జ్వరాలు విజృంభిస్తున్నాయి. నిండుప్రాణాలను బలిగొంటున్నాయి. ఇంద్రవెల్లి మండలంలో ఓ యువకుడు జ్వరంతో మృత్యువాత పడగా.. కౌటాల మండలంలో మరో యువకుడు డెంగీ లక్షణాలతో ప్రాణాలు విడిచాడు. పల్లెల్లో పారిశుధ్యం లోపించడంతో ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
జ్వరాలు విజృంభిస్తున్నాయి. నిండుప్రాణాలను బలిగొంటున్నాయి. ఇంద్రవెల్లి మండలంలో ఓ యువకుడు జ్వరంతో మృత్యువాత పడగా.. కౌటాల మండలంలో మరో యువకుడు డెంగీ లక్షణాలతో ప్రాణాలు విడిచాడు. పల్లెల్లో పారిశుధ్యం లోపించడంతో ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో ఊళ్లో పదుల సంఖ్యలో గ్రామీణులు జ్వరాల బారిన పడడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు పారిశుధ్య నిర్వహణ, వైద్య చర్యలు ఏమీ చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధన్నోర(బి)లో యువకుడు మృతి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ :
మండలంలోని ధన్నోర(బి) పంచాయతీ పరిధి ఇ న్కార్‌గూడ(దేవాపూర్) గ్రామానికి చెందిన గేడం రమాకాం త్(19)జ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెం దాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గేడం మనోహర్-నిర్మల దంపతుల పెద్ద కొడుకు రమాకాంత్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో మండలకేంద్రం ఇంద్రవెల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషయంగా ఉండడంతో అక్కడి వైద్యులు చికిత్స చేయలేదు. వెంటనే ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేరుుంచారు. అరుునా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రమాకాంత్‌కు ఫిట్స్ కూడా రావడంతో స్పృహ తప్పి పడిపోయూడు. ఆస్పత్రికి తరలిద్దామనుకునే లోపు ఇంట్లోనే మృతిచెందాడు. ఎదిగిన కొడుకు జ్వరంతో మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు కంటతడి పెట్టించాయి. ఇన్కార్‌గూడలో విషాదఛాయలు అములుకున్నాయి.
బాబాసాగర్‌లో డెంగీ లక్షణాలతో?
కౌటాల, న్యూస్‌లైన్ : మండలంలోని బాబాసాగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రౌతు చందు(28) తీవ్ర జ్వరం తో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మూడు రోజుల క్రితం జ్వ రంతో బాధపడుతూ కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. డెంగీ లక్షణాలతో ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతోనే పరిస్థితి విషమించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సునిత, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు.
కౌటాల మండలంలో విజృంభిస్తున్న జ్వరాలు
జ్వరాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని రవీంద్రనగర్, బాలాజీ అనుకోడ, ముత్తంపేట, శీర్ష, బోధన్‌పల్లి, బాబాసాగర్, లంబాడిహేటి, బాబాపూర్, బూరెపెల్లి గంగాపూర్ గ్రామాల్లో జ్వరాలతో అల్లాడుతున్నారు. గుడ్లబోరికి చెందిన మౌల్‌కార్ వినోద్ అనే విద్యార్థి వారం రోజుల క్రితం రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గడంతో మృతిచెందాడు. రవీంద్రనగర్ గ్రామానికి చెందిన ప్రణవ్‌రాయ్ అనే వ్యక్తి చంద్రాపూర్ లో, ఉజ్వల్ మండల్ కరీంనగర్‌లో డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. మండలంలో తీవ్ర జ్వరాలకు దోమలే కారణంగా మండలవాసులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో అధికారులు క్లోరినేషన్‌కు చర్యలు తీసుకోకపోవడమే దోమల విజృంభణకు కారణమని చెప్తున్నారు. గ్రామాల్లో దోమల నివారణకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, జ్వరాలు తగ్గడానికి వైద్యాధికారులు శిబిరాలు ఏర్పాటు చేయూలని ప్రజలు కోరుతున్నారు.