విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం | Woman jumps From Vijayawada Government Hospital Building | Sakshi
Sakshi News home page

కరోనా బాధితురాలు ఆత్మహత్య

Jul 31 2020 12:30 PM | Updated on Jul 31 2020 1:28 PM

Woman jumps From Vijayawada Government Hospital Building - Sakshi

సాక్షి, విజయవాడ: తీవ్ర మనస్తాపంతో ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి  మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నగరంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న మహిళను వైద్యులు డిశ్చార్జ్‌ చేయగా, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు.

మరోవైపు కుమారుడికి కరోనా సోకడంతో ఓ వృద్ధుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సమీపంలో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వన్‌టౌన్‌ పోలీసులు సకాలంలో స్పందించి అతడిని కాపాడారు. అనంతరం జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మచిలీపట్నంకు చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement