ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. | Kerala Boy And Assam Girl Love Story Ends Tragically In Bengaluru, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..

Published Wed, Nov 27 2024 7:17 AM | Last Updated on Wed, Nov 27 2024 10:04 AM

Kerala boy Assam girl love story

ప్రియుడే హంతకుడు?   

బనశంకరి: అపార్టుమెంట్‌లో అసోం యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. యువతి మాయ గోగాయ్‌ (26) హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అదే ప్రాంతంలో  నివసిస్తోంది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం మాయ, ప్రియుడు ఆరవ్‌ అర్ని ఇందిరానగరలో ఓ సర్వీసు అపార్టుమెంటులో ఫ్లాటు బుక్‌ చేసుకుని వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. 

24న ఆదివారం మాయ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్య తర్వాత హంతకుడు సిగరెట్‌ తాగుతూ సోమవారమంతా మృతదేహంతోనే కాలం గడిపాడు. మంగళవారం ఉదయం క్యాబ్‌బుక్‌ చేసుకుని ఉడాయించాడు. తరువాత అపార్టుమెంటు సిబ్బంది శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 

మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాలని ప్లాన్‌ చేసి ఉంటాడని, చివరకు ఆ ప్రయత్నం విరమించుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువతిని  ఆరవ్‌ ఆర్నీ ఊపిరాడకుండా చేసి చాకుతో పొడిచి హత్యచేశాడు. చేతులను కూడా కసితీరా పొడిచాడు.  పోలీసులు మృతదేహాన్ని  శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరవ్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement