శ్రీకాకుళం రూరల్ : మండల పరిధిలోని తండేవలస ఆర్టీవో కార్యాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.ఇందుమతి (18) అనే యువతి మృతిచెందింది. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన ఇందుమతి ఇటీవలే డిప్లమో పూర్తిచేసింది. తండ్రితో కలిసి శ్రీకాకుళంలో షాపింగ్ చేసేందుకు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయల్దేరారు.
షార్ట్‌కట్ రూట్‌లో తండేవలస నుంచి శ్రీకాకుళం వస్తుండగా ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment