hurls
-
మెడికల్ చెకప్‌కి వెళ్లిన ఛటర్జీకి అవమానం!... ముఖం మీదే చెప్పులు విసిరి.....
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది. ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది. (చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!) -
ప్రధాని కాన్వాయ్‌పై పూలకుండీ
రోడ్డుపై విసిరేసి పారిపోయిన మహిళ ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని రాజ్‌పథ్.. బుధవారం మధ్యాహ్నం 2.10 గంటలు.. సౌత్‌బ్లాక్ నుంచి బయల్దేరేందుకు ప్రధాని కాన్వాయ్ రెడీ అయింది.. పోలీసులు ఆ దారిని తమ అధీనంలోకి తీసుకున్నారు.. రోడ్లపై ఎక్కడివారిని అక్కడే ఆపేశారు.. ఇంతలో ఓ మహిళ ఉన్నట్టుండి పూలకుండీ తీసి రోడ్డుపై విసిరికొట్టి అక్కడ్నుంచి పారిపోయింది! కొద్ది సెకన్ల తర్వాత అదే మార్గం గుండా ప్రధాని కారు వెళ్లింది!! ఈ హఠాత్పరిణామం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వెంటనే తేరుకున్న భద్రతాసిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. ఆ మహిళను ఉత్తరప్రదేశ్‌లోని షాహిబాబాద్కు చెందిన నీనా రావల్‌గా గుర్తించారు. ప్రధాని కాన్వాయ్ నేపథ్యంలో విజయ్‌చౌక్ వద్ద జనాన్ని ఆపారు. వారిలో నీనా ముందు వరుసలో ఉన్నారు. ‘కాస్త పక్కకు తప్పుకోవమ్మా..’ అని భద్రతా సిబ్బంది గద్దించడంతో ఆమె ఆగ్రహంతో మూడు బ్యారికేడ్లను తోసేసింది. తర్వాత రైజినా హిల్స్ వైపు పరుగెత్తి అక్కడే ఉన్న ఓ పూలకుండీ తీసి రోడ్డుపై విసిరేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రధాని కాన్వాయ్ వెళ్లింది. విజయ్‌చౌక్ వద్దే ఆమెను అదుపులోకి తీసుకొని ఉండాల్సిందని డీసీపీ జతిన్ నర్వాల్ పేర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించామని, అనంతరం ప్రశ్నించామని డీసీపీ వివరించారు. తన ఊరిలో కొందరు దుండగులు తన మార్కుల పత్రాన్ని చించేసి, వేధించారని నీనా పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు పేర్కొంది. ఆ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారో తెలుసా అని అడగ్గా తెలియదని సమాధానమిచ్చింది. ఎవరిని కలిసేందుకు వచ్చావని పోలీసులు ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. వాంగ్మూలం తీసుకుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. -
ప్రియుడిపై యాసిడ్ పోసి పారిపోయింది
బాలియా: మహిళలపై అత్యాచారాలకు, హింసకు పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడిపై జరిగిన యాసిడ్ దాడి ఘటన సంచలనం సృష్టించింది. తనతో సంబంధాన్ని ఏర్పచుకున్న 20ఏళ్ల రాజ్‌కుమార్ పాల్ .. పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఈ దారుణానికి ఒడిగట్టింది. గురువారం రాత్రి యూపీలోని జామ్ గ్రామంలో ఆ ఘటన చోటు చేసుకుందని సీనియర్ పోలీసు అధికారి సందీప్ సింగ్ వెల్లడించారు. యాసిడ్ దాడితో తీవ్ర గాయాల పాలైన రాజ్ కుమార్ పాల్ ను స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం తరలించారు. బాధితుని పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని వారణాసిలోని మరో ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుని తల్లి సదరు యువతిపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ యువతి పరారీలో ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.