నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రాంనగర్ : నాలుగో తరగతి ఉ ద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ నాలుగో త రగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్ కోరారు. సోమవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన నాలుగో తరగతి ఉద్యోగులకు వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు మాటూరి అశోక్, బాల ఈశ్వర్, జిల్లా
అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.లింగయ్య, ఉపాధ్యక్షులు జి.మారయ్య, ఉస్మాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రాజయ్య, సైదులు, శంకర్, లిం గయ్య, నిరంజన్, వెంకటేశ్వర్లు. రఘుపతి పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాజమల్లయ్య రాంనగర్ : తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడిగా జె.రాజమల్లయ్యను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. జ్ఞానేశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జిల్లా అధ్యక్షుడు భిక్షమయ్యను తొలగించి ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజమల్లయ్యను అందరి సమక్షంలో నియమించామన్నారు. ఈ మేరకు రాజమల్లయ్యను అధ్యక్షుడిగా గుర్తించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.