
అలాంటి వాళ్లను వదలకూడదంటూ బెంగాల్ మాజీ మంత్రి ముఖం పైనే చెప్పులు విసిరిన మహిళ. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్‍మెంట్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది.
ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది.
(చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్‌లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!)