సిరిసిల్ల ఈఎస్‌ఐలో వసతులు కల్పించాలి
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు విన్నవించిన పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ: సిరిసిల్లలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్లక్ష్యానికి గురవుతోందని, సిబ్బంది, మౌలిక వసతుల కొరత వేధిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న కార్మికులు, చిరుద్యోగులకు వరంగా ఉన్న ఆస్పత్రిని అభివృద్ధి చేస్తే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన దత్తాత్రేయ... ఆస్పత్రిని 100 పడకలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. సిబ్బంది భర్తీ చేసేందుకు, మౌలిక వసతుల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.