ఉపాధికి మార్గం.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్స్‌ | Free Coaching For unemployeed Youth | Sakshi
Sakshi News home page

ఉపాధికి మార్గం.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్స్‌

Published Fri, Mar 16 2018 10:42 AM | Last Updated on Fri, Mar 16 2018 10:42 AM

Free Coaching For unemployeed Youth - Sakshi

నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను చైతన్యం చేసి వారికి తగిన శిక్షణ అందించి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకునే లక్ష్యంతో ఆంధ్రాబ్యాంక్‌ ‘రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్‌ ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ తరగతులను ఏలూరులో నిర్వహిస్తున్నట్టు జయప్రకాష్‌ నారాయణ ఆంధ్రాబ్యాంక్‌ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంచాలకులు జె. షణ్ముఖరావు తెలి పారు. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్‌లు స్వీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ ఆ సంస్థలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులపై 1,650 మంది శిక్షణ పొందగా, 1,520 మంది వరకూ స్థిరపడినట్టు తెలిపారు. ఇదే  కోర్సుపై 2018–19 సంత్సరానికి మరో కొత్త బ్యాచ్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కొత్త బ్యాచ్‌ వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ కోర్సు శిక్షణకు సంబం ధించిన వివరాలు తెలుసుకుందాం.

అభ్యర్థుల అర్హతలు ఇలా..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు మాత్రమే
వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
విద్యార్హత : 5వ తరగతి ఆపై

శిక్షణ కాలంలో సదుపాయాలు
శిక్షణకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దూరప్రాంతాల నుంచి శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు  వసతి, భోజన సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేస్తారు.
హాస్టల్‌ అభ్యర్థులకు వారి గ్రామాల నుంచి ఒకసారి సంస్థకు రానుపోను ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
స్థానిక అభ్యర్థులకు కూడా మ««ధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పిస్తారు.
శిక్షణ కాలమందు అవసరమగు సేవలు, మెటీరియల్‌ సంస్థచే ఉచితంగా అందిస్తారు.  
ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై సాఫ్ట్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పైనా శిక్షణ ఉంటుంది.
ప్రత్యేకతలు ఇలా.. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ
30 రోజుల్లోనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో నైపుణ్యంపై మెరుగైన శిక్షణ ఇస్తారు.

పేర్లు నమోదు ఇలా..
ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు ఫోన్‌ ద్వారా/ఎస్‌ఎంఎస్‌/పోస్ట్‌ కార్డు ద్వారా పేర్లు, చిరునామాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
గతంలో పేర్లు నమోదు చేసుకున్నవారు, కొత్తగా అడ్మిషన్‌కు అర్హత సాధించినవారు వారి ఆధార్, రేషన్‌ కార్డు, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలు, 3 ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది.

శిక్షణ సంస్థ చిరునామా : జయప్రకాష్‌ నారాయణ్‌ ఆంధ్రాబ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, వెలుగు ఆఫీస్‌ ప్రాంగణం/ఐటీఐ కాలేజీ దగ్గర, సత్రంపాడు, ఏలూరు–534 007. ఫోన్‌ నంబర్స్‌: 08812–253 975. సెల్‌ నెంబర్‌: 98660 94383/94909 98882

ఫ్యాషన్‌ డిజైనింగ్‌కు మార్కెట్‌లో డిమాండ్‌
ఈ శిక్షణ సంస్థను 2005లో ఏర్పాటు చేశాం. నేటివరకూ 371 బ్యాచ్‌లు 20 రకాల కోర్సుల్లో 12,200 మంది  అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాం. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుకు  మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులో ఎక్కువమంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా సంస్థలో శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత యూనిట్‌ స్థాపించేందుకు బ్యాంకు రుణం పొందుటలో అవసరమగు సలహాలు, సహాయ సహకారం బ్యాంక్‌ సిబ్బంది అందిస్తారు. – జె. షణ్ముఖరావు, సంచాలకులు, ఏబీఆర్‌ఎస్‌ఈటీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement