కామారెడ్డి, న్యూస్‌లైన్: కామారెడ్డి పట్టణానికి సమీపంలో అడ్లూర్ అర్శ గురుకులం వద్ద రైలు పట్టాలపై కోటగిరి మండలం చేతన్‌నగర్‌కు చెందిన అనురాధ (15), జ్ఞానేశ్వర్(18) ఆత్మహత్య కు పాల్పడడం కలకలం రేపింది. అనురాధ గత ఏప్రిల్‌లో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతిలోకి అడుగు పెట్టాల్సి న సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన జ్ఞా నేశ్వర్ జీవితంలో ఉన్నత లక్ష్యం కోసం ముం దుకు సాగేందుకు ప్రయత్నించకుండా ప్రేమ మైకంలో పడిపోయి తనతో పాటు అనురాధ ను వెంట తీసుకెళ్లాడు. ఈ ఇద్దరి వయస్సు, వారి పరిస్థితిని చూస్తే ఆకర్షణలకు లోనై పెద్దలకు విషయం తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో ఇంటి నుంచి బయటపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది.
గతంలో కూడా
గత ఏడాది కామారెడ్డి పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీరజ (15) ఒంటిపై కి రోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. రెండు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. ఈ అ మ్మాయి ఇంటికి సమీపంలో జార్ఖండ్ రాష్ట్రాని కి చెందిన టింకు అనే యువకుడు నివసించేవాడు. నీరజ అతడి ఆకర్షణలో పడిపోయిం ది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు సదరు యువకున్ని మందలించారు. దీంతో నీరజ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. నీరజ మరణం ఆమె కుటుంబ సభ్యులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. చదువుకోవడానికి వచ్చిన ఓ యువతి కా మారెడ్డి పట్టణంలోని ఓ హాస్టల్‌లో ఉండేది.
ఓ రోజు హాస్టల్‌కు రాకపోవడంతో నిర్వాహకులు ఆమె కుటుం బ సభ్యులకు సమాచారమందించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తరువాత పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా ఆ చూకీ కనిపెట్టారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిప్ చేసిన ఓ యువకుని ప్రే‘మాయ’లో పడి అ దృశ్యమైనట్టు గుర్తించారు. తరువాత అమ్మాయి తల్లి చెంతకు చేరడంతో కథ సుఖాంతమైంది. మూడేళ్ల క్రితం కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో ఓ ఇం ట్లో అద్దెకున్న యువకుడు ఇంటర్ చదివే ఇంటి యజమాని కూతురుని ప్రేమపేరుతో వేధించి గొంతుకోసి చంపాడు. ఆ యువకుడు జైలుపాలవగా, విచారణ జరిపిన కోర్టు అతనికి జీవితఖైదు విధించింది.
క్రమశిక్షణ కావాలి
నిత్యం ఎక్కడో ఒక చోట యువతో, యువకుడో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కౌమారం, యవ్వన దశలలో యువత దారితప్పకుండా క్రమ శిక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు పేర్కొంటున్నారు. జీవిత లక్ష్యం నిర్దేశించుకు నే విధంగా ప్రోత్సహించాలని, వారికి సానుకూల దృక్ఫథాన్ని అవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని జూచిస్తున్నారు. తద్వారా ఇతర ఆలోచనలు రాకుండా నిరోధించవచ్చని పేర్కొంటున్నారు.
‘టీనేజ్’ విలవిల!
Published Sun, May 25 2014 2:45 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement