భద్రాచలంఅర్బన్: పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన రావూరి అరుణ (35)ను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ హైదరబాద్‌లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 14వ తేదీన అరుణ.. తనకు కడుపులో నొప్పి వస్తోందని, ఆమె సొంత గ్రామం అయిన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది.
ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు (అరుణ భర్త కృష్ణార్జున్‌రావు మేనల్లుడు)తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు అదే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువుపోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు.
ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు. సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమి లి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీర ను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసి నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని వారు కన్నీటిపర్యంతమ య్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.
హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్!
Published Tue, Apr 18 2023 10:07 AM | Last Updated on Tue, Apr 18 2023 10:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment