ఇంటర్వ్యూకు వెళ్లిన యువతి అదృశ్యం
Published Mon, Oct 3 2016 8:04 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: ఇంటర్వ్యూకు వెళుతున్నానని ఇంటి నుంచి బయటికి వచ్చిన యువతి అదృశ్యమైంది. హైదరాబాద్ లో కలకలం రేపుతోన్న ఈ సంఘటనపై సోమవారం కాప్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసుల కథనం ప్రకారం..
నగరంలోని కాప్రా ప్రాంతానికి చెందిన పేముల ఎలిజబెత్ మాధురి(28) అనే యువతి సెప్టెంబర్ 22 న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇంటర్వ్యూకు వెళుతున్నానని చెప్పిన యువతి జాడ 10 రోజులైనా తెలియకపోవడం ఆమె తల్లి ఎస్తేర్ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement