
సాక్షి,హైదరాబాద్: ‘పొసొకోనజోల్, క్రెసంబా, టొలిసిజిమాబ్, రెమిడెసివిర్, లిపొసొమల్ ఆంఫోటెరిసిన్, ఫ్లావిపిరవిర్, మాల్న్యూపిరవిర్, బరిసిట్రినిబ్.. ఇలా నోరు తిరగని పేర్లను మందులకు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో మీకేమైనా తెలుసా? సరదాగా అడుగుతున్నా’అని మంత్రి కె.తారక రామారావు గురువారం ట్వీట్ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించే కేటుగాళ్ల గురించి 100కు ఫోన్‌చేసి సమాచారమివ్వాలని లేదా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయాలని కోరారు.
బ్లాక్ మార్కెట్ చేసే వారిపై పోలీసులు ఇప్పటివరకు 128 కేసుల నమోదుతో పాటు 258 మందిని అరెస్టు చేశారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం మందులు కావాల్సిన వారు dme@telangana.gov.in లేదాentmcrm @telangana.gov.inల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.