ప్రతిఒక్కరూ డీఈసీ మాత్రలు మింగాలి | Must swallow DEC tablets | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ డీఈసీ మాత్రలు మింగాలి

Published Thu, Sep 15 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ప్రతిఒక్కరూ డీఈసీ మాత్రలు మింగాలి

ప్రతిఒక్కరూ డీఈసీ మాత్రలు మింగాలి

 సూర్యాపేట : పట్టణంలోని 27,  28, 29, 30, 31వ వార్డుల్లో డీఈసీ మాత్రలు ప్రజలు వేసుకున్నారా లేదా అని కేంద్ర ప్రభుత్వ పైలేరియా ప్రతినిధి ఎం.లక్ష్మణ్‌ గురువారం అడిగి తెలుసుకున్నారు. కార్యాక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ఓం ప్రకాష్‌ మాట్లాడుతూ ఎవరైనా డీఈసీ మాత్రలను మింగని వారు ఉంటే వారు తప్పకుండా మాత్రలు మింగాలని కోరారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం రోజు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆయన వెంట సీనియర్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌ శ్రీనాథ్, సబ్‌ యూనిట్‌అధికారి సముద్రాల సూరి, కస్తూరి నర్సింహ, స్వరూప, పుష్ప, స్రవంతి, సరిత, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement