వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల
వైరా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ కేజీ టూ పీజీ’ మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో 2019–020 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ఆంగ్ల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగుతుంది.
ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 2017 జూన్‌లో ప్రారంభించబడిన 26 బీసీ, ఎస్సీ, ఎస్టీ టీఎస్ గురుకుల పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవే పాఠశాలలు..
- సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు..
అడవి మల్లేల, కల్లూరు, వైరా, నేలకొండపల్లి, టేకులపల్లి, దానవాయిగూడెం, ఎర్రుపాలెం
- సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలు.
కూసుమంచి, తిరుమాలయపాలెం, మధిర, ముదిగొండ, సత్తుపల్లి,
- బీసీ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలు
ఎర్రుపాలెం, చెరువుమాదారం, దానవాయిగూడెం, ముసలిమడుగు, లంకపల్లి, వైరా
- బీసీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు.
బోనకల్, కుంచపర్తి,
- గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
తిరుమాలయాపాలెం, కారేపల్లి,(బాలురు), వైరా (బాలికలు).
మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలు..
ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి (బాలుర), రఘునాధపాలెం, వైరా, ఖమ్మం (బాలికలు)
టీఎస్‌ఆర్‌ఎస్‌లో...
వైరా (బాలికలు), ఏన్కూరు (బాలురు)
ప్రవేశానికి అర్హతలు..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు.
- 01.09.2019 నాటికి 9 నుంచి 11 ఏళ్ల వయ స్సు కలిగిన పిల్లలు అర్హులు కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించరాదు. ఇవన్నీ ఉంటే గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు.
రిజర్వేషన్లు...
- సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 75 శాతం, బీసీ (సీ)లకు 2 శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 12శాతం, ఇతరులకు 2 శాతం, మైనార్టిలకు 3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలు 12 శాతం, ఎస్టీలకు 80 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 3 శాతం ఉంటాయి.
- బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15శాతం, బీసీ–సీలకు 3 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకుక 71శాతం (బీసీ–ఏ 20 శాతం, బీసీ–బీ 28శాతం, బీసీ–డీ 19 శాతం, బీసీ–ఈ 4శాతం) సైనిక ఉద్యోగుల పిల్లలకు 3 శాతం ఉంటాయి.
- ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 73 శాతం, అనాథలకు 3 శాతం, వికలాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయించారు.
దరఖాస్తు విధానం..
- దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఈఎస్‌ఐడీఈ ఎన్‌టీఐఏఎల్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ల కోసం విద్యార్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
- ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, వేరేవారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేసినా సెక్షన్ 416 ఐపీసీ (1860) ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
- ఇతర సమాచారం కోసం ఉచిత హెల్ప్‌లైన్ నం బర్ 1800 425 45678లో సంప్రదించవచ్చు.
మైనార్టీ గురుకులాలకు ప్రత్యేక నోటిఫికేషన్..
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ గురకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్ల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో కోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31, ప్రవేశపరీక్ష ఏప్రిల్ 24వ తేదీన నిర్వహిస్తారు.
రాత పరీక్ష...
ఏప్రిల్ 07,2019న ఉదయం 11 నుంచి 1 గంట వరకు నిర్వహించే ప్రవే శపరీక్ష జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లో తెలుగు, ఉర్దూ, ఆంగ్లమాధ్యమాల్లో ఉంటుంది.
4వ తరగతి సామార్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, ఉర్ధూ, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల విషాయాలపై 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఐచ్చిక తరహ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
- ఏప్రిల్ 2 నుంచి 7 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఏప్రిల్ 7 ఆదివారం ఉదయం 11 నుంచి 1 గంట వరకు 5వ తరగతి ప్రవేశపరీక్ష
- మే నెలలో ఫలితాలు వెల్లడి
- మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేసి, అనంతరం ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు.
- జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment