కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య | woman suicide due to stomach pain | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

Published Tue, Feb 20 2018 5:26 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

woman suicide due to stomach pain - Sakshi

నర్సమ్మ మృతదేహం

పటాన్‌చెరు టౌన్‌ : కడుపునొప్పి తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఉన్నాయి. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన నర్సమ్మ(33) ఇస్నాపూర్‌లో నివాసముంటూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో రోజువారి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పితో బాధపడుతోంది. నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడల్లా టాబ్లెట్లు వేసుకునేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూడా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో లోపలి నుండి గడియ పెట్టుకుని ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రాధమ్మ పోలీసులకు తెల్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement