస్టులు 4362. ఇందులో అమ్మాయిలకు 3238. మిగిలిన 1124 పోస్టుల్లో అదనంగా 33శాతం రిజర్వేషన్. దీంతో టీజీటీలో పురుష అభ్యర్థులకు మిగిలేది దాదాపు 753 పోస్టులు. అలాగే, పీజీటీలో చూస్తే మొత్తం 921 పోస్టులు అందులో అమ్మాయిలకు 732. మిగిలినవి 189 పోస్టులు. ఇందులో కూడా వారికి 33శాతం రిజర్వేషన్ పేరిట 62 పోస్టులు మళ్లీ అమ్మాయిలకు తీస్తే అబ్బాయిలకు మిగిలేది 127 పోస్టులు. అసలు అమ్మాయిల గురుకులాల్లో అమ్మాయిలే చెప్పాలి.. అబ్బాయిలు చెప్పకూడదు అనేది వివక్షను టీఎస్పీఎస్సీ స్వయంగా తెరపైకి తెచ్చినట్లు ఎందుకు భావించకూడదు?’ అని పురుష అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ‘బీకాం, టీచర్ ట్రైనింగ్ చేసి, టెట్ అర్హత సాధించిన వారి పరిస్థితి ఏంటి? ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన వారికి టోటల్ మార్కులకు కలిపి ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్‌గా పరిగణిస్తున్నారు. అదే రెగ్యులర్‌గా డిగ్రీ చేసిన వారికి ఆప్షనల్స్ ప్రాతిపదికన తీసుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ గా పరిగణిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించక ఓపెన్ వర్సిటీల్లో చదువుకున్న వారికి ఈ నిర్ణయం ఆశని పాతమే కదా? అంతేకాకుండా అదేదో కక్ష సాధింపుచర్యలాగా కనీసం నోటిఫికేషన్‌కు పరీక్ష సమయానికి కనీసం 45 రోజులు గడువు ఇవ్వాల్సింది పోయి కేవలం 39 రోజులు మాత్రమే ఇచ్చారు. అలాగే, మెయిన్స్ పరీక్షకు ప్రిలిమ్స్ మధ్య కూడా 39 రోజుల నిడివి మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా చేయగలరు? ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ చేసిన పొరపాట్లు నిర్లక్ష్యాలు కోకొల్లలు. ఒక ఉద్యోగ నోటిఫికేషన్‌పై ఇన్ని అనుమానాలు, ఇంత స్థాయి వివాదాలు బహుశా కేంద్రం నిర్వహించే సివిల్ సర్వీస పరీక్షకు కూడా రాలేదంటే ఆశ్చర్యం కాదేమో’ అంటూ ఇలా ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతివాహన, పాలమూరు, తెలంగాణ తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన నిరుద్యోగ విద్యార్థిలోకం, పట్టణ ప్రాంత, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ, విద్యార్థిలోకం చేస్తున్న ప్రధాన డిమాండ్లు తెలుగు ఆంగ్లమాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి పీజీటీకి పెట్టిన మూడేళ్ల బోధనానుభవం నిబంధన తొలగించాలి 60%శాతంగా ఉన్న డిగ్రీ అర్హత ను మార్చాలి పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలి పురుష అభ్యర్థులకు కూడా వివక్ష లేకుండా అమ్మాయిలతోపాటు సమాన అవకాశాలు కల్పించాలి ప్రిపరేషన్ కు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం ఇవ్వాలి టెట్ ను అర్హత గా భావించి ప్రిలిమ్స్ ను రద్దుచేయాలి. -
గురుకుల పోస్టుల్లో వాళ్లకూ చాన్సివ్వాలి!!
హైదరాబాద్: ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ కోసం తాజాగా విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయుల నోటిఫికేషన్లో అనేక ఆంక్షలు ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పోస్టుల అర్హత విషయంలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పలు ఆంక్షలు, నిబంధనలు పెట్టడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. గురుకుల పోస్టుల నోటిఫికేషన్లో విధించిన నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన నిర్వహించారు. డిగ్రీలో బికాం చేసిన వాళ్లకూ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అభ్యర్థుల అర్హతకు సంబంధించి విధించిన పలు నిబంధనలను తొలగించాలని వారు కోరుతున్నారు.