ప్రతీకాత్మక చిత్రం
విజయనగరం ఫోర్ట్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నరసమ్మ. ఈమెది నెల్లిమర్ల మండలం ఆత్మరాముని ఆగ్రహారం. నీరసంగా ఉందని కేంద్రాస్పత్రికి వచ్చింది. ఈమెను పరీక్షించిన వైద్యులు మల్టీవిటమిన్ మాత్రలు 30 రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆస్పత్రిలో ఉన్న ఫార్మసీ గది వద్దకు వెళితే అక్కడ సిబ్బంది మందులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగింది.
గంట్యాడ మండలానికి చెందిన పి. పాపమ్మ అనే వృద్ధురాలు నిద్రలేమితో బాధపడు తూ కేందాస్పత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు అ ల్ప్రాజోలమ్ మందులు రాశారు. ఆ చీటీ పట్టుకుని ఫార్మసీ వద్దకు వెళితే మందులు లేవని చెప్పారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరుగింది.
ఇది ఈ ఇద్దరి రోగులకు ఎదురైన అనుభవమే కాదు నిత్యం వందలాది మంది రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సర్కారీ ఆస్పత్రుల్లో మందుబిల్లలూ లేకపోవడంతో రోగులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో కూడా మందుల కొరత వేధిస్తోందని రోగులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. కేంద్రాస్పత్రిలో బీపీ వ్యాధికి వినియోగించే ఎటిన్‌లాల్ మాత్రలు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగించే పెంటాప్ మాత్రలు, గాయాలకు ఉపయోగించే సోప్రామైసిన్ మాత్రలు, నీరసానికి ఉపయోగించే మల్టీవిటమిన్ మాత్రలు, మానసిక రోగులకు ఉపయోగించే ఎమిట్రాపిన్,
మందు బిళ్లలకూ దిక్కులేదు..!
అల్ప్రాజోలమ్ తదితర మందులు లేవు. ప్రజారో గ్యానికి పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెబుతు న్న చంద్రబాబు సర్కార్ మాటలకు చేతలకు పొం తన ఉండడం లేదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులంతా పేద, మధ్యతరగతి వర్గాలవారే. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో రోగాలు నమయ్యేం దుకు అవసరమైన మందులు దొరకకపోవడంతో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు.
ప్రైవేటు మందుల దుకాణాలే దిక్కు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మందులు లేకపోవడంతో నిరుపేదలు సైతం ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరువల్లే ఆస్పత్రుల్లో మందుల కొరత నెలకొందని రోగులతో పాటు కొందరు వైద్యులు సైతం విమర్శిస్తున్నారు.
మందుల కోసం వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఫార్మాసిస్టులు మదనపడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతా రామరాజు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మందుల కొరత ఉన్న విషయం నా దృష్టికి రాలేదన్నారు. ఏవైనా మందులు లేకుంటే లోకల్‌గా కొనుగోలు చేసి అందిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment