గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ మహిళ అదృశ్యమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని వాంబే క్వార్టర్స్ నుంచి కొండపాక అనురాధ (40) అనే గృహిణి అదృశ్యమైంది.
కొంతకాలంలో మతిస్థిమితం లేకపోవడంతో ఆమె ఈనెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె సోదరుడు కె. నారాయణమూర్తి గాంధీనగర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ ఆచూకీ తెలిసిన వారు.