
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. సకాలంలో వరకట్నం డబ్బులు సమకూరలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనమిది. తంగళ్లపల్లికి చెందిన అత్తారి లక్ష్మి–గిరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు శైలజ(19) సంతానం. ఏడేళ్ల క్రితమే భర్త గిరి అనారోగ్యంతో మృతి చెందాడు.
ఇటీవల కూతురు శైలజకు కొడిమ్యాల మండలం దమ్మాయిపేటకు చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. రూ.4 లక్షలు వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో తల్లి పడుతున్న కష్టాలను చూడలేక శైలజ మనోవేదనకు గురైంది. ఈక్రమంలోనే బుధవారం ఉదయం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment