
బాబుతో సింగపూర్ వెళ్లనున్న సిఎం రమేష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సింగపూర్ వెళ్లేందుకు మరో ఇద్దరికి అనుమతి ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్తోపాటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనురాధలు కూడా సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ఈ నెల 11 నుంచి 14 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు.
ఆయనతోపాటు మరో 12 మంది సభ్యుల బృందం సింగపూర్ వెళ్లనుంది. అయితే ఆ బృందంలో సీఎం రమేష్, అనురాధలకు చోటు కల్పించడంతో బృందం సభ్యుల సంఖ్య 14కి చేరింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో మంగళవారం సింగపూర్ వెళ్లనున్నారు. అందుకు సంబంధించి జీవోను సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.