DEC
-
ప్రభుత్వానికి బోధ పడదేం
తణుకు అర్బన్ : బోధ వ్యాధి నివారణకు వ్యాధిగ్రస్తులు వాడే డీఈసీ (డై ఇథైల్ కార్బామాజైన్ నైట్రేట్) మందులు జిల్లాలోని నివారణ కేంద్రాల్లో నిండుకున్నాయి. క్యూలెక్స్ దోమకాటు ద్వారా వ్యాపించే ఫైలేరియా వ్యాధితో జిల్లా వ్యాప్తంగా వేలసంఖ్యలో వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు. వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు, వైద్యసేవలు అందించే క్రమంలో జిల్లాలో తణుకు ఏరియా ఆస్పత్రి ఆవరణలోనూ, పాలకొల్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మాత్రమే రెండు ఫైలేరియా నివారణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా బోధవ్యాధి లక్షణాలు కనిపించిన వారు ఈ కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలు, వైద్యసేవలు పొందాల్సి ఉంది. కానీ ఫైలేరియా కేంద్రాల్లో డీఈసీ మాత్రలు జనవరి నెలతో ఎక్స్పైర్ అవ్వగా కొత్త స్టాక్ ఇంతవరకు పంపిణీ కాలేదు. ఫైలేరియా వ్యాధి లక్షణాలు జ్వరం, గజ్జలో బిళ్ల కట్టడం, చేతులు, కాళ్లు వాపు, వాచినచోట వేడిగా ఉండి ఎరుపు రంగులో ఉండడం ఫైలేరియా వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. వివాదాస్పదంగాడీఈసీ మాత్రల వాడకం జిల్లావ్యాప్తంగా బోధవ్యాధిగ్రస్తులు నీరసంగా ఉండి కాలు లాగుతుందంటే డీఈసీ మాత్రలు మింగుతున్నారు. కానీ ఈ డీఈసీ మందులు ఎక్కువగా వాడకూడదని దీనివల్ల సైడ్ ఎఫెక్టŠస్ అధికంగా ఉంటాయని ప్రస్తుత ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ గతం నుంచి నెలలో 12 రోజులు రోజుకు మూడు మాత్రలు చొప్పున వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్నారు. మళ్లీ ఒక నెల ఆగిన తరువాత ఈ కోర్సు వాడుతున్నారు. ప్రస్తుతం చాలా ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం అలా వాడకూడదని వైద్యాధికారులు చెబుతుండడంతో రోగులు అయోమయంలో పడుతున్నారు. ముందుగా లక్షణాలు చూసిన వెంటనే ఈ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుని 12 రోజుల పాటు డీఈసీ మాత్రల కోర్సు వాడి ఆపివేయాలని చెబుతున్నారు. జిల్లాలో గతేడాది 4 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా కేసు నమోదైతే వాడేందుకు మందులులేని దుస్థితి జిల్లాలో నెలకొంది. 3 లక్షల మందులు ఇండెంట్ పెట్టామని రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో పాఠశాలల్లో పంపిణీ క్యూలెక్స్ దోమకుట్టిన తరువాత వ్యాధి బయటపడేందుకు 5 సంవత్సరాలు సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గతంలో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు ప్రజానీకానికి డీఈసీ మందులు మూడు మాత్రల చొప్పున మింగించేవారు. దీనివల్ల ఒకవేళ దోమ కుట్టినా కానీ వ్యాధి బయటపడక ముందే లోపలే వ్యాధి నిరోధించబడుతుందనేది వైద్యాధికారులు అభిప్రాయం. ఫైలేరియాని గుర్తించేదిలా.. ఫైలేరియా వ్యాధి నిర్ధారణకు ప్రతి బుధవారం కేంద్రంలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తున్నారు. మైక్రో ఫైలేరియా క్రిమి చీకటి సమయంలో యాక్టివ్‌గా ఉంటుందనే ఉద్ధేశంతో సదరు వ్యక్తిని కదలకుండా పడుకోబెట్టి ఉంచి రక్తనమూనా తీసి పరీక్ష చేస్తారు. ఇలా చేస్తే మాత్రమే వ్యాధి నిర్ధారణ అవుతుంది. కానీ ఈ కేంద్రాల్లో పూర్తి అవగాహన లేకుండా రక్తనమూనాలు సేకరిస్తుండడంతో చాలామందికి వ్యాధి ముదిరిపోయే వరకు పాజిటివ్‌గా గుర్తించడంలేదనే విమర్శలు లేకపోలేదు. 3 లక్షల మాత్రలకు ఇండెంట్ పెట్టాం బోధవ్యాధి నివారణ కేంద్రాల్లో ఉన్న డీఈసీ మాత్రలు జనవరి నెలతో ఎక్స్పైర్ అయ్యాయి. 3 లక్షల మాత్రలు కావాలని ఇండెంట్ పెట్టాం. మందులు రావాల్సి ఉంది. కొత్త కేసు నమోదైతేనే మందులు వాడాల్సి ఉంది. వ్యాధి సోకి ఒకసారి మందుల కోర్సు వాడిన వారు ఇక మళ్లీ వాడాల్సిన అవసరం లేదు. – ఎంవీ రాథోడ్, జిల్లా మలేరియా ఆఫీసర్, ఏలూరు -
ప్రతిఒక్కరూ డీఈసీ మాత్రలు మింగాలి
సూర్యాపేట : పట్టణంలోని 27, 28, 29, 30, 31వ వార్డుల్లో డీఈసీ మాత్రలు ప్రజలు వేసుకున్నారా లేదా అని కేంద్ర ప్రభుత్వ పైలేరియా ప్రతినిధి ఎం.లక్ష్మణ్ గురువారం అడిగి తెలుసుకున్నారు. కార్యాక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ఓం ప్రకాష్ మాట్లాడుతూ ఎవరైనా డీఈసీ మాత్రలను మింగని వారు ఉంటే వారు తప్పకుండా మాత్రలు మింగాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం రోజు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆయన వెంట సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనాథ్, సబ్ యూనిట్‌అధికారి సముద్రాల సూరి, కస్తూరి నర్సింహ, స్వరూప, పుష్ప, స్రవంతి, సరిత, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. -
పైలేరియా నివారణ మాత్రల పంపిణీ
రేపాల : మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం పైలేరియా వ్యాధి నివారణ (డీఈసీ)మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారి పోరెడ్డి వెంకటపాపిరెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా రేపాల పీహెచ్సీ పరిధిలో గల పలు గ్రామాలలో గల పాఠశాలలు, దళిత కాలనీలు, వసతి గహాల్లో ఈ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్య సిబ్బంది లక్ష్మినారాయణ, కళావతి, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
డీఈసీ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్ : ఈనెల 30న నిర్వహించనున్న సామూహిక డీఈసీ, ఆల్బెండోజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని సీఐఓ డాక్టర్ ఏబీ. నరేంద్ర, జిల్లా మలేరియాధికారి ఓంప్రకాశ్ కోరారు. శనివారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన క్లస్టర్ సమావేశంలో వారు మాట్లాడారు. పైలేరియా వ్యాధి నివారణ, నట్టల నివారణ కోసం మాత్రలను మింగించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రెండేళ్ల లోపు చిన్నారులకు మాత్రలు అవసరం లేదని, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలల్లోపు వయస్సు వారికి 1 డీఈసీ, ఒక ఆల్బెండోజోల్ మాత్రలను మింగించాలన్నారు. 5–14 సంవత్సవరాల్లోపు వారికి 2 డీఈసీ, ఒక ఆల్బెండోజోల్, 15 సంవత్సరాల పై వయసు వారికి వారందరికి 3డీఈసీ, ఒక ఆల్బెండోజోల్ మాత్రలను మింగించాలని సూచించారు. గర్భవతులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు మాత్రలు వేసుకోరాదని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కోడ్’ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదై పెండింగ్‌లో ఉన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలని ఢిల్లీ ఎన్నికల కమిషన్ (డీఈసీ) అంటోంది. దీని గురించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కలవాలనుకుంటోంది. గత అసెంబ్లీ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన కేసులను పరిశీలిస్తున్నామని, ఈ వివరాలతో ప్రత్యేక డాటాను రూపొందిస్తున్నామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఒకవేళ కేసుల భారం పెరిగి సాధారణ కోర్టుల ద్వారా నియంత్రించలేకపోతే, ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలనే అంశాన్ని న్యాయమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళతామని వివరించారు. ప్రాథమ్యత ఆధారంగా కేసులను పరిష్కరించేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలని అభ్యర్థిస్తామన్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 2013, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా ఆమ్ ఆద్మీ పార్టీపై వందకి పైగా కేసులు, బీజేపీపై 80 కేసులు, కాంగ్రెస్‌పై 75 కేసులు నమోదయ్యాయన్నారు. ఏప్రిల్ పదిన ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిశాక కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశాన్ని న్యాయమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళతామని వివరించారు. ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులతో రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
91 శాతం మందికి డీఈసీ మాత్రలు పంపిణీ
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ :జిల్లాలో పైలేరియా నివారణ కార్య క్రమంలో భాగంగా 91.39 శాతం మందికి మంగళవారం డీఈసీ మాత్రలను పంపిణీ చేసినట్టు జిల్లా ఆరోగ్య విస్తరణ, మీడియా అధికారి చదలవాడ నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం నరసాపురం వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లాలో 39 లక్షల 56వేల 859 జనాభాలో రెండేళ్ల లోపు పిల్లలు, గర్భిణలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించగా, 35 లక్ష 21వేల 605 మంది డీఈసీ మాత్రలు వేసుకునేందుకు అనుకూలురని గుర్తించామన్నారు. వారిలో 32 లక్షల 18వేల 616 మందికి మాత్రలు పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో 15వేల 831 మంది వలంటీర్లు ఇంటింటికీ తిరిగి మాత్రలు పంపిణీ చేశారన్నారు. వలంటీర్లలో అంగనవాడీ, ఆశ వర్కర్లతోబాటు కళాశాలల విద్యార్థినులు ఉన్నారని చెప్పారు. డీఈసీ మాత్రలను వరుసగా అయిదారేళ్ళు తీసుకుంటే పైలేరియా దరిచేరదన్నారు. డీఈసీ మాత్రలను తీసుకున్న తర్వాత కళ్లు తిరగడం, జ్వరం వంటి లక్షణాలు కనబడితే పైలేరియా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని సూచించారు. కాళ్లు, శోష గ్రంధులు, నాళాల వాపు, వరిబీజం మొదలైన వాటిని వ్యాధి లక్షణాలుగా పరిగణించవచ్చన్నారు. తొలిదశలో ఇటువంటి లక్షణాలు బయటపడటం ద్వారా బోధ వ్యాధిని గుర్తించగలమని వివరించారు. పైలేరియా రోగకారక మైక్రోబ్యాక్టీరియా ఆరు నుంచి ఎనిమిదేళ్ల వరకు బయటపడదని వివరించారు. కనుక డీఈసీ మాత్రలను కనీసం అయిదేళ్లపాటు వరుసగా తీసుకోవాలని స్పష్టం చేశారు.