బోద వ్యాధి చికిత్సలో ఉపయోగించే డైఈథైల్‌కార్బమెజైన్ సిట్రేట్ (డీఈసీ) ట్యాబ్లెట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కి ఉచితంగా సరఫరా చేయడం ప్రారంభించినట్లు ఎసాయ్ ఫార్మాటెక్నాలజీ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ తెలిపింది.
విశాఖపట్నం: బోద వ్యాధి చికిత్సలో ఉపయోగించే డైఈథైల్‌కార్బమెజైన్ సిట్రేట్ (డీఈసీ) ట్యాబ్లెట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కి ఉచితంగా సరఫరా చేయడం ప్రారంభించినట్లు ఎసాయ్ ఫార్మాటెక్నాలజీ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ తెలిపింది. ఈ ట్యాబ్లెట్లు 100 మి.గ్రా.ల మోతాదులో ఉంటాయని వివరించింది. వర్ధమాన దేశాల్లో బోద వ్యాధిని రూపుమాపే దిశగా ఔషధాల సరఫరా చేపట్టినట్లు పేర్కొంది. ముందుగా పపువా న్యూ గినియా, కిరిబాతి, తువాలు, ఫిజీ దేశాలకు ఇవి అందుతాయని వివరించింది. బోదపై పోరాడేందుకు ఉద్దేశించిన లండన్ డిక్లరేషన్‌లో భాగంగా డబ్ల్యూహెచ్‌వోకి 2.2 బిలియన్ల డీఈసీ ట్యాబ్లెట్లు సరఫరా చేయనున్నట్లు ఎసాయ్ తెలిపింది. ప్రస్తుతం 120 మిలియన్ల మంది బోద వ్యాధితో బాధపడుతుండగా, మరో 1.4 బిలియన్ల మందికి ఇది సోకే అవకాశమున్నట్లు సంస్థ వివరించింది.