
దివ్య, చామంతి
హైదరాబాద్: నారాయణగూడలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు చామంతి (18), దివ్య (20)లు శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కాలేజీ ముగిసిన తర్వాత తమ పిల్లలు ఇంటికి రాలేదని కాలేజీ యాజమాన్యానికి తల్లిదండ్రులు చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment