
మైసూరు : కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హొసకోటెలో చోటు జరిగింది. 12 సంవత్సరాల క్రితం మైసూరు తాలూకా బొమ్మనహళ్లికి చెందిన విజయలక్ష్మి(35)ని నంజనగూడు తాలూకాలోని హొసకోటెకు చెందిన హరీష్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో బంగారం కట్నంగా సమర్పించారు.
అయితే అదనపు కట్నం తేవాలని భర్తతోపాటు అత్త మల్లిగమ్మ, మామ మహాదేవమూర్తి, మరిది రాఘవేంద్రలు వేధించేవారు. దీంతో పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినప్పటికీ వేధింపులు ఆపలేదు. దీంతో బిళిగెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా పంచాయితీ చేశారు. అయినా భర్త, అతని కుటుంబ సభ్యులు పద్దతి మార్చుకోలేదు. వేధింపులు కొనసాడంతో విజయలక్ష్మి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో బిళిగెరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment