సనత్‌నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ) నాచారం ప్రాంతానికి తరలిపోయింది.ప్రస్తుతం ఇక్కడి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంగళవారం.
అమీర్‌పేట, న్యూస్‌లైన్: సనత్‌నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ) నాచారం ప్రాంతానికి తరలిపోయింది.ప్రస్తుతం ఇక్కడి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి నాచారంలో విధులు నిర్వహించాలని అధికారికంగా సోమవారం ఆదేశాలు జారీచేశారు. కార్మికశాఖ నుంచి శనివారం అధికారికంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆసుపత్రిని తరలించిన పక్షంలో అందరు ఉద్యోగులను ఒకేచోటికి మార్చాలని యూనియన్ నాయకులు, వైద్యులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఈ నేపధ్యంలో ఆసుపత్రి అధికారులు విషయాన్ని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని అందరినీ ఒకేచోటకు పంపుతున్నట్లు తెలిపి.. ఆగస్టు 29లోపు సిబ్బంది నాచారం ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కొనసాగుతున్న దాదాపు 10 విభాగాల్లోని ఉద్యోగులు విభాగానికి ఇద్దరు చొప్పున 27 తేదీ నుంచి నాచారం వెళ్లి విధులు నిర్వర్తించాలని పేర్కొంటూ ఓ జాబితాను తయారుచేసి ఉద్యోగులకు అందచేశారు. కాగా ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు మిగిలిన సిబ్బంది తరలింపునకు నెలరోజులు గడువు ఇచ్చారు.
డిస్పెన్సరీ స్థాయి నుంచి 500 పడకల ఆసుపత్రిగా..
సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రికి సు మారు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. కేంద్ర కార్మికశాఖ రాష్ట్రంలోనే మొట్టమొదట 1965లో సనత్‌నగర్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసింది. అప్ప ట్లో ఇక్కడ కేవలం పదిమంది ఉద్యోగులు మాత్రమే పనిచేసేవారు. పరిశ్రమలు పెరగడంతో 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. ప్రస్తుతం 500 పడకల ఆసుపత్రిగా ఎదిగింది. ఇక్కడ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులతో కలి సి సుమారు 900 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ చారిత్రక ఆసుపత్రి మం గళవారం నుంచి ఈఎస్‌ఐ కార్పొరేషన్ టీచింగ్ ఆసుపత్రిగా కొనసాగనుంది.