ఘనంగా బతుకమ్మ సంబరాలు
Published Wed, Oct 5 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్‌నగర్‌రూరల్: బతుకమ్మ పండగను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా అని చెప్పుకోవచ్చని రాష్ట్రఉపాధ్యాయ పండితపరిషత్ రాష్ట్రఅధ్యక్షురాలు అనురాధ, జాతీయఅథ్లెట్ శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని భాగ్యనగర్‌కాలనీలోగల క్రిష్ణవేణి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రఫత్‌సుల్తానా ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయునిలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆట లు ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ పండగలలో మతసామరస్యాన్ని చాటు తూ పం డగ అనుభూతిని ఆస్వాదించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎండి.వసీం, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఫరూఖ్‌నగర్ మండలపరిధిలోని బూర్గుల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ సుమంత్, దినెష్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మనపండుగల విశిష్టతను భావితరాలకు అ ందిస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థినులు, ఉపాధ్యాయునులు బతుకమ్మ ఆట, పాటలతో చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్, సుధాకర్, క్రిష్ణయ్య, చంద్రకళావతితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తూరు: పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎంపీడీఓ జ్యోతి తెలిపారు. మండలంలో మంగళవారం తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను తీరొక్క పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జాగృతి నియోజకవర్గ కన్వీనర్ గడ్డం సత్యనారాయణ, రాజ్యలక్ష్మీ, సర్పంచ్‌లు జగన్, కావలికృష్ణ, కొమ్ముకృష్ణ, ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్, జాగృతి సభ్యులు జ్ఞానప్రసూన, శైలజ, కృష్ణవేణి, సరళ, యాదమ్మ, జ్యోతి, స్థాని క మహిళలు, ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement