ఈవ్‌టీజింగ్‌పై అప్రమత్తంగా ఉండాలి
షీ టీం జిల్లా ఇన్‌చార్జి అనురాధ
నకిరేకల్ : ఈవ్‌టీజింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని షీటీం జిల్లా ఇన్‌చార్జి, నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అనురాధ సూచించారు. నకిరేకల్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం జరిగిన షీటీం అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలికలు మనోధైర్యంతో ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలి గినా షీ టీం దృష్టికి తీసుకురావాలని సూ చించారు. ఫిర్యాదు చేయడానికి వాట్సప్ సెల్‌న నంబర్ 9963393970, ఫోనరుుతే 100కు డయల్ చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్‌ఐ నర్సింహరావు, బాలికల కళాశాల వసతి గృహం అధికారి భాగ్యలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.