4 బంతుల్లో 4 వికెట్లు... | Four Wickets In Four Balls For Germany Player Anuradha | Sakshi
Sakshi News home page

4 బంతుల్లో 4 వికెట్లు...

Published Sat, Aug 15 2020 2:22 AM | Last Updated on Sat, Aug 15 2020 2:22 AM

Four Wickets In Four Balls For Germany Player Anuradha - Sakshi

లోయర్‌ ఆస్ట్రియా: మహిళల టి20 క్రికెట్‌లో అరుదైన ఘనత నమోదైంది. జర్మనీకి చెందిన అనురాధ దొడ్డబళ్లాపూర్‌ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 18 సార్లు ‘హ్యాట్రిక్‌’ నమోదైనా... ఇలా ఒక బౌలర్‌ 4 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. ఆస్ట్రి యాతో జరిగిన మ్యాచ్‌లో అనురాధ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో 2,3, 4, 5 బంతులకు వరుస వికెట్లు తీసింది.  ఈ మ్యాచ్‌లో ఆమె బౌలింగ్‌ గణాంకాలు 3–2–1–5గా ఉన్నాయి. ఈ దెబ్బకు ఆస్ట్రియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 61 పరుగులే చేయగలిగింది. అంతకు ముందు 20 ఓవర్లలో 198 పరుగులు చేసిన జర్మనీ... 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement