దీపిక
బంజారాహిల్స్: ‘నాన్నా.. నాకు హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేదు. నేను అనుకున్నది వేరు.. నువ్వు చేస్తోంది వేరు. నాకు నచ్చింది నన్ను చేయనివ్వడం లేదు. బలవంతంగా హాస్టల్‌కు వెళ్లి, ఇష్టం లేకుండా చదవలేను. నా లైఫ్ నాకు నచ్చినట్లు లేదు. ప్రతి దానికి అనుమానిస్తున్నారు. ఫ్రీడమ్ లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా పంపరు. కష్టంగా ఉంది నాన్నా..’ అంటూ ఓ విద్యార్థిని లేఖ రాసి, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విద్యార్థిని కోసం గాలిస్తున్నారు.
ఫిలింనగర్‌లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్‌లో నివసించే అప్పారావు అపోలో ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్. ఆయన కూతురు దీపిక(20) ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ కోసం గురుకులంలో చేర్చాలని తండ్రి ఫీజు కూడా చెల్లించాడు. ఈ నెల 20న హాస్టల్‌లో చేరాల్సి ఉంది. ఇంతలోనే తనకు ఇష్టం లేని పనులు చేయిస్తున్నారంటూ దీపిక సోమవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె రాసిన లేఖను తండ్రి పోలీసులకు అందజేశాడు. ‘నేను ఒకటి అనుకుంటే.. మీరు ఒకటి చేస్తున్నారు. నేను చనిపోవాలని డిసైడ్ అయ్యాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. కేవలం నా లైఫ్’ అంటూ ఆమె లేఖలో పేర్కొనడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నా లైఫ్ నాకు నచ్చినట్లు లేనందునే చనిపోతున్నాను. నేను కూడా మనిషినే డాడీ’ అని లేఖరో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment