Ram nagar
-
హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్
సాక్షి, హైదరాబాద్: అసలే ఆకలి. అందునా ఆర్డర్‌చేసిన చికెన్ బిర్యానీ రానే వచ్చింది. ఇంకేముంది! ఒక పట్టుపట్టడమే అనుకున్నాడా వ్యక్తి. కానీ, ఆబగా సగం బిర్యానీ తిన్న తర్వాత పగవాడికీ రాని పరిస్థితి అతనికి తలెత్తింది. బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. యాక్! అనుకుంటూ తిన్న బిర్యానీ వాంతి చేసుకున్నాడు. ఇది ఎక్కడో ఏ మారుమూలో జరగలేదు. మన హైదరాబాద్‌లో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్లో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: వికారాబాద్: పెళ్లయిన 20 రోజులకే.. -
రామ్‌నగర్ చెపల మార్కెట్.. కరోనా అంటే లెక్కచేయని జనం
-
విద్యార్థినిపై అధ్యాపకుల అనుచిత ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: ఈవెంట్ పేరిట ఇంటికి పిలిపించుకొని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీ ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంనగర్‌లోని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన ఓ విద్యార్థిని ఫైనలియర్ చదువుతోంది. జనవరి 24న ఈవెంట్ ఉందని చెప్పడంతో ఆమె తన సోదరుడిని తీసుకొని మాదాపూర్ చందానాయక్ తండాలోని వైస్ ప్రిన్సిపాల్ కల్యాణ్ వర్మ ఇంటికి వచ్చింది. సోదరుడు బయటే ఉండగా విద్యార్థిని ఇంట్లోకి వెళ్లింది. కల్యాణ్ లోపలికి పిలిచి ఆమెపై చేయివేసి అనుచితంగా ప్రవర్తించాడు. తప్పించుకుని బయటకు వెళ్తుండగా హెచ్‌వోడీ రవీందర్ మెయిన్‌డోర్‌ను మూసేసి విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇద్దరినీ ప్రతిఘటించి తలుపులు తీసుకొని బయటకు పరుగుతీసింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా విద్యార్థిని కుటుంబీకులతో నిందితులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 9న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుల కోసం గాలిస్తున్నామని మాదాపూర్ సీఐ చెప్పారు. విద్యార్థి సంఘాల ఆందోళన కల్యాణ్ శర్మ, రవీందర్‌లపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి నేతలు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశాల డైరెక్టర్ వాణి ఒక మహిళ అయ్యుండి బాధితురాలి పక్షాన మాట్లాడకుండా బేరసారాలకు దిగారని ఆరోపించారు. ఆమెను ఘెరావ్ చేశారు. -
తేనెటీగల దాడి: శవాన్ని వదిలి పరుగో పరుగు!
సాక్షి, బెంగళూరు : ఓ వ్యక్తి చనిపోగా ఆయన అంత్యక్రియలు చేయడానికి వెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో శవ యాత్రలో పాల్గొన్నవారు మృతదేహాన్ని అక్కడే వదిలి పరుగులంఘించుకున్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలూకా హొసహళ్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిద్ధలింగప్ప అనే వృద్ధుడు కాలం చేయగా సోమవారం ఆయన శవాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ శివారులోని శ్మశానానికి అంత్యక్రియల కోసం బయలుదేరారు. శ్మశానంలో గంధపు చెక్కలు, అగరొత్తులు అంటించడంతో ఆ పొగ ఘాటుకు అక్కడి చెట్లపై ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా అక్కడున్న వారిపై దాడి చేశాయి. దీంతో కంగారుపడ్డ వారు శవాన్నిఅక్కడే వదిలి తలో దిక్కుకు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో 30 మందికిపైగా గాయపడగా వారిని ఆస్పత్రులకు తరలించారు. కాగా, కొంతమంది బంధువులు టార్పాల్, గోనె సంచుల సాయంతో ఎలాగోలా అంత్యక్రియలు పూర్తిచేశారు. -
రాంనగర్లో వ్యక్తి దారుణ హత్య
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం రాంనగర్ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు మన్నాపూర్ గ్రామానికి చెందిన విజయ్(36)గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు కర్రలతో కొట్టి హత్య చేశారు. విజయ్ జహీరాబాద్‌లో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నువ్వు ఆఫీసులో ఉంటే..మేం పనిలేక గ్రీవెన్స్‌లో ఉన్నామా?
రాంనగర్ : ‘‘నువ్వు ఆఫీసులో ఉంటే...మేం పని లేక గ్రీవెన్స్‌లో ఉన్నామా...కిందిస్థాయి ఉద్యోగిని పంపించి నువ్వేమి చేస్తున్నావ్...10 నిమిషాల్లో గ్రీవెన్స్‌లో ఉండాలి’’ అంటూ జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్‌పై ఫోన్లో కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గరిడేపల్లి మండలం పొనుగోడు పీఏసీఎస్‌లో ఎరువులు అధిక ధరలకు అమ్ముతుండడంతో పాటు సొసైటీకి వచ్చే ఎరువులను వ్యాపారులకు విక్రయిస్తున్నారని కొంతమంది రైతులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. దీంతో అధికారి ప్రసాద్ హుటాహుటిన గ్రీవెన్స్‌డేకు వచ్చి కలెక్టర్‌ను కలిశారు. ‘‘జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తే మీకు పట్టదా...గ్రీవెన్స్‌డేకు హాజరు కాకుండా కిందిస్థాయి ఉద్యోగిని పంపి అక్కడ ఏం చేస్తున్నావు’’ అంటూ అధికారిపై మండిపడ్డారు. ‘‘ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరి యా, ఇతర ఎరువుల ధరలు పెంచి విక్రయిస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు..ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు ఎందుకు ఇవ్వడంలేదు...సొసైటీ ద్వారా మనం ఎందుకు ఎరువులు సరఫరా చేస్తున్నాం...రైతులకు ఇబ్బందులు రావద్దనే కదా...కనీసం అక్కడ రిజిస్టర్ నిర్వహణ కూడా లేకుంటే ఎలా’ అంటూ కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎరువులను వ్యాపారులకు విక్రయిస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. సొసైటీని తనిఖీ చేసి నివేదికను మంగళవారం మధ్యాహ్నం లోగా అందించాలని డీసీఓను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించిన డీసీఓకు మెమో జారీ చేయాలని కలెక్టరేట్ ఏఓకు సూచించారు. -
నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రాంనగర్ : నాలుగో తరగతి ఉ ద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ నాలుగో త రగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్ కోరారు. సోమవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన నాలుగో తరగతి ఉద్యోగులకు వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు మాటూరి అశోక్, బాల ఈశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.లింగయ్య, ఉపాధ్యక్షులు జి.మారయ్య, ఉస్మాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రాజయ్య, సైదులు, శంకర్, లిం గయ్య, నిరంజన్, వెంకటేశ్వర్లు. రఘుపతి పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాజమల్లయ్య రాంనగర్ : తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడిగా జె.రాజమల్లయ్యను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. జ్ఞానేశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జిల్లా అధ్యక్షుడు భిక్షమయ్యను తొలగించి ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజమల్లయ్యను అందరి సమక్షంలో నియమించామన్నారు. ఈ మేరకు రాజమల్లయ్యను అధ్యక్షుడిగా గుర్తించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. -
23 నుంచి స్కూల్ చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ఈనెల 23నుంచి రాంనగర్‌లోని మదర్స్ హైస్కూల్లో జరుగనుంది. రాయల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో జరగనున్న ఈ టోర్నీలో స్కూల్ విద్యార్థులు మాత్రమే పోటీపడేందుకు అర్హులని చీఫ్ ఆర్బిటర్ ఎస్.సబ్బారాజు తెలిపారు. అండర్-7, 9, 11, 13, 14, 15 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. అలాగే వన్డే ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నీ కూడా అదే రోజు మదర్స్ హైస్కూల్లో నిర్వహించనున్నారు. 22లోగా తమ ఎంట్రీలను పంపించాలి. వివరాల కోసం ఎస్.సుబ్బారాజు (98667-02431), బి.వి.కుమార్ (92471-88018)లను సంప్రదించవచ్చు. -
వివాహిత దారుణ హత్య?
అనంతపురం క్రై ం, న్యూస్‌లైన్ : నగరంలోని రామ్‌నగర్‌లో ఓ వివాహితను ఆమె మరిది దారుణంగా హతమార్చాడన్న వదంతులు షికారు చేస్తుండగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ హత్యోదంతం బయటకు పొక్కకుండా నిందితులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చి వేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు న్యూస్‌లైన్‌కు అందిన వివరాలు ఇలా వున్నాయి. రామ్‌నగర్‌లోని కమ్మభవన్ సమీపంలో ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు, రఘువీరా టవర్స్‌లోని ఓ బ్యూటీ పార్లర్లో శిక్షణకు వెళుతున్న కమలానగర్‌కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు అవమానంగా భావించి తమ ఇంటిని అమ్మేసి హైదరాబాదు చేరుకున్నారు. శిక్షణకు రావద్దంటూ బ్యూటీ పార్లర్ శిక్ష కురాలు కూడా ఆ యువతికి చెప్పింది. ఈ నేపథ్యంలో భర్త, అత్తారిల్లే లోకంగా జీవనం సాగిస్తుండేది. స్థానికంగా ఓ ఫుడ్ క్యాటరింగ్లో ఆమె సోదరుడు పని చేస్తున్నా.. చెల్లెలిని కలిసే అవకాశం ఉండేది కాదని, ఏడాదిలో ఒకటి, రెండుమార్లు ఫోన్లో మాట్లాడేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆదివారం మృతి చెందింది. తన అన్న కులాంతర వివాహం చేసుకోవడం నచ్చకనో... మరే ఇతర కారణాలో గానీ మరిదే ఆమెపై కత్తితో దాడి చేసి హతమార్చాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె మృతిని దాచిన భర్త, కుటుంబీకులు.. ఆమెది సాధారణ మృతి అని చుట్టుపక్కల వారు నమ్మేలా ప్రచారం చేసి వారి మతాచారం మేరకు రాత్రికి రాత్రే అంత్యక్రియలు ముగించినట్లు సమాచారం. ఆమె కమలానగర్‌కు చెందినదని తెలుసుకున్న స్థానికులు, ఆమె బంధువుల వివరాలు కూడా లేకపోవడంతో దీనిపై పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా చికెన్ కొట్టు బంద్ చేసినట్లు నిర్వాహకుడి కుటుంబ సభ్యులు చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు. ఇక జులాయిగా తిరుగుతున్న ఆమె మరిది కూడా వదిన అంత్యక్రియలకు రాకపోవడంతో అనుమానాలు రెట్టింపయ్యాయంటున్నారు. స్థానికులు కొందరు టూ టౌన్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులుగా సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా రహస్యంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. విషయంపై టూ టౌన్ పోలీసులను ఆరా తీయగా ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. మృతురాలికి ఓ ఆడబిడ్డ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె బంధువులెవరూ ఈ సంఘటనపై స్పందించలేదని సమాచారం.