
అతనికి చెట్లంటే ప్రాణం. పర్యావరణ ప్రేమికుడు. ఏటా వందల సంఖ్యలో మొక్కలు నాటుతాడు. అడవులను పెంచే ఉద్దేశంతో విత్తన బంతులు తయారుచేసి చెట్లు లేనిచోట విసురుతాడు. చిన్న మొక్కనూ ఎండనివ్వడు. పెద్ద చెట్లను నరకనివ్వడు. అతనే సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్‌కు చెందిన జ్ఞానేశ్వర్.
ఇటీవల తన సొంత గ్రామంలో గ్రామస్తులు పెద్ద రావిచెట్టును నరికివేశారు. అది తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పెద్ద గుంత తవ్వి మళ్లీ ఆ చెట్టును నాటించాడు. రోజూ నీళ్లుపోస్తూ దానికి ప్రాణం పోస్తున్నాడు. ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పర్యావరణానికి హాని జరుగుతుందని.. చెట్లను నరకొద్దని సూచిస్తున్నాడు.