దాణామృతాన్ని ఆవుకు పెడుతున్న రైతు
విజయనగరం ఫోర్ట్: వేసవిలో పశువులను ఎక్కువగా వేధించే సమస్య పశుగ్రాసం కొరత. మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎండ తీవ్రత ఎక్కువ. ఆ నెలల్లో పశుగ్రాసం దొరకదు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రాయితీపై పశుగ్రాసాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నామని పశుసంవర్థక శాఖ జేడీ వై.సింహాచలం తెలిపారు. ఈ మేరకు రైతులకు పశుసంవర్థకశాఖ ద్వారా రైతులకు అందించే పథకాల గురించి వివరించారు.
సైనేజ్‌గడ్డి..
సైనేజ్‌గడ్డిని బేళ్లు రూపంలో రైతులకు అందిస్తున్నారు. కిలో గడ్డి ధర రూ. 6.92. కానీ రాయితీపై కిలో రూ.2కే అందిస్తున్నారు. ఒక రైతుకు గరిష్టంగా 3600 కేజీల గడ్డి ఇస్తారు. కావాల్సిన వారు సంబంధిత పశువైద్యాధికారిని గాని, గోపాలమిత్రను గాని సంప్రదించాలి. ఈ గడ్డి వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. వారం పాటు పశువులకు అలవాటు చేయాలి.
ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు..
ఈ పథకంలో భాగంగా గడ్డిని సాగు చేసే రైతులకు భూమి లీజు, ఉత్పత్తి వ్యయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు భూమి లీజు చెల్లిస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని ఉపాధి పథకం ద్వారా చెల్లిస్తారు. బహువార్షిక గడ్డి అయితే ఎకరానికి రూ.37వేలు, ఏకవార్షిక గడ్డి అయితే రూ.15వేల చొప్పన అందిస్తారు. గడ్డిని సాగు చేసిన రైతు కిలో గడ్డిని రూ.1కే మిగతా రైతులకు అందించాలి.
దాణామృతం..
దాణామృతం గడ్డిలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని రోజుకి ఒక పశువుకు 10 నుంచి 12 కిలోలు పెట్టాలి. గరిష్టంగా ఒక రైతుకు 3500 కిలోలు ఇస్తాం. కిలో విలువ రూ.12.50 కాగా రాయితీపై రైతులకు రూ.3.50 పైసలకు అందిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment