gurukula exams
-
గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు జీఓ 317 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు సొసైటీలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగి వారీగా కేటాయింపులు విడుదల చేసే క్రమంలో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉద్యోగులను మినహాయిస్తూ మిగతా ఉద్యోగులకు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్, మలీ్టజోన్ కేటగిరీలను కేటాయి స్తూ గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో గురువారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. ఈమేరకు సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో కూడా ఈ కసరత్తు దాదాపు కొలిక్కి వచి్చనట్లు సమాచారం.ఒకట్రెండు రోజుల్లో ఈ సొసైటీలో కూడా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో ఏడాది క్రితమే ఉద్యోగ కేటాయింపులు జరిగాయి. తాజాగా ఉద్యోగుల వారీగా కేటాయింపు ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో మాత్రం ఈ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. స్పౌజ్ కేటగిరీ ఉద్యోగులకు న్యాయం చేయాలి: టిగారియా గురుకుల విద్యా సంస్థల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జీఓ 317 అమలు ప్రక్రియ పరిష్కారం కావడం శుభసూచకమని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టిగారియా) అధ్యక్ష, కార్యదర్శులు మామిడి నారాయణ, మధుసూధన్ గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి స్పౌజ్‌గా ఉన్న కేటగిరీని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూల పరిధిలో ఉద్యోగి స్పౌజ్‌గా ఉన్న వారికి కూడా న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా పీహెచ్ కేటగిరి, సింగిల్ ఉమెన్, డివోర్స్, అన్ మ్యారీడ్, మెడికల్ కేటగిరీలను కూడా పరిగణించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈమేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. -
గురుకుల పరీక్షల తుది ‘కీ’లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షల తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఖరారు చేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన నిపుణుల కమిటీ వాటికి సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీకి సిఫార్సులు చేసింది. వీటిని పరిశీలించిన అధికారులు వాటి ఆధారంగా తుది కీలను ఖరారు చేశారు. వీటిని టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలు తాజాగా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన తుది కీలలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. రోస్టర్ పాయింట్ల మార్పులు... ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ చార్ట్ కీలకంగా పనిచేస్తుంది. ఈ చార్ట్‌లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్ జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్ సర్వీస్‌మెన్) రోస్టర్ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
వైరా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ కేజీ టూ పీజీ’ మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో 2019–020 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ఆంగ్ల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 2017 జూన్‌లో ప్రారంభించబడిన 26 బీసీ, ఎస్సీ, ఎస్టీ టీఎస్ గురుకుల పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే పాఠశాలలు.. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలు.. అడవి మల్లేల, కల్లూరు, వైరా, నేలకొండపల్లి, టేకులపల్లి, దానవాయిగూడెం, ఎర్రుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలు. కూసుమంచి, తిరుమాలయపాలెం, మధిర, ముదిగొండ, సత్తుపల్లి, బీసీ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలు ఎర్రుపాలెం, చెరువుమాదారం, దానవాయిగూడెం, ముసలిమడుగు, లంకపల్లి, వైరా బీసీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు. బోనకల్, కుంచపర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుమాలయాపాలెం, కారేపల్లి,(బాలురు), వైరా (బాలికలు). మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలు.. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి (బాలుర), రఘునాధపాలెం, వైరా, ఖమ్మం (బాలికలు) టీఎస్‌ఆర్‌ఎస్‌లో... వైరా (బాలికలు), ఏన్కూరు (బాలురు) ప్రవేశానికి అర్హతలు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు. 01.09.2019 నాటికి 9 నుంచి 11 ఏళ్ల వయ స్సు కలిగిన పిల్లలు అర్హులు కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించరాదు. ఇవన్నీ ఉంటే గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు. రిజర్వేషన్లు... సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 75 శాతం, బీసీ (సీ)లకు 2 శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీలకు 12శాతం, ఇతరులకు 2 శాతం, మైనార్టిలకు 3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలు 12 శాతం, ఎస్టీలకు 80 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 3 శాతం ఉంటాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15శాతం, బీసీ–సీలకు 3 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకుక 71శాతం (బీసీ–ఏ 20 శాతం, బీసీ–బీ 28శాతం, బీసీ–డీ 19 శాతం, బీసీ–ఈ 4శాతం) సైనిక ఉద్యోగుల పిల్లలకు 3 శాతం ఉంటాయి. ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 73 శాతం, అనాథలకు 3 శాతం, వికలాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. దరఖాస్తు విధానం.. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. టీఆర్ఈఎస్ఐడీఈ ఎన్టీఐఏఎల్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ల కోసం విద్యార్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, వేరేవారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేసినా సెక్షన్ 416 ఐపీసీ (1860) ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఇతర సమాచారం కోసం ఉచిత హెల్ప్‌లైన్ నం బర్ 1800 425 45678లో సంప్రదించవచ్చు. మైనార్టీ గురుకులాలకు ప్రత్యేక నోటిఫికేషన్.. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ గురకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్ల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో కోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31, ప్రవేశపరీక్ష ఏప్రిల్ 24వ తేదీన నిర్వహిస్తారు. రాత పరీక్ష... ఏప్రిల్ 07,2019న ఉదయం 11 నుంచి 1 గంట వరకు నిర్వహించే ప్రవే శపరీక్ష జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లో తెలుగు, ఉర్దూ, ఆంగ్లమాధ్యమాల్లో ఉంటుంది. 4వ తరగతి సామార్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, ఉర్ధూ, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల విషాయాలపై 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఐచ్చిక తరహ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ముఖ్యమైన తేదీలు... ఏప్రిల్ 2 నుంచి 7 వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7 ఆదివారం ఉదయం 11 నుంచి 1 గంట వరకు 5వ తరగతి ప్రవేశపరీక్ష మే నెలలో ఫలితాలు వెల్లడి మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేసి, అనంతరం ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం. -
నిరుద్యోగులకు ‘పరీక్ష’!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఏళ్లుగా చేస్తున్న తపస్సుకు ఆటంకం ఎదురవుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు నిర్వహిస్తున్న అర్హత పరీక్షలన్నీ ఒకేసారి వచ్చిపడటంతో ఆశావహుల్లో అయోమయం తలెత్తుతోంది. వేరువేరు సమయాల్లో నోటిఫికేషన్లు రావడం.. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో వెలువడిన నోటిఫికేషన్లన్నింటికీ దరఖాస్తు చేసిన నిరుద్యోగి.. ఇప్పుడు ఒకేసారి పరీక్షలకు తలపడాల్సి వస్తోంది. ఉద్యోగ ఖాళీల అర్హత పరీక్షలు కొన్ని వరుసగా రాగా.. మరికొన్ని ఒకే రోజు జరగనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ ఏ పరీక్షకు సన్నద్ధం కావాలి, ఎలా సిద్ధమవ్వాలి, అసలు పరీక్ష ఎలా రాయాలనే ప్రశ్న గందరగోళానికి గురిచేస్తోంది. నెల రోజులు ‘కేంద్రం’పరీక్షలు రాష్ట్రంలో 2 నెలల పాటు వరుసగా ఉద్యోగ అర్హత పరీక్షలు జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ పరీక్షలు కాస్త వెనువెంటనే ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు)లో గ్రూప్ ‘డీ’కేటగిరీలో 62,907 ఖాళీలకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1.45 కోట్ల మంది దరఖాస్తు చేశారు. దీంతో రోజుకు సగటున 45 వేల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాబ ట్టి దాదాపు 45 రోజుల పాటు పరీక్షలు జరగనున్నా యి. ఇదే సమయంలో ఐబీపీఎస్ (బ్యాంకిం గ్) పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 29, వచ్చే నెల 7వ తేదీన ఐబీపీఎస్ పీవో పరీక్షలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైంది. దీనికి తోడు యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) పరీక్షలు కూడా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు వేర్వేరు తేదీల్లో ఉన్నాయి. ఉరుకులు.. పరుగులే.. ఇలా నెల రోజులు వరుసగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ని ఖాళీల భర్తీ పరీక్షలుండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలూ ఇవే తేదీల్లో ఉండటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల ఖాళీలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు పీజీటీ, టీజీటీ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 30న కానిస్టేబుల్ పరీక్ష, వచ్చే నెల 7న గ్రూప్–4తో పాటు ఏఏఓ, ఎఎస్‌ఓ, డీపీఏ, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ పరీక్షలున్నాయి. కాబట్టి గురుకుల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ పరీక్షలు రాయాలంటే ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. దీంతో పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గురుకుల పరీక్ష తేదీల్లో మార్పులు? గురుకుల పరీక్షల తేదీలు మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తేదీల మార్పు కోసం శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నియామకాల బోర్డు కార్యాలయం ఎదుట పలువురు అభ్యర్థు లు ధర్నా నిర్వహించారు. అనంతరం బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి కూడా వినతులు పెరుగుతుండటంతో సీఎస్ ఎస్కే జోషి స్పందించారు. పరీక్షల తేదీలను పునః సమీక్షించుకోవాలని, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని బోర్డుకు సూచించారు. దీంతో శనివారం సాయంత్రం గురుకుల బోర్డు సభ్యులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. పరీక్షల తేదీల్లో మార్పులపై త్వరలో స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
డైలమాలో భాష పండిత అభ్యర్థులు
హైదరాబాద్: గురుకుల టీచర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్ పరీక్షలకు రివైజ్డ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపిన నేపథ్యంలో భాషా పండితులు పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఆలోచనల్లో పడ్డారు. తమ పరీక్షలో కూడా టీఎస్పీఎస్సీ మార్పు చేయనుందా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలోని బాలికల గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేసేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే, నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ప్రకటించాలని చెప్పింది. దీంతో పరీక్షల రీషెడ్యూల్ రానుంది. అయితే, తొలుత కోర్టు విధించినప్పుడు ఆగస్టు 3వరకు నిర్వహించనున్న పరీక్షలు మాత్రమే వాయిదా అని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పీజీటీ భాషా పండితుల పరీక్షలు మాత్రం ఆగస్టు 27న, టీజీటీ భాషా పండితుల పరీక్షలు సెప్టెంబర్ 3న జరగాల్సి ఉన్నాయి. కోర్టు స్టే ప్రకారం ప్రకటించిన వాయిదా ప్రకటనలో భాషా పండితుల పరీక్షల షెడ్యూల్ లేదు. అయినప్పటికీ, తమ పరీక్షలు కూడా ఇక వాయిదా అయినట్లేనని నిరాశలోకి కూరుకుపోయిన అభ్యర్థులు కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉండిపోయారు. తాజాగా స్టే ఎత్తివేయడం పరీక్షలకు రీషెడ్యూల్ త్వరలో వస్తుందని చెప్పడంతో తమ పరీక్షకు కూడా రీ షెడ్యూల్ వస్తే బాగుండని అభ్యర్థులు అనుకుంటున్నారు. గతంలో ప్రకటించిన ప్రకారమే ఆగస్టు 27, సెప్టెంబర్ 3నే భాషా పండితుల పరీక్ష నిర్వహిస్తే ఇప్పటి వరకు కోర్టు కేసుల కారణంగా నిరాశలోకి వెళ్లిన అభ్యర్థులు ఇప్పుడు మరింత ఒత్తిడితో తమ ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే.