హైదరాబాద్, సాక్షి: భరత్ నగర్ ఫ్లైఓవర్ పై ఘోరం జరిగింది. వాటర్ ట్యాంక్ ఢీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సునీతగా పోలీసులు ధృవీకరించారు.
సునీత స్వస్థలం కర్నూల్ శ్రీశైలం. నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. గురువారం ఉదయం కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా.. ఓ వాటర్ ట్యాంక్ దూసుకొచ్చింది. వెనుక నుంచి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.
యాక్సిడెంట్‌ను చూసేందుకు అటుగా వెళ్లే వాహనదారులు ఆగిపోవడంతో.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment