Lady Don Anuradha And Gangster Kala Jathedi Love Story In Telugu - Sakshi
Sakshi News home page

Anuradha And Kala Jathedi Love Story: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్‌ లవ్‌ స్టోరీస్‌!

Published Wed, Aug 16 2023 1:48 PM | Last Updated on Thu, Aug 17 2023 3:07 PM

Lady don Anuradha and Kala Jathedi Love Story - Sakshi

ఆమెది ఎంత అందమైన ముఖమో.. అంతే పదునైన ఆలోచనలు ఆమె సొంతం. అయితే ఆమె ఈ అందాన్ని, తెలివితేటలను నేర ప్రపంచం కోసం వినియోగించింది. డాన్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఆ తరువాత నేర ప్రపంచంలోని ఇతర నేరస్తులతో కలివిడిగా తిరిగేవరకూ సాగింది. ఈ కథ రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరిది. ఆమెను జనం లేడీ డాన్‌ అని, రివాల్వర్‌ రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆమె రాజస్థాన్‌లో పెద్ద గ్యాంగ్‌ స్టార్‌గా పేరొందింది. దేశంలోని అతిపెద్ద గ్యాంగ్‌ లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌తో ఆమెకు నేరుగా సంబంధాలున్నాయి. 

పండితుని ఇంట పుట్టి..
రాజస్థాన్‌లోని సీకర్‌ జిల్లాలో అనురాధ చౌదరి జన్మించింది. తల్లి చనిపోవడంతో తండ్రే ఆమెను పెంచిపెద్ద చేశాడు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. కుమార్తెను పెద్ద చదువులు చదించాలని కలలుగనేవాడు. అనురాధ కూడా చిన్నతనం నుంచే చదువుపై దృష్టి నిలిపింది. రాజస్థాన్‌లోని ఒక యూనివర్శిటీలో బీటెక్‌ పూర్తిచేసింది. అయితే కాలేజీ రోజుల్లో ఆమె దీపక్‌ మింజాతో ప్రేమలో పడింది.​ 

దీపక్‌తో ప్రేమ పెళ్లి
దీపక్‌తో పెళ్లికి అనురాధ తండ్రి విముఖత వ్యక్తం చేశాడు. అయితే ఆమె తండ్రి మాట కాదని దీపక్‌ను వివాహం చేసుకుంది. కుటుంబంతో అనుబంధం తెంచుకుంది. అనురాధ, దీపక్‌లు కుటుంబ పోషణకు షేర్‌ ట్రేడింగ్‌ పని మొదలుపెట్టారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చుట్టుపక్కల వారిని ప్రోత్సహించేవారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగానే సాగింది. ఆ తరువాత వ్యాపారంలో సమస్యలు తలెత్తడంతో అనురాధ జీవితమే మారిపోయింది. డబ్బు సంపాదనకు అనురాధ తప్పుడు మార్గాలను ఆశ్రయించడం మొదలు పెట్టింది. 

అనురాధకు ఆనంద్‌పాల్‌ ఫిదా
ఆ సమయంలో రాజస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌పాల్‌ ‍ప్రభావం అధికంగా ఉండేది. అనురాధ.. ఆనంద్‌పాల్‌ను కలుసుకుంది. అమె అందమైనది, తెలివైనది కావడంతో ఆనంద్‌పాల్‌ ఆమెతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కిడ్నాప్‌లు మొదలైన నేరాలలో ఆనంద్‌పాల్‌ పేరు ప్రముఖంగా వినిపించేది. అనురాధ కూడా ఆనంద్‌ పాల్‌ గ్యాంగ్‌ సభ్యురాలిగా మారింది. భర్త దీపక్‌కు దూరం అయ్యింది. ఆనంద్‌పాల్‌ను వివాహం చేసుకుందని చెబుతారు.
ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే!

ఆనంద్‌పాల్‌కు ఆంగ్లం నేర్పిన అనురాధ
ఆనంద్‌పాల్‌ అనురాధకు రివాల్వర్‌ వినియోగించడంతో పాటు వివిధ నేరాలలో శిక్షణ అందించాడు. అదేసమయంలో అనురాధ ఆనంద్‌పాల్‌కు ఆంగ్ల భాషలో సంబాషించడాన్ని నేర్పించింది. ఆనంద్‌పాల్‌ అనురాధ అడుగులకు మడుగులొత్తేవాడని అంటారు. 2017లో ఆనంద్‌పాల్‌ పోలీసులు జరిపిన ఒక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆ సమయంలో అనురాధ రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చి, ఆనంద్‌పాల్‌ గ్యాంగ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. 

కాలా జఠెడిపై కన్ను వేసి..
అనురాధ తన గ్యాంగ్‌ ప్రభావాన్ని మరింతగా పెంచుకునేందుకు లారెన్స్‌ బిష్ణోయితో దోస్తీ మొదలుపెట్టింది. రాజస్థాన్‌లో మారణాయుధాల అక్రమ సరఫరాను అనురాధ గ్యాంగ్‌ పర్యవేక్షించేది. బిష్టోయి గ్యాంగ్‌తో జతకట్టిన అనురాధ కొంతకాలానికి కాలా జఠెడితో స్నేహం ప్రారంభించింది. కాలా జఠెడి.. బిష్ణోయి గ్యాంగ్‌ కోసం పనిచేసేవాడు. పాక్‌ నుంచి ఆయుధాల సరఫరాను జఠెడీ చూసుకునేవాడు. అనురాధ, కాలా జఠెడీ కలసివుండసాగారు. వారు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని కొందరు  చెబుతుంటారు. తరువాత వీరిద్దరూ మారు పేర్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండసాగారు. అయితే 2021లో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. 
ఇది కూడా చదవండి: ‘ప్రతిరోజూ నా అండర్‌వేర్‌ చెక్‌ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement