ప్రతీకాత్మక చిత్రం
నాదెండ్ల: బొడ్డుపేగు తింటే పిల్లలు పుడతారనే మూఢ నమ్మకానికి ఓ వివాహిత బలైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 13వ తేదీన వేరే మహిళ ప్రసవించడంతో బొడ్డుపేగు తెచ్చిన కుటుంబ సభ్యులు సన్నిత చేత తినిపించారు.
చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. ఇంటి నుంచి తీసుకెళ్లి..
రెండు రోజుల తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. శనివారం సన్నిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే తన కుమార్తెను అత్తింటి వారు తరచూ వేధిస్తూ ఆమె చేత విషపదార్థం తినిపించి హత్య చేశారంటూ సన్నిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment