SCARCITY
-
బయో ఇంధనంగా వంట నూనెలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోయింది. దీని ఫలితంగా వంట నూనెలకు కొరత ఏర్పడుతోంది. ట్రక్కులు, విమానాలకు కూడా బయో ఫ్యూయల్స్ వాడకంపై దృష్టి సారించడంతో.. ఆహారమా/ఇంధనమా అన్న చర్చ మొదలైంది. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా తదితర ప్రభుత్వాలు సోయాబీన్స్ లేదా కనోలా లేదా జంతు కొవ్వుల నుంచి తీసిన నూనెను ఇంధనాలకు వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సంప్రదాయ శిలాజ ఇంధనాలకు (పర్యావరణ కాలుష్యానికి దారితీసే) బదులు బయో ఇంధనాల వినియోగంతో కాలుష్యాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కొన్ని దేశాలు పనిచేస్తున్నాయి. దీంతో పామాయిల్ తదితర నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ చాలా అధికంగా ఉండడంతో వాడిన వంట నూనె, పామాయిల్ తయారీలో విడుదలయ్యే స్లడ్స్ అనే ఉత్పత్తి కోసం కంపెనీలు వేటను మొదలు పెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పామాయిల్ తయారీ పరిశ్రమల్లో విడుదలయ్యే స్లడ్స్ బయో ఇంధనాల తయారీకి ముడి పదార్థంగా వినియోగిస్తున్నారు. అవరోధాలు.. బయో ఇంధనాలకు ఏర్పడిన అనూహ్య డిమాండ్ తీరే సానుకూలతలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం, తీవ్ర వాతావరణ పరిస్థితులు అనేవి నూనెల సరఫరాను పరిమితం చేస్తున్నాయి. అర్జెంటీనాలో తీవ్ర కరువుతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. సోయాబీన్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం గమనించొచ్చు. ఇక యూరప్‌లో హానికారక రసాయాల వినియోగంపై నియంత్రణలు నెలకొన్నాయి. ఇది అక్కడ రేప్‌సీడ్ ఉత్పత్తిపై ప్రభావం పడేలా చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పొద్దు తిరుగుడు నూనె ఉత్పత్తిపై ఒత్తిడి నెలకొంది. ఈ ప్రతికూలతల వల్ల వంట నూనెల తయారీ తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ద్వితీయ భాగంలో అంతర్జాతీయ మార్కెట్లో బయో ఇంధనాలకు కొరత ఏర్పడుతుందని ఆయిల్ వరల్డ్ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మిల్కే తెలిపారు. వెజిటబుల్ నూనె మార్కెట్లో బయో ఇంధనాలు అధిక భాగాన్ని ఆక్రమిస్తున్నాయని.. ప్రపంచంలో డిమాండ్ కంటే సరఫరా తక్కువే ఉన్నట్టు చెప్పారు. అమెరికా, యూరప్, బ్రెజిల్, ఇండోనేషియా బయోడీజిల్, రెన్యువబుల్ డీజిల్, బయోజెట్ ఇంధనం వినియోగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా అయితే సోయాబీన్ ఆయిల్, రేప్‌సీడ్ ఆయిల్, వాడిన వంట నూనె, జంతు కొవ్వులను వినియోగిస్తోంది. యూరప్‌లో వ్యర్థాలు, రేప్‌సీడ్ ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. బ్రెజిల్ అయితే సోయాబీన్ ఆయిల్‌ను బయో ఇంధనాల తయారికి వాడుతోంది. పామాయిల్‌కు అనుకూలతలు.. బయో ఇంధనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో పామాయిల్ ఉత్పత్తిదారులు, కంపెనీలు లాభపడనున్నాయి. అలాగే, ఇతర నూనె గింజలు, వెజిటబు ల్ నూనెల వినియోగం కూడా బయో ఇంధనాల తయారీలో పెరుగుతోంది. ఈ డిమాండ్ పామాయిల్‌కు కలిసొస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, డిమాండ్ పెరిగితే అప్పుడు పామాయిల్‌కు సైతం కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఎందు కంటే ఇండోనేషియా, మలేషియా ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో 85 శాతం వాటా ఆక్రమిస్తున్నా యి. కానీ ఈ దేశాల్లో ప్లాంటేషన్ నిదానంగా సాగడం, ఉన్న పంటల వయసు పెరిగిపోవడం, ఉత్పత్తి లేని చెట్ల సంఖ్య పెరగడం, అటవీ భూముల వినియోగంపై ఆంక్షలు విస్తరణకు అడ్డుగా ఉన్నాయి. బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోతే అది ముడి సరుకు సరఫరా కొరతకు దారితీయవచ్చని.. అదే జరిగితే అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించాలన్న లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. -
Realme: ఫెస్టివల్ సీజన్.. టార్గెట్ బిగ్‌సేల్స్!
న్యూఢిల్లీ: పండగ సీజన్‌గా పేర్కొనే సెప్టెంబరు–అక్టోబర్‌లో 60 లక్షల పైచిలుకు స్మార్ట్ఫోన్ల విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. ట్యాబ్లెట్ పీసీల్లో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు వివరించారు. ల్యాప్టాప్స్ తయారీ కోసం మూడు కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలో వీటి తయారీ ప్రారంభం అవుతుందన్నారు. ట్యాబ్లెట్ పీసీలు సైతం దేశీయంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. 2020లో భారత్‌లో 1.9 కోట్ల యూనిట్ల రియల్మీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. చిప్సెట్ల ఎఫెక్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా చిప్సెట్ కొరత నెలకొన్నా... దాని ప్రభావం ఈ పండుగల సీజన్లో తమ కంపెనీపై ఉండబోదని రియల్మీ స్పష్టం చేసింది. భారత్‌లో తమ కంపెనీ ఈ ఏడాది 2.4–2.7 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాదికి సైతం సరిపడ చిప్సెట్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్టు రియల్మీ ఇండియా, యూరప్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ వెల్లడించారు. భారత మార్కెట్ విషయంలో చిప్సెట్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం చేశారు. రియల్మీ ప్యాడ్.. రూ.13,999 ధరలో రియల్మీ ప్యాడ్‌ను కంపెనీ గురువారం భారత్‌లో విడుదల చేసింది. మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్, 10.4 అంగుళాల స్క్రీన్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. 3/4 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే రియల్మీ 8ఎస్ 5జీ, రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్లను సైతం ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధరలు రూ.13,999 నుంచి మొదలవుతున్నాయి. చదవండి: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్..! -
అయ్యో మారుతి ! ఆటోమొబైల్ సెక్టార్‌పై ‘చిప్’ ఎఫెక్ట్
దేశంలోనే నంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజూకికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కార్ల తయారీలో కీలకమైన సెమికండర్లు (చిప్)ల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యను అధిగమించేందుకు మారుతి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. చిప్సెట్ల ఎఫెక్ట్ దసరా, దీపావళి పండుగలకి మన దగ్గర కార్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. మారుతి సైతం ఇదే లక్ష్యంతో భారీగా సేల్స్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన చిప్సెట్ల కొరత కారణంగా ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మారుతికి చిప్సెట్లు తయారు చేసే కంపెనీలు ఇప్పుడప్పుడే డిమాండ్‌కు తగ్గట్టు చిప్‌లు సరఫరా చేయలేమంటూ తేల్చిచెప్పాయి. దీంతో పండగ సీజన్ అమ్మకాల మాట అటుంచి చివరకు నెలవారీ తయారీ యూనిట్లలోనూ కోత పెట్టేందుకు మారుతి సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. టార్గెట్ కుదింపు ? దసరా, దీపావళీలను లక్ష్యంగా చేసుకుని మారుతి సెప్టెంబరు నెల తయారీ టార్గెట్ 60,000 నుంచి 90,000 యూనిట్లుగా ఆగస్టులో నిర్ధేశించుకుంది. అయితే చిప్సెట్ల కొరత కారణంగా ఈ టార్గెట్‌ను 50,000 నుంచి 70,000లకు కుదించినట్టు ఎకనామిక్ టైమ్స్ లో కథనాలు ప్రచురితం అయ్యాయి. సాధారణంగా పండగ సీజన్లో లక్షకు పైగా యూనిట్లను మారుతి తయారు చేస్తుంది. కానీ చిప్ సెట్ల కొరతతో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. 2014 తర్వాత కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్లు విధించినప్పుడు కూడా మారుతి కార్ల తయారీ ఈ స్థాయిలో దిగువకు చేరుకోలేదు. చివరి సారిగా 2014లో యాభై వేల యూనిట్లు తయారు చేశారు. ఆ తర్వాత ప్రతీ ఏడు 70వేలకు పైగానే కార్లు తయారు అయ్యేవి. చిప్సెట్లు, సెమికండక్టర్ల కొరతతో మారుతి ప్రణాళిక అమలు కష్టంగా మారింది. ఓపెన్ మార్కెట్ నుంచి చిప్సెట్లు కొనుగోలు చేసే దిశగా కూడా మారుతి ప్రయత్నాలు చేస్తోంది. షేర్ ధర తగ్గలేదు చిప్ సెట్ల కొరతతో ఇబ్బందుల్లో మారుతి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నా ఆ కంపెనీ షేర్ వ్యాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం రోజు మారుతి షేర్ ధర రూ.6605 నుంచి 6,675కి చేరుకోవడం ఈ కంపెనీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. చదవండి: ఇండియాకి టెస్లా కారు వస్తోందా? జరుగుతున్నదేంటీ? -
మందు బిళ్లలకూదిక్కులేదు..!
విజయనగరం ఫోర్ట్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నరసమ్మ. ఈమెది నెల్లిమర్ల మండలం ఆత్మరాముని ఆగ్రహారం. నీరసంగా ఉందని కేంద్రాస్పత్రికి వచ్చింది. ఈమెను పరీక్షించిన వైద్యులు మల్టీవిటమిన్ మాత్రలు 30 రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆస్పత్రిలో ఉన్న ఫార్మసీ గది వద్దకు వెళితే అక్కడ సిబ్బంది మందులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగింది. గంట్యాడ మండలానికి చెందిన పి. పాపమ్మ అనే వృద్ధురాలు నిద్రలేమితో బాధపడు తూ కేందాస్పత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు అ ల్ప్రాజోలమ్ మందులు రాశారు. ఆ చీటీ పట్టుకుని ఫార్మసీ వద్దకు వెళితే మందులు లేవని చెప్పారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరుగింది. ఇది ఈ ఇద్దరి రోగులకు ఎదురైన అనుభవమే కాదు నిత్యం వందలాది మంది రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సర్కారీ ఆస్పత్రుల్లో మందుబిల్లలూ లేకపోవడంతో రోగులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో కూడా మందుల కొరత వేధిస్తోందని రోగులు వాపోతున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. కేంద్రాస్పత్రిలో బీపీ వ్యాధికి వినియోగించే ఎటిన్‌లాల్ మాత్రలు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగించే పెంటాప్ మాత్రలు, గాయాలకు ఉపయోగించే సోప్రామైసిన్ మాత్రలు, నీరసానికి ఉపయోగించే మల్టీవిటమిన్ మాత్రలు, మానసిక రోగులకు ఉపయోగించే ఎమిట్రాపిన్, మందు బిళ్లలకూ దిక్కులేదు..! అల్ప్రాజోలమ్ తదితర మందులు లేవు. ప్రజారో గ్యానికి పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెబుతు న్న చంద్రబాబు సర్కార్ మాటలకు చేతలకు పొం తన ఉండడం లేదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులంతా పేద, మధ్యతరగతి వర్గాలవారే. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో రోగాలు నమయ్యేం దుకు అవసరమైన మందులు దొరకకపోవడంతో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు మందుల దుకాణాలే దిక్కు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మందులు లేకపోవడంతో నిరుపేదలు సైతం ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరువల్లే ఆస్పత్రుల్లో మందుల కొరత నెలకొందని రోగులతో పాటు కొందరు వైద్యులు సైతం విమర్శిస్తున్నారు. మందుల కోసం వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఫార్మాసిస్టులు మదనపడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతా రామరాజు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మందుల కొరత ఉన్న విషయం నా దృష్టికి రాలేదన్నారు. ఏవైనా మందులు లేకుంటే లోకల్‌గా కొనుగోలు చేసి అందిస్తామని చెప్పారు. -
పశుగ్రాసం కొరతను..నివారించండి ఇలా..
విజయనగరం ఫోర్ట్: వేసవిలో పశువులను ఎక్కువగా వేధించే సమస్య పశుగ్రాసం కొరత. మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎండ తీవ్రత ఎక్కువ. ఆ నెలల్లో పశుగ్రాసం దొరకదు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రాయితీపై పశుగ్రాసాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నామని పశుసంవర్థక శాఖ జేడీ వై.సింహాచలం తెలిపారు. ఈ మేరకు రైతులకు పశుసంవర్థకశాఖ ద్వారా రైతులకు అందించే పథకాల గురించి వివరించారు. సైనేజ్గడ్డి.. సైనేజ్గడ్డిని బేళ్లు రూపంలో రైతులకు అందిస్తున్నారు. కిలో గడ్డి ధర రూ. 6.92. కానీ రాయితీపై కిలో రూ.2కే అందిస్తున్నారు. ఒక రైతుకు గరిష్టంగా 3600 కేజీల గడ్డి ఇస్తారు. కావాల్సిన వారు సంబంధిత పశువైద్యాధికారిని గాని, గోపాలమిత్రను గాని సంప్రదించాలి. ఈ గడ్డి వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. వారం పాటు పశువులకు అలవాటు చేయాలి. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు.. ఈ పథకంలో భాగంగా గడ్డిని సాగు చేసే రైతులకు భూమి లీజు, ఉత్పత్తి వ్యయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు భూమి లీజు చెల్లిస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని ఉపాధి పథకం ద్వారా చెల్లిస్తారు. బహువార్షిక గడ్డి అయితే ఎకరానికి రూ.37వేలు, ఏకవార్షిక గడ్డి అయితే రూ.15వేల చొప్పన అందిస్తారు. గడ్డిని సాగు చేసిన రైతు కిలో గడ్డిని రూ.1కే మిగతా రైతులకు అందించాలి. దాణామృతం.. దాణామృతం గడ్డిలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని రోజుకి ఒక పశువుకు 10 నుంచి 12 కిలోలు పెట్టాలి. గరిష్టంగా ఒక రైతుకు 3500 కిలోలు ఇస్తాం. కిలో విలువ రూ.12.50 కాగా రాయితీపై రైతులకు రూ.3.50 పైసలకు అందిస్తాం. -
కష్టాల్లో ముంచేను
కూతవేటు దూరంలోనే గోదావరి ప్రవహిస్తోంది. పంట కాలువల్లో మాత్రం నీరు అడుగంటుతోంది. ఫలితంగా వరి చేలకు సాగునీరు అందక అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. పంటల్ని గట్టెక్కించేందుకు వంతులవారీ విధానం అమలు చేస్తున్నా.. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లోని శివారు ఆయకట్టుకు నీరందక వరి చేలు ఎండి బీటలు వారుతున్నాయి. వరి దుబ్బులు పొట్ట, ఈనిక దశలో ఉన్న కీలక తరుణంలో సాగునీరు ఇవ్వకపోతే నిండా నష్టాల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. యలమంచిలి/ఆచంట : యలమంచిలి మండలం వడ్డిలంక చానల్ పరిధిలోని కాజ బ్రాంచి కాలువపై ఆధారపడిన ఆయకట్టు పరిధిలోని వరి చేలకు వెంటనే సాగునీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కాలువపై ఆధారపడి సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చేలన్నీ ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో నీటితడి ఇవ్వకపోతే గింజ పాలుపోసుకోక తప్పలుగా మారిపోయే ప్రమాదం ఉందని కలగంపూడి, కాజ తూర్పు గ్రామాలకు చెందిన రైతులు తోటకూర శ్రీనివాసరాజు, గుంటూరు నాగరాజు, పాలంకి వెంకటేశ్వరరావు తదితరులు చెప్పారు. ఇప్పటికే నాలుగుసార్లు ఎరువులు, గుళికలు, పురుగు మందులు వాడాల్సి రావడం వల్ల ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అయ్యిందన్నారు. ఇప్పటికిప్పుడు నీరు పెట్టకపోతే కంకులన్నీ చొప్పలుగా మారి పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు చల్లడం, కీలక తరుణంలో నీరు అందకపోవడంతో మందు కసరు కంకుల తలకు ఎక్కి వరి దుబ్బుల ఎగువ చివరి భాగంలో ఎరుపు రంగు వస్తోందని వివరించారు. ఇది ఎక్కువైతే కంకులు పూర్తిగా బయటకు రావని, చేనంతా గడ్డిగా మారిపోతుం దని ఆందోళన చెందుతున్నారు. వంతులవారీ విధానంలో సక్రమంగా నీరివ్వకపోవడమే దీనికి కారణమని వాపోతున్నారు. సాగునీటి కోసం కోసం డెల్టా లస్కర్ ఫోన్ చేస్తుంటే మూడు రోజులు నుంచి స్పందించడం లేదని తెలిపారు. కాలువకు ఎగువన ఉన్న ఆర్యపేట, యలమంచిలి రైతులు వరి మానేసి మినుము, పెసర చల్లుతుంటే తాము కూడా అపరాల సాగు వైపు మొగ్గు చూపామని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇరిగేషన్, వ్యవసాయ అధి కారులు వచ్చి కాలువ పై భూముల్లో సాగు లేదు కాబట్టి దిగువ భూములకు పుష్కలంగా నీరిస్తామని, వరి సాగు చేయాలని చెప్పడంతో నాట్లు వేశామని కాజ తూర్పు, కలగంపూడి గ్రామాల రైతులు వివరించారు. సాగునీటి ఎద్దడి ఏర్పడిన తరుణంలో నీరి వ్వండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆచంట నియోజకవర్గంలోనూ ఇదే సమస్య ఆచంట నియోజకవర్గ పరిధిలోనూ ఇదే సమస్య నెలకొంది. ఆచంట మండలం భీమలాపురం, ఆచంట వేమవరం, వల్లూరు గ్రామాల్లో శివారు ఆయకట్టు నీరందటం లేదు. సుమారు 500 ఎకరాల్లో పంట ఎండిపోయే దుస్థితి దాపురించింది. రానున్న రోజుల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది. పెనుగొండ మండలం వడలి, రామన్నపాలెం, తామరాడ గ్రామాల్లో ఇప్పటికే వరిచేలు బీటలు వారాయి. ఈ మూడు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో పంట ఎండిపోతోంది. సాగునీరివ్వలంటూ అక్కడి రైతులు రోడ్డెక్కి ఆం దోళనలు చేయగా.. సమస్యను పరిష్కరించాలి్సన ప్రభుత్వం ఆ పని మానేసి సాగునీరు అడిగిన రైతులపై కేసులు నమోదు చేయించింది. ఇదిలావుంటే.. పెనుమంట్ర మండలం ఎస్.ఇలి్లందల పర్రు, మల్లిపూడి, జుత్తిగ గ్రామాల్లోని ఆయకట్టుకు నీరందక 300 ఎకరాల్లో పంట దెబ్బతింటోంది. మరోవైపు అటు పాలకొల్లు, ఇటు ఆచంట నియోజకవర్గాల పరిధిలో గల పోడూరు మండలంలోని కవిటం, తూర్పుపాలెం, వద్దిపర్రు, గుమ్ములూరు, పెనుమదం గ్రామాల్లోనూ సాగునీటి ఎద్దడి నెలకొంది. పంట పాలుపోసుకునే కీలక దశలో నీటి సమస్య మొదలైంది. మరో 10 రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగితే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరిచ్చి 15 రోజులైంది యలమంచిలి మండలం కాజ బ్రాంచి కాలువపై ఆధారపడి సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఈ భూములకు సాగునీరిచ్చి 15 రోజులైంది. ప్రస్తుతం చేలన్నీ ఈనిక, పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడు నీరు పెట్టకపోతే ఒక్క గింజలో కూడా పాలు గట్టిపడవు. అదే జరిగితే పెట్టిన సొమ్ముంతా నష్టపోతాం. వెంటనే సాగునీరు ఇచ్చి పంటల్ని కాపాడాలి. – బొక్కా పురుషోత్తం, కౌలు రైతు, కలగంపూడి, యలమంచిలి మండలం అధికారులు స్పందించడం లేదు దాళ్వా ప్రారంభంలో అధికార యంత్రాంగమంతా వచ్చి వరి సాగు చేయమని బతిమలాడారు. తీరా సాగు చేశాక నీరందక రైతులంతా అల్లాడుతుంటే ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మేమంతా కలసి పాలకొల్లు లాకుల వద్దకు వెళితే ఒక్క అధికారి కూడా దొరకలేదు. ఫోన్ చేస్తుంటే ఎవరూ తీయడం లేదు. – చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, రైతు, కాజ, యలమంచిలి మండలం -
అన్నదాత ఆక్రోశం
పెనుగొండ: సాగు నీటి ఎద్దడితో పంట చేలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు. వంతుల వారీ విధానంలోనూ నీటిని అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ వందలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ మండలంలోని రామన్నపాలెం వద్ద రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ప్రతి ఎకరాకు నీరందిస్తామంటూ అధికారులు దాళ్వా ప్రారంభంలో నమ్మించి నిండా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు మధ్యలో నీరు అందకపోవడంతో దిక్కుతోచని స్థిలిలో ఉన్నామన్నారు. ఆచంట కాలువ పరిధిలోని వడలి, రామన్నపాలెం, తామరాడ ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. పత్తాలేని నీటి సంఘం నాయకులు రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కి నిరసన తెలిపినా నీటి సంఘాల నాయకులు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పత్తా లేకుండాపోయారు. కనీస సమాధానం చెప్పడానికి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. కొద్దిసేపటికి నీటిపారుదల శాఖ సూపర్వైజర్ అబ్బులు రావడంతో ఏఎస్సై బి.నాగిరెడ్డి సమక్షంలో కౌలు రైతు సంఘ నాయకడు గుర్రాల సత్యనారాయణ చర్చలు జరిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాగు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు యర్రంశెట్టి భాస్కరరావు, ముద్రౌతు త్రిమూర్తులు, పేరాబత్తుల సత్యనారాయణ, పేరాబత్తుల రామలింగేశ్వరరావు, చిట్యాల వీరన్న, జక్కం కృష్ణారావు తదితరులు నాయకత్వం వహించారు. శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలి సార్వా, దాళ్వా సాగులకు నీటి ఎద్దడి రాకుండా దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సూర్నిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వంతుల వారీ విధానంతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. -
గట్టెక్కుతుందా..!.
కీలక సమయంలో కాటన్ బ్యారేజ్వద్ద తగ్గుతున్న నీటిరాక నీరు పెంచాలి్సన సమయంలో పడిపోయిన సహజ జలాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు సీలేరుపైనే ఆశలు ఇప్పటికే బైపాస్ పద్ధతిలో సాగునీరు ఆంధ్రుల అన్నపూర్ణగా భాసిల్లుతున్న గోదావరి డెల్టాలో రబీ కీలక దశకు చేరింది. పాలు పోసుకుని గింజ గట్టిపడే దశకు వరి చేలు చేరుకున్నాయి. ఈ తరుణంలో రైతులు చేలల్లో ఎక్కువగా నీరు నిల్వ చేసూ్తంటారు. ఇదే సమయంలో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి రాక తగ్గుతూండడం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. రబీ వరిసాగును గట్టెక్కించేదెలాగని వారు ఆందోళన చెందుతున్నారు. అమలాపురం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి డెల్టాలో అధికారుల లెక్కల ప్రకారం 8.86 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. ఇంత విస్తీర్ణంలో సాగుకు కనీసం 85 టీఎంసీల నీరు అవసరం. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి ఎద్దడి ఉండదని భావించారు. కానీ, డిసెంబరు నెలలో అనూహ్యంగా సహజ జలాల రాక పడిపోవడంతో ఆందోళన నెలకొంది. దీనికితోడు సాగు ఆరంభంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. వంతులవారీ విధానంతో పరిస్థితి కొంత సానుకూలంగా మారింది. డెల్టా శివారుల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో రబీ వరి చేలు ప్రస్తుతం గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. మధ్య డెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు; తూర్పు డెల్టాలోని కరప, రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో సాగు ఆలస్యమైన చోట చేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. ఈ దశలో చేలల్లో ఎక్కువగా నీరు పెడతారు. కాలువల ద్వారా సమృద్ధిగా సాగు నీరందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 8,540 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో సీలేరు నుంచి పవర్ జనరేషన్ ద్వారా 4,863, బైపాస్ పద్ధతిలో 2,712 క్యూసెక్కుల చొప్పున 7,575 క్యూసెక్కుల నీరు వస్తోంది. అంటే బ్యారేజ్ వద్ద సహజ జలాలు 965 క్యూసెక్కులు మాత్రమే. తూర్పు డెల్టాకు 2,520, మధ్య డెల్టాకు 1,640, పశ్చిమ డెల్టాకు 4,380 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు 105 డ్యూటీ(ఒక క్యూసెక్కు 105 ఎకరాల చొప్పున)లో నీరు అందిస్తున్నారు. పాలు పోసుకుంటున్న సమయంలో డెల్టా కాలువకు 90 డ్యూటీ(ఒక క్యూసెక్కు 90 ఎకరాల చొప్పున)లో నీరు విడుదల చేయాల్సి ఉంది. అంటే మూడు కాలువలకు 8,800 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలి. వేసవి ఎండలు పెరుగుతున్నందున్న ఆవిరి రూపంలో ఎక్కువ నీరు పోతుంది. కాబట్టి కనీసం 9 వేల క్యూసెక్కుల నీరు ఇస్తే శివారుకు సాగునీరందుతుంది. కానీ సహజ జలాల రాక వెయ్యి క్యూసెక్కుల లోపునే ఉంది. ముందు ముందు ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. పోనీ సీలేరు నుంచి ఇప్పుడొస్తున్నట్టుగా నీరు వస్తుందనే నమ్మకం కూడా రైతులకు లేదు. ఇప్పటికే బైపాస్‌లో 2,712 క్యూసెక్కులు ఇస్తున్నారు. వేసవి విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బైపాస్‌ను నిలిపివేస్తే రైతులకు కష్టాలు తప్పవు. నీరు తగ్గడానికి తోడు, వేసవి ఎండలు పెరిగితే చి‘వరి’లో రైతులు నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది. -
విలపించేను
అత్తిలి : వరి చేలకు సాగు నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కళ్లెదుటే పంట ఎండిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కనీసం ఒక్క తడయినా పెట్టి పంటను కాపాడుకుందామనే ఆశతో రేయింబవళ్లు చేల గట్లపైనే కాపలా ఉంటున్నారు. చుక్క నీరైనా అందక వేదనకు చెందుతున్నారు. వంతులవారీ విధానంలోనూ సాగునీరందకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అత్తిలి మండలంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలో 15 వేల ఎకరాల్లో దాళ్వా సాగు చేపట్టిన రైతులు నాట్లు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. కీలకమైన తరుణంలో చేలకు నీరందక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అత్తిలి శివారు బొంతువారి పాలెంలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అక్కడి ఆయకట్టుకు కనీస మాత్రంగానైనా నీరు అందటం లేదు. దీంతో ఆ ప్రాంతంలోని చేలన్నీ బీటలువారాƇు కేఎస్ చానల్ ద్వారా ఈ ఆయట్టుకు సాగునీరు సరఫరా కావాల్సి ఉండగా, ఒక్కతడి కూడా పెట్టుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువకు నీరు రావటం లేదని, వేలాది రూపాయలు వెచ్చించి ఆయిల్ ఇంజిన్లతో తోడుకుంటున్నా పంటను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇంజిన్‌తో నీటిని తోడి చేనుకు మళ్లిస్తే మరుసటి రోజుకే ఇంకిపోతున్నాయని, వారానికి మూడుసార్లు నీటిని తోడుతున్నా పంట గట్టెక్కుతుందో లేదోనని పలువురు రైతులు వాపోతున్నారు. ఆయిల్ ఇంజిన్ల కోసం పెట్టుబడి పెట్టలేని రైతులు పంటను అలాగే వదిలేస్తున్నారు. నాట్లు వేసిన తరువాత నీటి సరఫరా లేక చేలన్నీ ఎండిపోయానని.. దీంతో మరోసారి మూనలు నాటామని కొందరు రైతులు చెప్పారు. చేలల్లో నీరులేక కలుపు విపరీతంగా పెరిగిపోతోందని.. దానిని తొలగించడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వివరించారు. ఈడూరులోనూ ఇదే పరిస్థితి ఈడూరు గ్రామ పరిధిలోని అల్లం కోడు, ఆవబోదె ఆయకట్టు పరిధి లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి వంతుల సమయంలో వరుసగా మూడు దఫాలు నీరు సరఫరా కాలేదని రైతులు పెరికెల సత్యనారాయణ, వానపల్లి సత్యనారాయణ, తలారి విష్ణుమూర్తి చెప్పారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, కీలక తరుణంలో నీరందకపోవడంతో చేలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మురుగు డ్రెయిన్ల నుంచి ఆయిల్ ఇంజిన్ల సాయంతో నీటిని తోడుకున్నామని, ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు పెరిగిపోవడంతో కలుషిత జలాలు డ్రెయిన్‌లోకి చేరి ఉప్పుమయంగా మారుతోందని వివరించారు. ఆ నీటిని చేలకు తోడుకుంటే చౌడుబారే ప్రమాదముందని వాపోతున్నారు. కాలువ శివారు ప్రాంతాలకు వంతుల సమయంలో పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అయ్యేవిధంగా సాగునీటి సంఘాలు, అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. గట్టెక్కేదెలా అత్తిలి శివారు బొంతువారిపాలెంకు చెందిన ఈ రైతు పేరు బొంతు సతీష్. 7 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. దాళ్వా నాట్లు వేసిన తరువాత నీరందకపోవడంతో వరి దుబ్బులు ఎండిపోయాయి. తిరిగి మరోసారి నాట్లు వేశాడు. మూన తిరిగాక ఇప్పటివరకు చేలకు సాగునీరు అందలేదు. దీంతో ఆయిల్ ఇంజిన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకరం పొలానికి తడి పెట్టేందుకు విడతకు 6 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. కొనేందుకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఎకరానికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.1.05 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయినా.. సగం పంట ఎండిపోయింది. మరోవైపు కలుపు పెరిగిపోతోంది. ఇప్పటికే కలుపు తీతకు రూ.25 వేల వరకు ఖర్చయ్యింది. సాగునీటి కోసం పొరుగు రైతులతో తరచూ ఘర్షణకు దిగాల్సి వస్తోంది. రెండో కోటా ఎరువులు వేయాల్సి ఉంది. తెగుళ్ల నుంచి పంటన రక్షించుకునేందుకు పురుగు మందులూ వాడాల్సి ఉంది. వీటికోసం ఎకరానికి కనీసం రూ.10 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి. కూలీలకు చెల్లింపులు మామూలే. మొత్తంగా చూస్తే రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఇంత చేసినా పంట పండుతుందో లేదో తెలియదు. పండినా దిగుబడి దారుణంగా పడిపోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అప్పులు ఎలా తీర్చాలో.. భూస్వామికి కౌలు మగతా ఎలా చెల్లించాలో తెలియక సతీష్ సతమతమవుతున్నాడు. ‘వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నీరివ్వలేమని అధికారులు ముందే చెప్పి ఉంటే అపరాలు సాగు చేసుకునేవాళ్లం. నీటిఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సబ్సిడీపై విద్యుత్ మోటార్లను ఇచ్చి ఉంటే నీటి సమస్య నుంచి బయటపడేవాళ్లం. దాళ్వా సాగుతో నిండా అప్పుల్లో మునిగాం. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని సతీష్ వాపోతున్నాడు. ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు సాగునీటి కోసం గతంలో ఇంతటి దారుణ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టాం. ఈ సమయంలో నీరులేక పంటలు ఎండిపోవడం బాధాకరం. అధికారులు, సాగునీటి సంఘాలు సక్రమంగా సాగు నీరందించే ఏర్పాటు చేయాలి. – టీవీవీఎస్ఎన్ మూర్తి, రైతు, అత్తిలి బీటలు వారుతున్నాయి వంతు సమయంలోనూ మూడు దఫాలుగా మా ఆయుకట్టు ప్రాంతానికి సాగునీరు అందటం లేదు. పంటచేలు ఎండి బీటలు వారుతున్నాయి. సాగునీటి కోసం అవస్థలు పడుతున్నాం. ఆయిల్ ఇంజిన్లతో తోడుకుందామన్నా పంట బోదెల్లో నీళ్లు లేవు. – సంకు సూర్రావు, రైతు, ఈడూరు -
గోదారి ఎడారి
కొవ్వూరు : గోదారమ్మ గుండె ఎండిపోతోంది. నదీగర్భం ఎడారిని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఇసుక మేటలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా పశ్చిమడెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీసాగుకు సీలేరు జలాలే దిక్కయ్యే దుస్థితి దాపురించింది. గోదావరి నదిలో 15 రోజులుగా నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలి తంగా ఫిబ్రవరి నెలాఖరులోనే నది వెలవెలబోతోంది. ఇసుకమేటలు బయటపడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాల కాలువలకు గోదావరి నీరు సక్రమంగా అందాలంటే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.64 మీటర్లు పైబడి ఉండాలి. అప్పుడే కాలువలకు నీటి ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. గరిష్ట నీటిమట్టం కంటే తక్కువగా ఉంటే కాలువల్లో ప్రవాహ వేగం తగ్గిపోతుంది. ప్రస్తుతం నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో ఆనకట్టకు ఎగువన గోదావరి నదిలో ఇసుక మేటలు బయటపడ్డాయి. కనుచూపు మేర ఎడారిని తలపిస్తోంది. నీటి ఎద్దడి పొంచి ఉంది. పశ్చిమడెల్టాలో రబీసాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సీలేరు నుంచి రోజుకు ఏడువేల క్యూసెక్కుల నీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.20 అడుగులకు పడిపోయింది. దీంతో అధికారులూ ఆందోళన చెందుతున్నారు. ఈనెల 9న ఆనకట్ట వద్ద పాండ్లెవెల్ 13.32 ఉండేది. వరుసగా నాలుగురోజులుపాటు నీటిమట్టం పడిపోవడంతో సీలేరు జలాల విడుదలను పెంచారు. మూడురోజులపాటు నీటిమట్టం నిలబడింది. ఈనెల 16న 13.28 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతూ 24వ తేదీకి 13.20 మీటర్లకు పడింది. సహజ జలాల పరిస్థితీ అంతే దీనికితోడు మరోవైపు నదిలో సహజ జలాల లభ్యత కూడా తగ్గిపోతోంది. పదిరోజుల కిత్రం 2,500 క్యూసెక్యులుగా ఉన్న సహజ జలాలు ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నుంచి 1,500 క్యూ సెక్కుల మధ్య మాత్రమే లభ్యమవుతున్నాయి. సీలేరు జలాలే ఆధారం దీంతో పశ్చిమ డెల్టాలో రబీ సాగు పూర్తిగా సీలేరు జలాలపైనే ఆధారపడింది. సీలేరు వద్ద విద్యుదుత్పత్తిని బట్టి నీటివిడుదలలో హెచ్చుతగ్గులు ఉండడంతో బైపాస్ ద్వారా నీటిని సరఫరా చేయాలని జలవనరుల శాఖ అధికారులు కోరుతున్నారు. పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం శనివారం 4,280 క్యూసెక్కులు చొప్పున 107 డ్యూటీపై(ఒక క్యూసెక్కు 107 ఎకరాలకు) వదులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,240 క్యూసెక్కులు వదులుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,400, సెం ట్రల్ డెల్టాకు 1,560 క్యూసెక్కుల చొప్పున 110 డ్యూటీపై అందిస్తున్నారు. నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489, ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 358 క్యూసెక్కుల చొప్పున నీరు అందిస్తున్నారు. సీలేరు నుంచి ఏడువేల క్యూసెక్కులు కోరాం గోదావరిలో సహజ జలాల లభ్యత గణనీయంగా పడిపోయింది. డెల్టా ఆయకట్టుకు నీటిఎద్దడి పొంచి ఉండడంతో సీలేరు నుంచి ఏడు వేల క్యూసెక్కులు నీరు ఇవ్వాలని కోరాం. విద్యుదుత్పత్తి ద్వారా 4,500, బైపాస్ ద్వారా 2,500 క్యూసెక్కులు ఇవ్వాలని లేఖ రాశాం. విద్యుత్ ఉత్పత్తిని బట్టి నీటివిడుదలలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ప్రస్తుతం 6,500 క్యూసెక్కుల వరకు వస్తోంది. ఒక్కోక్క రోజు తగ్గుతోంది.నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఒక డీఈఈకి సీలేరు జలాల విడుదల పర్యవేక్షణ బాధ్యత అప్పగించాం. – ఎ¯ŒS.కృష్ణారావు, గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం గత పది రోజుల్లో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం వివరాలు తేదీ నీటిమట్టం మీటర్లలో ఫిబ్రవరి15 13.28 ఫిబ్రవరి 16 13.28 ఫిబ్రవరి17 13.26 ఫిబ్రవరి18 13.25 ఫిబ్రవరి19 13.23 ఫిబ్రవరి20 13.23 ఫిబ్రవరి 21 13.23 ఫిబ్రవరి 22 13.23 ఫిబ్రవరి 23 13.21 ఫిబ్రవరి 24 13.20 ఫిబ్రవరి 25 13.20 -
ఎవరికి చెప్పుకోవాలె ?
l జెడ్పీలో టాయిలెట్లు లేక ఉద్యోగుల కష్టాలు l మహిళల పరిస్థితి మరీ అధ్వానం l పట్టించుకోని ఉన్నతాధికారులు హన్మకొండ : హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలలు లేక అవస్థలు పడుతుండగా.. మహిళా ఉద్యోగుల కష్టాలైతే చెప్పే పరిస్థితిలో లేవు. జిల్లా వ్యాప్తం గా మరుగుదొడ్లు నిర్మించే శాఖల ఉన్నతాధికారులు కొలువై ఉండే జిల్లా పరిషత్ ఆవరణలోనే.. ఉద్యోగులు కడుపునొప్పి సమస్యతో సతమతమయ్యే పరిస్థితి దాపురించింది. జిల్లా పరి షత్ ఆవరణలో జిల్లా పరిషత్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆడిట్ శాఖల కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 300 మంది ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉద్యోగుల కోసం జెడ్పీ మొదటి అంతస్తులో ఒక్కటి చొప్పున మూత్రశాలలు నిర్మించారు. అయితే, నిర్వహణ లేకపోవడంతో రెండు మరుగుదొడ్లకు తాళాలు వేశారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉద్యోగులైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. స్వచ్ఛ భారత్ చేపట్టే ఉన్నతాధికారులు ఉండే ఆవరణలోనే తమ పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేని విధంగా మారిందని వారు వాపోతున్నారు. నిర్మించే శాఖ వారికే.. మరుగుదొడ్లు, మురుగు కాల్వలను నిర్మించే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల జిల్లా కార్యాలయాలు జెడ్పీ ఆవరణలోనే ఉన్నా యి. ఇక్కడ పని చేసే ఉద్యోగులకే ‘కడుపు నొప్పి’ కష్టాలు వస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జెడ్పీ సీఈఓ, పీఆర్, ఆర్‌డబ్లూ్యఎస్ ఎస్ఈల కార్యాలయాలు జెడ్పీ ఆవరణలోనే ఉన్నాయి. వీరందరికీ వారి పేషీల్లోనే ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో సాధారణ ఉద్యోగులు, సిబ్బంది కష్టాలు వీరికి తెలియడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి సొంత కార్యాలయాల్లో ‘స్వచ్ఛ భారత్’కు అంకురార్పణ చేయాలని సిబ్బంది కోరుతున్నారు. -
180 కోట్ల మందికి నీటి కరువు!
నీటి కొరతపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. అడవుల పరిరక్షణ, మంచినీటి నిర్వహణ, నీటికొరత నివారణ ప్రధాన అంశాలుగా ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో చర్చ నిర్వహించింది. మనం రోజూ వాడుకునే మంచినీటి నిల్వల్లో మూడొంతులు అటవీ ప్రాంతాల్లోని పరివాహక ప్రాంతాల నుంచి వచ్చేవేనని, సుమారు 160 కోట్ల మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, ఇంధనానికి అడవులపైనే ఆధారపడుతున్నారని, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మనకు లభించే శుద్ధమైన నీటి వనరులను కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవడమే ప్రధానమార్గమని దీంతోనే నీటి కొరత ఏర్పడకుండా ఉంటుందని అన్నారు. 2025 నాటికి సుమారు 180 కోట్ల మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎక్కడ ఎలా వర్షం పడినా ఆ నీటిని అటవీప్రాంతాల్లోని వాటర్ షెడ్స్, చిత్తడి నేలల ద్వారా శుభ్రపరచవచ్చని, భూగర్భ జలాలను పెంచడంతోపాటు అనేక రకాలుగా నీటిని క్రమబద్ధీకరించడంలో సైతం అడవులు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంలో నిపుణులు అభిప్రాయాలను వెల్లడించారు. మరోవైపు నీటి వనరుల రక్షణ, పునరుద్ధరణ కేవలం వాతావరణం వల్ల మాత్రమే కాదని, నీటి శుద్ధి కోసం కొత్త మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిచి, పచ్చదనాన్ని పెంచడం అవసరమని ఐక్యరాజ్యసమితి అటవీ కార్యదర్శి, ఫోరం డైరెక్టర్ మనోయెల్ సోబ్రల్ ఫిల్‌తో తెలిపారు. ముఖ్యంగా అడవులు గ్రహాల్లోని సహజ నీటి వనరులు అని ఆయన అన్నారు. ప్రతియేటా మార్చి 21న జరిపే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్ సందర్భంగా నిర్వహించే ఐరాస గణాంకాల్లో... సహజ అడవులు 70 లక్షల హెక్టార్ల వరకూ నశించిపోతున్నట్లు, 5 కోట్ల హెక్టార్లను దహనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. -
హోలీ సంబరాలకు నీళ్లివ్వం
ముంబై: రంగుల పండుగ హోలీ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న నీటి కొరత కారణంగా హోలీ సందర్భంగా నిర్వహించే రెయిన్ డాన్స్ లకు నీటిని సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్ కు నీరు అందించకూడదని నిర్ణయించింది. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి అన్ని మున్సిపల్ కార్పొరేషనన్లకు ఆదేశాలు జారీచేయనున్నామని పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల పవిత్ర పండుగ హోలీ సంబరాలపై 'నీళ్లు' చల్లడం అన్యాయమని కొందరు, మంచి నిర్ణయమని కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
తిరుమలలో లడ్డూల కొరత
తిరుమల: తిరుమలలో శ్రీవారి భక్తులకు బుధవారం లడ్డూల కొరత ఎదురైంది. అదనపు లడ్డూలు అందలేదు. అవసరమైనన్ని లడ్డూలు నిల్వ లేకపోవడంతో కొరత ఏర్పడింది. అందువల్ల బుధవారం ఉదయం 11 గంటలకే అదనపు లడ్డూల కౌంటర్‌ను మూసివేశారు. అదనంగా లడ్డూలు తీసుకెళదామనుకున్న భక్తులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. తిరుమలలో ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ ఉంది. ఇక్కడ రూ.25 ధరతో రూ.50కి రెండు, రూ.100కి నాలుగు లడ్డూలు చొప్పున టికెట్లు విక్రయిస్తారు. అయితే, ఈ కౌంటర్ నిర్వహించడంలో ఇక్కడి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అవసరమైనన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవడంలో విఫలమవుతున్నారు. -
తిరుమలలో టెంకాయలు లేవు
తిరుమల: తిరుమలలో కొబ్బరి కాయల కొరత ఏర్పడింది. కలియుగ దైవం శ్రీవేంటేశ్వరస్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. భక్తులు కర్పురం వెలిగించి... తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొబ్బరికాయలు స్టాక్ లేవని కౌంటర్లు వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌర్యానికి గురవుతున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో దూరం నుంచి వచ్చామని... అయితే కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో మొక్కులు సరిగ్గా తీర్చుకో లేకపోతున్నామని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రౌండ్ రిపోర్ట్ : కరువు కోరల్లో 'రాయల సీమ'!
-
జమ్మూలో డీజిల్, పెట్రోల్ కు తీవ్ర కొరత!
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని సహాయక చర్యల్లో నిమగ్నమైన సైన్యాధికారిల బృందం తెలిపింది. వరదల కారణంగా రోడ్లు, రవాణ వ్యవస్థ దెబ్బతినడం ప్రత్యామ్నాయ రూట్లలో 350 ట్రక్కుల పెట్రోల్ పంపుడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. చమురు నిల్వలున్నా రోడ్లు పాడవడంతో వెళ్లలేకపోతున్నామని ఆర్మీ ఆధికారులు తెలిపారు. వరద సహాయ కార్యక్రమాల్లో 30వేల మంది జవాన్లు పాల్గొంటున్నారని, ఇప్పటి వరకు లక్షమందిని కాపాడిందని ఆర్మీ తెలిపింది. వరుసగా 10వ రోజూ కూడా అలుపెరగక ఆర్మీ శ్రమిస్తున్నారని, వైద్యసేవల్లో 80 బృందాలు, 21,500మందికి ఇప్పటివరకు చికిత్స చేశామన్నారు. హైదరాబాద్, వడోదర, అమృత్సర్, ఢిల్లీ నుంచి ఆహారపొట్లాలు, మంచినీటి బాటిల్స్ సరఫరా చేస్తున్నామన్నారు. శ్రీనగర్ రహదారి మరమ్మతుకు మరో వారంరోజుల సమయం పడుతుందని, పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు మరో 10 రోజులు పడుతుందని సైన్యం తెలిపారు. -
తిరుమలలో శ్రీవారి వెండి నాణాల కొరత