gnaneswar
-
.. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్!!
.. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్!! -
టీ–టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్
నిజాంపేట్, షాద్‌నగర్: మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను తెలంగాణ తెలుగు దేశం పార్టీ(టీ–టీడీపీ) అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బక్కని నర్సింహులును పొలిట్‌బ్యూరోకి తీసుకోవడంతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీగా, టీడీపీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. టీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో స్వతంత్ర ఎమ్మెల్సీ పదవిని చేపట్టారు. 2007లో మన పార్టీని స్థాపించిన కాసాని జ్ఞానేశ్వర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పొత్తుపై కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మె ల్యే ఎన్నికల బరిలో నిలబడి 23,430 ఓట్లు సాధించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నుంచి బక్కని నర్సింహులు నియామక పత్రాన్ని అందుకున్నారు. -
‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!
అతనికి చెట్లంటే ప్రాణం. పర్యావరణ ప్రేమికుడు. ఏటా వందల సంఖ్యలో మొక్కలు నాటుతాడు. అడవులను పెంచే ఉద్దేశంతో విత్తన బంతులు తయారుచేసి చెట్లు లేనిచోట విసురుతాడు. చిన్న మొక్కనూ ఎండనివ్వడు. పెద్ద చెట్లను నరకనివ్వడు. అతనే సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్తాపూర్‌కు చెందిన జ్ఞానేశ్వర్. ఇటీవల తన సొంత గ్రామంలో గ్రామస్తులు పెద్ద రావిచెట్టును నరికివేశారు. అది తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పెద్ద గుంత తవ్వి మళ్లీ ఆ చెట్టును నాటించాడు. రోజూ నీళ్లుపోస్తూ దానికి ప్రాణం పోస్తున్నాడు. ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పర్యావరణానికి హాని జరుగుతుందని.. చెట్లను నరకొద్దని సూచిస్తున్నాడు. -
సమస్యలపై ఉద్యమ కార్యాచరణ
కేంద్ర సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముకరంపుర: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా నాలుగోతరగతి ఉద్యోగులను నియమించి ఉన్న ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం బకాలతోపాటు వేతన సవరణ ద్వారా ఉద్యోగ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాలుగో తరగతి ఉద్యోగులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రంలో పనిచేస్తున్న వారిని ఇక్కడికి రప్పించాలన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు కె.రామస్వామిని సన్మానించారు. సమావేశంలో కేంద్ర సంఘం నాయకులు విజయలక్ష్మి, ఆఫీసు కార్యదర్శి తొర్తి నర్సయ్య, రాష్ట్ర సంఘం నాయకులు రాజేందర్, ధన్‌రాజ్, ఖాదర్, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కార్యదర్శి కొమురయ్య, పబ్లిసిటీ సెక్రటరీ బండారి భూమేశ్, పట్టణ అ«ధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రాంనగర్ : నాలుగో తరగతి ఉ ద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ నాలుగో త రగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్ కోరారు. సోమవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన నాలుగో తరగతి ఉద్యోగులకు వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు మాటూరి అశోక్, బాల ఈశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.లింగయ్య, ఉపాధ్యక్షులు జి.మారయ్య, ఉస్మాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రాజయ్య, సైదులు, శంకర్, లిం గయ్య, నిరంజన్, వెంకటేశ్వర్లు. రఘుపతి పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాజమల్లయ్య రాంనగర్ : తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడిగా జె.రాజమల్లయ్యను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. జ్ఞానేశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జిల్లా అధ్యక్షుడు భిక్షమయ్యను తొలగించి ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజమల్లయ్యను అందరి సమక్షంలో నియమించామన్నారు. ఈ మేరకు రాజమల్లయ్యను అధ్యక్షుడిగా గుర్తించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. -
‘టీనేజ్’ విలవిల!
కామారెడ్డి, న్యూస్‌లైన్: కామారెడ్డి పట్టణానికి సమీపంలో అడ్లూర్ అర్శ గురుకులం వద్ద రైలు పట్టాలపై కోటగిరి మండలం చేతన్నగర్కు చెందిన అనురాధ (15), జ్ఞానేశ్వర్(18) ఆత్మహత్య కు పాల్పడడం కలకలం రేపింది. అనురాధ గత ఏప్రిల్‌లో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతిలోకి అడుగు పెట్టాల్సి న సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన జ్ఞా నేశ్వర్ జీవితంలో ఉన్నత లక్ష్యం కోసం ముం దుకు సాగేందుకు ప్రయత్నించకుండా ప్రేమ మైకంలో పడిపోయి తనతో పాటు అనురాధ ను వెంట తీసుకెళ్లాడు. ఈ ఇద్దరి వయస్సు, వారి పరిస్థితిని చూస్తే ఆకర్షణలకు లోనై పెద్దలకు విషయం తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో ఇంటి నుంచి బయటపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. గతంలో కూడా గత ఏడాది కామారెడ్డి పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీరజ (15) ఒంటిపై కి రోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. రెండు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. ఈ అ మ్మాయి ఇంటికి సమీపంలో జార్ఖండ్ రాష్ట్రాని కి చెందిన టింకు అనే యువకుడు నివసించేవాడు. నీరజ అతడి ఆకర్షణలో పడిపోయిం ది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు సదరు యువకున్ని మందలించారు. దీంతో నీరజ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. నీరజ మరణం ఆమె కుటుంబ సభ్యులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. చదువుకోవడానికి వచ్చిన ఓ యువతి కా మారెడ్డి పట్టణంలోని ఓ హాస్టల్లో ఉండేది. ఓ రోజు హాస్టల్‌కు రాకపోవడంతో నిర్వాహకులు ఆమె కుటుం బ సభ్యులకు సమాచారమందించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తరువాత పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా ఆ చూకీ కనిపెట్టారు. ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసిన ఓ యువకుని ప్రే‘మాయ’లో పడి అ దృశ్యమైనట్టు గుర్తించారు. తరువాత అమ్మాయి తల్లి చెంతకు చేరడంతో కథ సుఖాంతమైంది. మూడేళ్ల క్రితం కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో ఓ ఇం ట్లో అద్దెకున్న యువకుడు ఇంటర్ చదివే ఇంటి యజమాని కూతురుని ప్రేమపేరుతో వేధించి గొంతుకోసి చంపాడు. ఆ యువకుడు జైలుపాలవగా, విచారణ జరిపిన కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. క్రమశిక్షణ కావాలి నిత్యం ఎక్కడో ఒక చోట యువతో, యువకుడో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కౌమారం, యవ్వన దశలలో యువత దారితప్పకుండా క్రమ శిక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు పేర్కొంటున్నారు. జీవిత లక్ష్యం నిర్దేశించుకు నే విధంగా ప్రోత్సహించాలని, వారికి సానుకూల దృక్ఫథాన్ని అవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని జూచిస్తున్నారు. తద్వారా ఇతర ఆలోచనలు రాకుండా నిరోధించవచ్చని పేర్కొంటున్నారు.