రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో మా గృహం వెనుక ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు మా గృహంలో మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ మాఝి(23)గా గుర్తించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామానికి చెందిన ఈమె ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు.
శుక్రవారం ఉదయం మా గృహం వెనుక కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి బాలేదార్ మాఝి తన కుమార్తెను దారుణంగా తగులబెట్టి హత్య చేశారని పొలీసులకు ఇచ్చిన ఫిర్యాదులొ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment